టాటా కార్లపై జూన్ 2022 నెల ఆఫర్లు.. రూ.60,000 వరకు డిస్కౌంట్స్
గడచిన మే 2022 నెలలో భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా నిలిచిన టాటా మోటార్స్ (Tata Motors), తన స్థానాన్ని అలానే నిలుపుకునేందుకు జూన్ నెలలో కూడా భారీ అమ్మకాలను సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ తమ కార్లపై జూన్ 2022 నెల ఆఫర్లను ప్రకటించింది. ఈనెలలో టాటా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు సుమారు రూ.60,000 వరకు తగ్గింపులను మరియు వివిధ రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

టాటా మోటార్స్ విక్రయిస్తున్న టియాగో, టిగోర్, నెక్సాన్, సఫారీ మరియు హారియర్ మోడళ్లపై కంపెనీ కార్పొరేట్ డిస్కౌంట్లు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తోంది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ ను బట్టి గరిష్టంగా 60,000 వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, టాటా నుండి బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ గా ఉన్న ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్ ఈవీస టిగోర్ ఈవీ మరియు సిఎన్‌జి వెర్షన్ టియాగో మరియు టిగోర్ కార్లపై ఎలాంటి తగ్గింపులు ప్రకటించబడలేదు.

టాటా హారియర్ (Tata Harrier)
టాటా మోటార్స్ అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ టాటా హారియర్ కారుపై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ.60,000 వరకూ తగ్గింపును ప్రకటించింది. ఇందులో ఎక్స్చేంజ్ బోనస్ గరిష్టంగా రూ. 40,000 మరియు కార్పొరేట్ తగ్గింపు రూ. 20,000 వరకు ఉంటాయి. టాటా హారియర్ ఈ విభాగంలో ఎమ్‌జి హెక్టర్, హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. ఇది 170 హార్స్ పవర్ శక్తిని జనరేట్ చేసే 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

టాటా సఫారి (Tata Safari)
టాటా హారియర్ ఎస్‌యూవీ ఆధారంగా తయారు చేయబడిన 7-సీటర్ ఎస్‌యూవీ టాటా సఫారీ పై కంపెనీ జూన్ 2022 నెల ఆఫర్లలో భాగంగా మొత్తం రూ.40,000 వరకు తగ్గింపులను ప్రకటించింది. ఈ మొత్తం తగ్గింపు కూడా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూపంలో ఉంటుంది. ఈ డిస్కౌంట్ పొందాలంటే, కస్టమర్లు తమ పాత కారును టాటా డీలర్‌షిప్ లలో ఎక్సేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. టాటా సఫారి ఈ విభాగంలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 మరియు ఎమ్‌జి హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. ఇది 170 హెచ్‌పి పవర్ ను జనరేట్ చేసే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది.

టాటా టియాగో (Tata Tiago)
టియాగో టాటా మోటార్స్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ కారు. ఇది మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ వంటి చిన్న కార్లకు పోటీగా ప్రవేశపెట్టబడింది. ఈ హ్యాచ్‌బ్యాక్ 86 హెచ్‌పి శక్తిని జనరేట్ చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది అత్యుత్తమ భద్రత, సౌకర్యం మరియు అద్భుతమైన వినియోగంతో కూడిన మంచి ఫ్యామిలీ కారు. ఈనెలలో టాటా టియాగో XE, XM మరియు XT వేరియంట్‌లపై రూ.21,500 వరకు మరియు XZ వేరియంట్‌పై రూ.31,500 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులోని CNG వేరియంట్‌లపై ఎలాంటి తగ్గింపు లేదు.

టాటా టిగోర్ (Tata Tigor)
టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ యొక్క సెడాన్ వెర్షనే టాటా టిగోర్. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు (సబ్-4 మీటర్) ఉండే ఈ కాంపాక్ట్ సెడాన్ ఈ విభాగంలో మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ మరియు హ్యుందాయ్ అరా వంటి మోడళ్లతో పోటీపడుతుంది. జూన్ 2022 నెల ఆఫర్లలో భాగంగా, టాటా టిగోర్ కారుపై కంపెనీ ఈ నెలలో రూ.31,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. ఇందులో XE మరియు XM వేరియంట్‌లపై రూ.21,500 తగ్గింపు మరియు XZ వేరియంట్‌పై అదనంగా రూ.10,000 తగ్గింపును ప్రకటించారు. కాగా, టిగోర్ సిఎన్‌జి వేరియంట్‌లపై ఎలాంటి తగ్గింపు లేదు.

టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో టాటా నెక్సాన్ మొదటి స్థానంలో ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్‌తో కూడా లభిస్తుంది. ఈ నెలలో టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్లపై రూ.6,000 వరకు మరియు డీజిల్ వేరియంట్లపై రూ.10,000 వరకు తగ్గింపులను కంపెనీ అందిస్తోంది. కాగా, ఇందులోని ఈవీ వెర్షన్ పై మాత్రం ఎలాంటి తగ్గింపులు ప్రకటించబడలేదు. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి విటారా బ్రెజ్జా, టొయోటా అర్బన్ క్రూయిజర్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

టాటా హారియర్‌లో 3 కొత్త వేరియంట్ల విడుదల
ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ గడచిన మే 2022 నెలలో తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ హారియర్ (Harrier) లో కంపెనీ కొత్తగా మరో మూడు వేరియంట్లను పరిచయం చేసింది. హారియర్ ఎస్‌యూవీని కొనాలనుకునే వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లను అందించాలనే లక్ష్యంతో, టాటా మోటార్స్ హారియర్ కోసం ఎక్స్‌జెడ్ఎస్, ఎక్స్‌జెడ్ఎస్ డ్యూయల్-టోన్ మరియు ఎక్స్‌జెడ్ఎస్ డార్క్ ఎడిషన్ అనే మూడు కొత్త వేరియంట్‌లను పరిచయం చేసింది. వీటి ధరలు రూ.20 లక్షల నుంచి రూ.21.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications