భారత్‌లో పరుగులు పెడుతున్న టాటా టియాగో కార్లు.. ఆరేళ్లలో నాలుగు లక్షల యూనిట్ల ఉత్పత్తి..

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ కారు టాటా టియాగో (Tata Tiago) మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ ఇప్పటి వరకూ భారతదేశంలో నాలుగు లక్షల టియాగో కార్లను ఉత్పత్తి చేసింది. టాటా మోటార్స్ తమ టియాగో కారును తొలిసారిగా 2016లో భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ మోడల్ అమ్మకాలు స్థిరంగా సాగుతున్నాయి. గడచిన 6 ఏళ్లలో టాటా మోటార్స్ మొత్తం 4,00,000 టియాగో కార్లను తయారు చేసింది.

భారత్‌లో పరుగులు పెడుతున్న టాటా టియాగో కార్లు.. ఆరేళ్లలో నాలుగు లక్షల యూనిట్ల ఉత్పత్తి..

టాటా మోటార్స్‌కు గుజరాత్‌లోని సనంద్ వద్ద ప్లాంట్‌లో టియాగో కారు ఉత్పత్తి చేయబడుతుంది. టియాగో ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా టాటా మోటార్స్ తయారు చేసిన 4,00,000 టియాగో కారును కంపెనీ అధికారులు సనంద్ ప్లాంట్ నుంచి బయటకు విడుదల చేశారు. టాటా టియాగో అతి తక్కువ సమయంలో ఈ మైలురాయిని సాధించడం పట్ల కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది. టాటా మోటార్స్ ఫరెవర్ మోడల్‌లో రేంజ్ ఈ మైలురాయిని సాధించిన తొలి టాటా కారు కూడా ఇదేనని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో పరుగులు పెడుతున్న టాటా టియాగో కార్లు.. ఆరేళ్లలో నాలుగు లక్షల యూనిట్ల ఉత్పత్తి..

టాటా టియాగో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అలాగే, ఇందులో ఇటీవలే సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో కూడిన వేరియంట్లను కూడా విడుదల చేయడం జరిగింది. టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఎన్ఆర్‌జి అనే స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను కూడా విక్రయిస్తోంది. దేశీయ విపణిలో టాటా టియాగో ధరలు రూ. 5.22 లక్షల నుండి ప్రారంభమై రూ. 7.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకూ ఉన్నాయి.

భారత్‌లో పరుగులు పెడుతున్న టాటా టియాగో కార్లు.. ఆరేళ్లలో నాలుగు లక్షల యూనిట్ల ఉత్పత్తి..

టాటా టియాగో పెట్రోల్ ఇంజన్, మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్లు మరియు ధరలు:

* టాటా టియాగో ఎక్స్ఈ - రూ.5.23 లక్షలు (మ్యాన్యువల్)

* టాటా టియాగో ఎక్స్‌టిఓ - రూ.5.68 లక్షలు (మ్యాన్యువల్)

* టాటా టియాగో ఎక్స్‌టి - రూ.5.83 లక్షలు (మ్యాన్యువల్)

* టాటా టియాగో ఎక్స్‌జెడ్ - రూ.6.23 లక్షలు (మ్యాన్యువల్)

* టాటా టియాగో ఎక్స్‌జెడ్ ప్లస్ - రూ.6.66 లక్షలు (మ్యాన్యువల్)

* టాటా టియాగో ఎక్స్‌జెడ్ ప్లస్ డిటి - రూ.6.78 లక్షలు (మ్యాన్యువల్)

భారత్‌లో పరుగులు పెడుతున్న టాటా టియాగో కార్లు.. ఆరేళ్లలో నాలుగు లక్షల యూనిట్ల ఉత్పత్తి..

టాటా టియాగో పెట్రోల్ ఇంజన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లు మరియు ధరలు:

* టాటా టియాగో ఎక్స్‌టిఏ - రూ.6.38 లక్షలు (ఆటోమేటిక్)

* టాటా టియాగో ఎక్స్‌జెడ్ఏ - రూ.6.78 లక్షలు (ఆటోమేటిక్)

* టాటా టియాగో ఎక్స్‌జెడ్ఏ ప్లస్ - రూ.7.21 లక్షలు (ఆటోమేటిక్)

* టాటా టియాగో ఎక్స్‌జెడ్ఏ ప్లస్ డిటి - రూ.7.21 లక్షలు (ఆటోమేటిక్)

టాటా టియాగో ఐసిఎన్‌జి, మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్లు మరియు ధరలు:

* టాటా టియాగో ఎక్స్ఈ - రూ.6.13 లక్షలు (సిఎన్‌జి)

* టాటా టియాగో ఎక్స్ఎమ్ - రూ.6.43 లక్షలు (సిఎన్‌జి)

* టాటా టియాగో ఎక్స్‌టి - రూ.6.73 లక్షలు (సిఎన్‌జి)

* టాటా టియాగో ఎక్స్‌జెడ్ ప్లస్ - రూ.7.56 లక్షలు (సిఎన్‌జి)

* టాటా టియాగో ఎక్స్‌జెడ్ ప్లస్ డిటి - రూ.7.68 లక్షలు (సిఎన్‌జి)

భారత్‌లో పరుగులు పెడుతున్న టాటా టియాగో కార్లు.. ఆరేళ్లలో నాలుగు లక్షల యూనిట్ల ఉత్పత్తి..

టాటా టియాగో ఎన్‌ఆర్‌జి విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.6.66 లక్షలు మరియు రూ.7.21 లక్షలుగా ఉన్నాయి (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఏప్రిల్ 21, 2022 నాటికి).

భారత్‌లో పరుగులు పెడుతున్న టాటా టియాగో కార్లు.. ఆరేళ్లలో నాలుగు లక్షల యూనిట్ల ఉత్పత్తి..

ప్రస్తుతం టాటా టియాగో ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో ఉపయోగించిన 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్ శక్తిని మరియు 3300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ టాటా టియాగో లీటరుకు 20.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో పరుగులు పెడుతున్న టాటా టియాగో కార్లు.. ఆరేళ్లలో నాలుగు లక్షల యూనిట్ల ఉత్పత్తి..

టాటా టియాగో ఇప్పుడు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడా లభిస్తుంది. కంపెనీ ఈ టెక్నాలజీ ఐసిఎన్‌జి (iCNG) పేరుతో పిలుస్తుంది. సిఎన్‌జి వెర్షన్ టాటా టియాగో కూడా అదే 1.2 లీటర్ రెవోట్రాన్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. సిఎన్‌జి ఇంధనంతో నడిచే ఈ మోడల్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 73.4 పిఎస్ శక్తిని మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.49 కిమీ మైలేజీనిస్తుంది.

భారత్‌లో పరుగులు పెడుతున్న టాటా టియాగో కార్లు.. ఆరేళ్లలో నాలుగు లక్షల యూనిట్ల ఉత్పత్తి..

టాటా టియాగో కారులో లభించే కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఈ చిన్న కారులో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఫోల్డింగ్ వింగ్ మిర్రర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. అలాగే, సేఫ్టీ పరంగా చూసుకుంటే, ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ (సిఎస్‌సి) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), రియర్ పార్కింగ్ అసిస్ట్ మొదలైనవి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, April 21, 2022, 13:48 [IST]
English summary
Tata motors produces 400000 tiago hatcbacks in six years
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+