ఎలక్ట్రిక్ కారు కొనేవారికి "షాక్" ఇచ్చిన టాటా మోటార్స్.. నెక్సాన్ ఈవీ ధరలో రూ.60,000 వరకూ పెంపు!

టాటా మోటార్స్ (Tata Motors) అందిస్తున్న పాపులర్ ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీ ధరలను కంపెనీ మరోసారి భారీగా పెంచింది. దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారును కొనేందుకు కస్టమర్లు క్యూ కడుతుంటే, టాటా మోటార్స్ మాత్రం దీని ధరను నెలల వ్యవధిలోనే భారీగా పెంచుతూ కస్టమర్లకు షాక్ ఇస్తోంది. తాజాగా టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) ధరను కంపెనీ గరిష్టంగా రూ.60,000 వరకూ పెంచింది. ఇప్పుడు కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి దాని పాత ధరపై కనిష్టంగా రూ.20,000 నుండి గరిష్టంగా రూ.60,000 వరకూ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ఎలక్ట్రిక్ కారు కొనేవారికి

ధరలు పెంచడానికి ముందు బేస్ మోడల్ అయిన టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ఎమ్ వేరియంట్ ధర రూ.14.54 లక్షలుగా ఉంటే, ధరల పెంపు అనంతరం ఇది రూ.14.99 లక్షలకు చేరుకుంది. అంటే, ఈ వేరియంట్ పై గరిష్టంగా రూ.45,000 ధర పెరిగింది. ఇకపోతే, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ 7.2 కిలోవాట్ వేరియంట్ ధర రూ.60,000 పెరిగి రూ.19.24 లక్షల నుండి రూ.19.84 లక్షలకు చేరుకుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

ఎలక్ట్రిక్ కారు కొనేవారికి

టాటా నెక్సాన్ ఈవీ యొక్క అన్ని వేరియంట్ల కొత్త ధరలు ఇలా ఉన్నాయి:

Tata Nexon EV XM - రూ.14,99 లక్షలు

Tata Nexon EV XZ+ - రూ.16.30 లక్షలు

Tata Nexon EV XZ+ LUX - రూ.17.30 లక్షలు

Tata Nexon EV Dark XZ+ - రూ.16.49 లక్షలు

Tata Nexon EV Dark XZ+ LUX - రూ.17.50 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

ఎలక్ట్రిక్ కారు కొనేవారికి

ఈ మోడల్ లో లాంగ్ రేంజ్ వెర్షన్ అయిన టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క అన్ని వేరియంట్ల కొత్త ధరలు ఇలా ఉన్నాయి:

Tata Nexon EV Max XZ+ 3.3 kW - రూ.18.34 లక్షలు

Tata Nexon EV Max XZ+ 7.2 kW - రూ.18.84 లక్షలు

Tata Nexon EV Max XZ+ LUX 3.3 kW - రూ.19.34 లక్షలు

Tata Nexon EV Max XZ+ LUX 7.2 kW - రూ.19.84 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

ఎలక్ట్రిక్ కారు కొనేవారికి

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేయబడింది. ఇది స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ కన్నా అధిక రేంజ్ ను ఆఫర్ చేసే పెద్ద బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. కాగా, ఈ మోడల్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ ఇందులోని అన్ని వేరియంట్ల ధరను రూ.60,000 మేర పెంచింది. గడచిన మే 2022 నెలలో కంపెనీ ఈ కారును రూ.17.74 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. తాజా ధరల పెంపు తర్వాత ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.18.34 లక్షలకు చేరుకుంది. అంటే, ఇది 60 వేల రూపాయల పెంపును అందుకుంది. మిగిలిన మూడు వేరియంట్ల పరిస్థితి కూడా ఇదే.

ఎలక్ట్రిక్ కారు కొనేవారికి

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) పూర్తి చార్జ్ పై గరిష్టంగా 437 కిలోమీటర్ల (ARAI సర్టిఫైడ్) రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ సుధీర్ఘమైన రేంజ్ ను సాధించడం కోసం టాటా మోటార్స్ ఇందులో పెద్ద 40.5kWh బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించింది. స్టాండర్డ్ మోడల్ నెక్సాన్ ఈవీ పూర్తి చార్జ్ పై కేవలం 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను మాత్రమే అందిస్తుంటే, ఈ లాంగ్ రేంజ్ వేరియంట్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ దాని కన్నా 125 కిలోమీటర్లు ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది.

ఎలక్ట్రిక్ కారు కొనేవారికి

స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రెండూ కూడా డిజైన్ పరంగా చూడటానికి ఒకేలా ఉంటాయి. అయితే, స్టాండర్డ్ నెక్సాన్ ఈవీతో పోలిస్తే, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఇప్పుడు కొత్తగా 30 అదనపు ఫీచర్లతో ప్యాక్ చేయబడింది. ఇందులో మల్టీ-లెవల్ రీజెన్ బ్రేకింగ్‌ సిస్టమ్, యాక్టివ్ మోడ్ డిస్‌ప్లేతో కూడిన కంట్రోల్ నాబ్, సరికొత్త మకరనా బేజ్ ఇంటీరియర్స్, ముందు ప్రయాణికుల కోసం వెంటిలేషన్‌తో కూడిన లెథెరెట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మరియు క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కారు కొనేవారికి

అంతే కాకుండా, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్లలో I-VBAC (ఇంటెలిజెంట్ - వాక్యూమ్-లెస్ బూస్ట్ అండ్ యాక్టివ్ కంట్రోల్), హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటో వెహికల్ హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు 4 చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా ఈ వేరియంట్ డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కేవలం 9 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 140 కిమీ టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది.

ఎలక్ట్రిక్ కారు కొనేవారికి

టాటా మోటాకర్స్ తమ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ను రెండు రకాల చార్జర్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. వీటిలో XZ+ మరియు XZ+ Lux అనే రెండు వేరియంట్లు కూడా 3.3kW చార్జర్ మరియు 7.2kW ఏసి ఫాస్ట్ చార్జర్‌తో లభిస్తాయి. చార్జింగ్ విషయానికి వస్తే, ఈ బ్యాటరీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జర్లను రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క 40.5kWh బ్యాటరీ ప్యాక్‌ను వేగవంతమైన 50kW DC ఛార్జర్‌కి కనెక్ట్ చేసినప్పుడు కేవలం 56 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే కొత్త 7.2kWh AC ఛార్జర్‌ సాయంతో అయితే బ్యాటరీ పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 12, 2022, 16:37 [IST]
English summary
Tata motors increases nexon ev prices by up to rs 60000 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+