హైదరాబాద్‌లో ఒక ప్రత్యేకమైన షోరూమ్ ప్రారంభించిన టాటా మోటార్స్.. ఇది చాలా స్పెషల్: ఎందుకంటే?

సాధారణంగా ప్రతి ఒక్కరూ మహిళలు ముందుకు రావాలి, అభివృద్ధి చెందాలి అని లెక్కకు మించిన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. అయితే ఇవి ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటాయి. అయితే మహిళా అభివృద్ధికి దోహదపడేవారు గానీ, సంస్థలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మహిళల అభివృద్ధికి మేము ఉన్నాము అంటూ 'టాటా మోటార్స్' (Tata Motors) ముందుకు వచ్చింది.

Recommended Video

Tata Nexon EV Max తెలుగు రివ్యూ | రీజెన్ బ్రేకింగ్, సింగిల్-ఫుట్ డ్రైవింగ్, కొత్త ఫీచర్స్

దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

దక్షిణ భారతదేశంలో మొదటి టాటా ఆల్-ఉమెన్ షోరూమ్.. అక్కడ అందరూ మహిళలే

టాటా మోటార్స్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తన మొదటి 'ఆల్-ఉమెన్' ప్యాసింజర్ వెహికల్ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రారంభమైంది. ఈ షోరూమ్‌లో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు, ఇందులో మొత్తమ్ 20 మంది మహిళలు ఉంటారు.

దక్షిణ భారతదేశంలో మొదటి టాటా ఆల్-ఉమెన్ షోరూమ్.. అక్కడ అందరూ మహిళలే

టాటామోటార్స్ తన డీలర్ భాగస్వామి 'వెంకటరమణ మోటార్స్‌'తో కలిసి ఈ కొత్త షోరూమ్‌ని ప్రారంభించింది. ఇటీవలి కాలంలో టాటా మోటార్స్ మహిళా కస్టమర్లలో 30 శాతం వృద్ధిని సాధించింది. ఈ సమయంలో ఆల్-ఉమెన్ షోరూమ్‌ను ప్రారంభించడం కోసం వెంకటరమణ మోటార్స్‌కు మద్దతును అందించింది.

దక్షిణ భారతదేశంలో మొదటి టాటా ఆల్-ఉమెన్ షోరూమ్.. అక్కడ అందరూ మహిళలే

టాటా మోటార్స్ దక్షిణ ప్రాంతంలో తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తృతంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ ప్రాంతంలో 319 అవుట్‌లెట్‌లు మరియు 163 సర్వీస్ సెంటర్‌లను కలిగి ఉంది. ఇప్పుడు కంపెనీ ప్రారంభించిన తన మొదటి ఆల్-ఉమెన్ ప్యాసింజర్ వెహికల్ షోరూమ్‌ 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో మొదటి టాటా ఆల్-ఉమెన్ షోరూమ్.. అక్కడ అందరూ మహిళలే

ముందు చెప్పుకున్నట్లుగా ఇందులో పనిచేసే 20 మంది మహిళల బృందం సేల్స్, ఆఫ్టర్ సేల్స్, వాలెట్, హౌస్ కీపింగ్ సెక్యూరిటీ మరియు ఇతర కార్యకలాపాలను చూసుకుంటారు. అంటే ఇందులో మొత్తం మహిళల ఆధీనంలో ఉంటుంది.

దక్షిణ భారతదేశంలో మొదటి టాటా ఆల్-ఉమెన్ షోరూమ్.. అక్కడ అందరూ మహిళలే

టాటా మోటార్స్ యొక్క వృద్ధికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎంతగానో దోహదపడుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికల్ అమ్మకాల్లో కంపెనీ మొత్తమ్ 82 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో 13 శాతం మార్కెట్ వాటా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి పొందింది. కావున కంపెనీ వృద్ధికి సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాలు మూలస్తంభాగాలుగా ఉన్నాయి.

దక్షిణ భారతదేశంలో మొదటి టాటా ఆల్-ఉమెన్ షోరూమ్.. అక్కడ అందరూ మహిళలే

ఆల్-ఉమెన్ షోరూమ్‌ ప్రారంభం సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ మరియు కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ 'రాజన్ అంబ' మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఉమెన్ ప్యాసింజర్ వెహికల్స్ షోరూమ్ కోసం వెంకటరమణ మోటార్స్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం మాకు సంతోషంగా ఉంది అన్నారు.

దక్షిణ భారతదేశంలో మొదటి టాటా ఆల్-ఉమెన్ షోరూమ్.. అక్కడ అందరూ మహిళలే

అంతే కాకుండా.. అమ్మకాల ప్రాతిపదికన టాటా మోటార్స్ మాత్రమే మహిళా కస్టమర్లలో 30% కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేయగలిగింది. అయితే మహిళలో మరింత చైతన్యం తీసుకురావడానికి ఈ కొత్త షోరూమ్ ప్రారంభించడం జరిగిందన్నారు.

దక్షిణ భారతదేశంలో మొదటి టాటా ఆల్-ఉమెన్ షోరూమ్.. అక్కడ అందరూ మహిళలే

ఈ సందర్భంగా వివిసి అండ్ విఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'రాజేంద్ర ప్రసాద్' మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఈ కొత్త ఆల్-వుమెన్ లీడ్ షోరూమ్‌ను ప్రారంభించడం ద్వారా టాటా మోటార్స్‌తో మా దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కొనసాగించడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల్లో టాటా మోటార్స్ ఒకటి. అయితే కంపెనీ యొక్క ప్యాసింజర్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ దృష్టిలో ఉంచుకుని కొత్త షోరూమ్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దక్షిణ భారతదేశంలో మొదటి టాటా ఆల్-ఉమెన్ షోరూమ్.. అక్కడ అందరూ మహిళలే

టాటా మోటార్స్‌కు తెలంగాణలో ప్రత్యేకంగా 18 టచ్‌పాయింట్‌లను సేల్స్ నెట్‌వర్క్‌తో విస్తరించి ఉంది. కావున కంపెనీ యొక్క అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావించవచ్చు.

దక్షిణ భారతదేశంలో మొదటి టాటా ఆల్-ఉమెన్ షోరూమ్.. అక్కడ అందరూ మహిళలే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో టాటా మోటార్స్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే కంపెనీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మొట్ట మొదటి ఆల్-వుమెన్ షోరూమ్‌ ప్రారంభించింది. ఇది బహుశా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి వుమెన్ షోరూమ్‌ అని భావిస్తున్నాము. అయితే టాటా మోటార్స్ యొక్క బాటలో రానున్న రోజుల్లో ఇతర కంపెనీలు కూడా పయనించే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త కార్లు మరియు కొత్త బైకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 27, 2022, 14:17 [IST]
English summary
Tata motors inaugurates all women car showroom in hyderabad details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+