మనసు దోచే 'Tata Kaziranga Editions' కొత్త TVC వీడియో.. తప్పకుండా చూడాల్సిందే
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారతీయ మార్కెట్లో ఇటీవల తన కజిరంగా ఎడిషన్స్ విడుదల చేసిన విషయం చేసిన విషయం తెలిసిందే. ఇందులో టాటా నెక్సాన్, టాటా పంచ్, టాటా సఫారీ మరియు టాటా హారియర్ ఉన్నాయి. అయితే కంపెనీ ఇప్పుడు ఈ కజిరంగా ఎడిషన్స్ యొక్క TVC వీడియో విడుదల చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ TVC వీడియోలో అనేక జంతువులు మరియు పక్షులను కూడా చూడవచ్చు. ఇందులో అద్భుతమైన కజిరంగా నేషనల్ పార్క్ చూడవచ్చు. అంతే కాకుండా ఈ వీడియోలో ఏనుగు, జింకలు మరియు ఖడ్గమృగం వంటివి కూడా ఉన్నాయి. ఈ వీడియోలో ఈ జంతువుల సమక్షంలో కొత్త కజిరంగా ఎడిసన్స్ కదులుతున్నట్లు చూడవచ్చు. ఈ వీడియో చూడటానికి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

కంపెనీ విడుదల చేసిన నాలుగు SUV లు కజిరంగా నేషనల్ పార్క్ నుంచి ప్రేరణ పొందాయి. ఇవన్నీ కూడా ఈ వాతావరణంలో ఒక భాగంగా కలిసిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా లైట్ బీజ్ కలర్ లో ఉన్నాయి. అయితే ఇందులో రూప్, డోర్ హ్యాండిల్స్ మరియు ఓఆర్విఎమ్ వంటివి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఎక్స్టీరియర్ కలర్ చూడచక్కగా ఉంది, అయితే ఇంటీరియర్ ఎర్త్ లైట్ బీజ్ కలర్ లో ఉంది. ఇది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఇంటీరియర్ కలర్ ఒక మధురమైన అనుభూతిని ప్రయాణికులకు తప్పకుండా కల్పిస్తుంది. కావున తప్పకుండా ఇవన్నీ కొనుగోలుదారులకు ఆకర్షిస్తాయి.

కంపెనీ విడుదల చేసిన ఈ కజిరంగా ఎడిషన్స్ లో కూడా.. టాటా పంచ్ కజిరంగా ఎడిషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది 2022 IPL లో దర్శనమిస్తుంది. ఆ తరువాత ఇది వేలంలో విక్రయించబడుతుంది. ఈ వేలం నుంచి వచ్చిన మొత్తాన్ని కజిరంగా నేషనల్ పార్క్ పరిరక్షణకు విరాళంగా ఇవ్వబడుతుంది.

కజిరంగా ఎడిషన్స్ అనేవి అడవి జంతువుల నుండి ప్రేరణ పొందిన ఫస్ట్ ఎడిషన్స్ అవుతాయి. దీని కారణంగా ఈ స్పెషల్ ఎడిషన్స్ అన్నీ కూడా ఆ చిహ్నాలతో ఉంటాయి. వీటిని మీరు లోపే మరియు బయట కూడా గమనించవచ్చు. ఇందులో బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్, బ్యాడ్జ్‌లు మరియు డీక్రోమ్డ్ ఎలిమెంట్స్ ఈ కలర్‌తో చాలా బాగున్నాయి.

ఇక వీటి యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇవి డ్యూయల్-టోన్ స్కీమ్‌లతో బీజ్ లెథెరెట్ అపోల్స్ట్రే కలిగి, ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్‌తో వస్తాయి. అయితే నెక్సాన్, హారియర్ మరియు సఫారీ డ్యాష్‌బోర్డ్ మధ్యలో వుడ్ ట్రిమ్స్ పొందుతాయి. కానీ టాటా పంచ్ మాత్రం బీజ్ ట్రై-యారో ఫినిషింగ్ పొందుతుంది.

వీటిలోని డోర్ ప్యాడ్‌లు మరియు సీట్ అపోల్స్ట్రే కూడా డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు బ్రాంజ్ ట్రీట్‌మెంట్‌ను పొందుతాయి. ఈ నాలుగు మోడళ్ల ముందు సీటు హెడ్‌రెస్ట్‌లు మీద ఒక కొమ్ము గల ఖడ్గమృగం యొక్క సిల్హౌట్‌ను చూడవచ్చు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇక ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే, పంచ్ టాటా యొక్క iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్‌ను పొందుతుంది. నెక్సాన్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు ఆటో-డిమ్మింగ్ IRVM వంటి వాటిని పొందుతుంది.
కొత్త టాటా హారియర్ మరియు సఫారీలు కూడా ఎయిర్ ప్యూరిఫైయర్, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను కూడా పొందుతాయి. సఫారీ, గోల్డ్ ఎడిషన్ మోడల్‌ల మాదిరిగానే, వెంటిలేటెడ్ రెండవ వరుస సీట్లను కలిగి ఉంటుంది.

టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ కొత్త మోడల్స్ యొక్క ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేదు. కావున టాటా పంచ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, నెక్సాన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో కొనసాగుతుంది. ఇక టాటా హారియర్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు సఫారీ కూడా అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇందులో గేర్‌బాక్స్ ఆప్సన్స్ కూడా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి, కావున మంచి పనితీరుని అందిస్తాయి.


Click it and Unblock the Notifications








