Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

భారతదేశపు వాహన తయారీ దిగ్గజం అయిన 'టాటా మోటార్స్' (Tata Motors) గ్రామీణ వినియోగదారులకు డోర్-టు డోర్ కార్ కొనుగోలు అనుభూతిని అందించడానికి ఒక కొత్త మొబైల్ షోరూమ్‌ ప్రారంభించింది. కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త మొబైల్ షోరూమ్‌ పేరు 'అనుభవ్'. ఇది ఇప్పుడు వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహన కొనుగోలుదారుల కోసం ఈ ప్రత్యేకమైన మొబైల్ షోరూమ్‌ ప్రారంభించడం జరిగింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త విధానం కింద అన్ని గ్రామీణా ప్రాంతాల్లో తమ పరిధిని విస్తరించనుంది. కంపెనీ గ్రామీణ ప్రాంతాలలో తన పరిధిని విస్తరించడానికి దేశవ్యాప్తంగా మొత్తం 103 మొబైల్ షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

టాటా మోటార్స్ ప్రారంభించిన ఈ మొబైల్ షోరూమ్‌లు వినియోగదారులకు డోర్-టు డోర్ సెల్లింగ్ అనుభవాన్ని అందించడానికి ప్రస్తుత డీలర్‌షిప్‌లకు సహాయపడతాయి. తద్వారా కంపెనీ యొక్క అమ్మకాలు పెరుగుతాయి. అంతే కాకూండా ఈ మొబైల్ షోరూమ్‌లు ద్వారా తమకు ఇష్టమైన కార్లు, యాక్ససరీస్, ఫైనాన్స్ స్కీమ్‌లు మరియు టెస్ట్ డ్రైవ్‌ వంటి వాటిని గురించి తెలుసుకోవచ్చు.

Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ గురించి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ & కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ 'రాజన్ అంబ' మాట్లాడుతూ.. ఇది వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ కొత్త మొబైల్ షోరూమ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా మారు మూల ప్రాంతాలకు కూడా కంపెనీ యొక్క వాహనాలను పరిచయం చేయవచ్చు.

Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

ఈ మొబైల్ షోరూమ్ లు కంపెనీ యొక్క కార్లు, ఫైనాన్స్ పథకాలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు మొదలైన వాటి గురించి గ్రామీణ వినియోగదారులకు సమాచారాన్ని అందిస్తాయి. కావున ఇప్పుడు కంపెనీ యొక్క వాహనాలను గురించి తెలుసుకోవడానికి కంపెనీ డీలర్షిప్ సందర్శించాల్సిన అవసరం లేదు. ఇది కొనుగోలుదారుల యొక్క సమయాన్ని కూడా చాలావరకు ఆదా చేస్తుంది.

Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

అంతే కాకూండా కస్టమర్ల పరిధిని మరింత మెరుగుపరచడానికి ఈ కొత్త అనుభవ్ మొబైల్ షోరూమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశంలో విక్రయించే మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో గ్రామీణ భారత విక్రయాలు 40 శాతం వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు కంపెనీ యొక్క అమ్మకాలు ఈ కొత్త అనుభవ్ ద్వారా తప్పకుండా మరింత మెరుగుపడతాయి.

Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

టాటా అనుభవ్ మొబైల్ షోరూమ్ ద్వారా అన్ని డీలర్‌షిప్‌లు వ్యాన్‌ల మార్గాలను నిర్దేశిస్తుంది. దీని ద్వారా వారు అన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ విధానం ద్వారా తప్పకుండా కంపెనీ మంచి అమ్మకాలను పొందుతుంది. కావున దేశీయ మార్కెట్లో గ్రామీణ అమ్మకాలు తప్పకుండా పెరుగుతాయి.

Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ ఇటీవల తన ఫిబ్రవరి అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్కెట్లో మొత్తం 77,733 యూనిట్లను విక్రయించగలిగింది. అయితే ఇదే నెల గత సంవత్సరం మార్కెట్లో మొత్తం 58,366 యూనిట్లను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే అమ్మకాల్లో కంపెనీ మునుపటికంటే కూడా 27% వృద్ధిని నమోదు చేసింది.

Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

టాటా మోటార్స్ 37,552 యూనిట్ల కమర్షియల్ వాహనాలు మరియు 39,981 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఫిబ్రవరి 2021లో విక్రయించిన 27,225 యూనిట్లతో పోలిస్తే ఇది 47% పెరిగింది. అదే విధంగా ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ 2021 ఫిబ్రవరి నెలలో 26,733 యూనిట్ల నుండి 39% వృద్ధితో 37,135 యూనిట్లకు చేరుకుంది.

Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కంపెనీ మొత్తం 2,846 యూనిట్లను విక్రయించగలిగింది. ఇది 2021 ఫిబ్రవరి నెలలోని 492 యూనిట్లతో పోలిస్తే 478% పెరిగింది. అదేవిధంగా కమర్షియల్ వెహికల్ విభాగంలో, దేశీయ మార్కెట్లో 33,894 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది మునుపటి సంవత్సరం కంటే 9% వృద్ధిని నమోదు చేసింది.

Tata 'అనుభవ్' మొబైల్ షోరూమ్‌ ద్వారా మీ ఇంటివద్దకే కారు.. పూర్తి వివరాలు

టాటా మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం, కంపెనీ యొక్క పాత మోడళ్లతో పాటు ఇటీవల విడుదలైన కొత్త మోడల్స్ కి కూడా మంచి స్పదన వస్తోంది. ఈ కారణంగా కంపెనీ మంచి అమ్మకాలతో మంచి వృద్ధిని నమోదు చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త టాటా పంచ్ 32,000 యూనిట్ల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది.

Article Published On: Friday, March 4, 2022, 14:08 [IST]
English summary
Tata motors launched anubhav showroom on wheels to reach rural areas details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+