అప్పుడు కాదు పొమ్మన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యేలా ఉన్నారు.. ఫోర్డ్ ప్లాంట్ కొంటున్న టాటా!

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ (Ford), భారతదేశంలో వస్తున్న వ్యాపార నష్టాల కారణంగా, ఇక్కడి మార్కెట్ వదిలి తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఫోర్డ్ మోటార్స్ సంస్థకు భారతదేశంలో ఇప్పటికే రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఫోర్డ్ భారతదేశం నుండి నిష్క్రమించాలని నిర్ణయించడంతో, ఇప్పుడు ఈ రెండు ప్లాంట్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి కష్టకాలంలో ఫోర్డ్ కంపెనీ ఆదుకునేందుకు టాటా మోటార్స్ (Tata Motors) మరోసారి ముందుకు వచ్చింది.

అప్పుడు కాదు పొమ్మన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యేలా ఉన్నారు.. ఫోర్డ్ ప్లాంట్ కొంటున్న టాటా!

ఫోర్డ్ ఇండియా సంస్థకు గుజరాత్ లోని సనంద్‌లో ఉన్న కార్ల తయారీ ఫ్యాక్టరీని కొనుగోలు చేసేందు టాటా మోటార్స్ ఆసక్తికనబరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్లాంట్ కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు కంపెనీలు ప్లాంట్ యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి కూడా ఓ సమ్మతి లేఖను ఇచ్చాయని మరియు రాబోయే వారంలో ఇందుకు ఆమోదం కూడా లభించవచ్చని సమాచారం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కమిటీ ఈ ప్రతిపాదనను త్వరలో ఆమోదించనుంది.

అప్పుడు కాదు పొమ్మన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యేలా ఉన్నారు.. ఫోర్డ్ ప్లాంట్ కొంటున్న టాటా!

సనంద్ ప్లాంట్ కోసం రూ. 4,500 కోట్లు ఖర్చు చేసిన ఫోర్డ్!

అయితే, టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక ప్రజల కారు 'నానో' (Tata Nano) ప్లాంట్ ఏర్పాటు సమయంలో గుజరాత్ ప్రభుత్వం ఆ కంపెనీకి అందజేసిన ప్రయోజనాలను ఈసారి కూడా అందిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. సంవత్సరానికి 2.4 లక్షల కార్లు మరియు సంవత్సరానికి 2.7 లక్షల ఇంజన్లను తయారు చేయగల సామర్థ్యం ఉన్న ఈ సనంద్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఫోర్డ్ ఇండియా ఇప్పటివరకు దాదాపు రూ. 4,500 కోట్లు పెట్టుబడులను వెచ్చింది. అయితే, టాటా మోటార్స్ ఈ ప్లాంట్ ఎంత మొత్తంతో కొనుగోలు చేస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

అప్పుడు కాదు పొమ్మన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యేలా ఉన్నారు.. ఫోర్డ్ ప్లాంట్ కొంటున్న టాటా!

ఫోర్డ్ చెన్నై ప్లాంట్‌ను కొనేందుకు కూడా టాటా ఆసక్తి!

టాటా మోటార్స్ కంపెనీకి ఇప్పటికే గుజరాత్‌లో ఒక కార్ల తయారీ ప్లాంట్ ఉంది. నానో కార్ల తయారీ కోసం కంపెనీ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది మరియు ఫోర్డ్ ఇండియా ప్లాంట్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. గతంలో కూడా టాటా మోటార్స్ తమిళనాడులోని ఫోర్డ్ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. టాటా మోటార్స్‌కు ప్రస్తుతం తమిళనాడులో ఒక్క ప్లాంటు కూడా లేదు. ఓ నివేదిక ప్రకారం, ఫోర్డ్ ఇండియాకు చెందిన చెన్నై ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు టాటా మోటార్స్ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వాన్ని కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

అప్పుడు కాదు పొమ్మన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యేలా ఉన్నారు.. ఫోర్డ్ ప్లాంట్ కొంటున్న టాటా!

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు..!

ఫోర్డ్ మరియు టాటా కంపెనీల మధ్య ఏదో విడదీయలేని బంధం ఉంది. రతన్ టాటా ఆధ్వర్యంలోని టాటా మోటార్స్ సంస్థ 1991లో టాటా సియారా (Tata Sierra) అనే కారుతో దేశంలో తొలిసారిగా కార్ల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 1998 లో తమ రెండవ కారు టాటా ఇండికా (Tata India) ను ప్రవేశపెట్టింది. అయితే, టాటా ఇండికా కారు మార్కెట్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టిన ఏడాది తర్వాత టాటా మోటార్స్ నష్టాల్లోకి వెళ్లిపోయింది.

అప్పుడు కాదు పొమ్మన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యేలా ఉన్నారు.. ఫోర్డ్ ప్లాంట్ కొంటున్న టాటా!

ఇండికా విషయంలో నష్టాలను భరించలేని టాటా మోటార్స్ ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ సమయంలో కంపెనీ తమ కార్ల వ్యాపారాన్ని ఫోర్డ్ కంపెనీకి విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ డీల్‌ను క్లోజ్ చేసే రతన్ టాటా బృందాన్ని ఫోర్డ్ కంపెనీ అమెరికాకు ఆహ్వానించింది. ఇందుకోసం రతన్ టాటా ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లి ఫోర్డ్ ప్రతినిధులతో చర్చలు కూడా జరిపారు. అయితే, ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ టాటా-ఫోర్డ్ డీల్ క్యాన్సిల్ అయింది. ఫోర్డ్ అధికారుల దురుసు ప్రవర్తన వలనే ఈ డీల్ రద్దు అయినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అప్పుడు కాదు పొమ్మన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యేలా ఉన్నారు.. ఫోర్డ్ ప్లాంట్ కొంటున్న టాటా!

ఫోర్డ్ కంపెనీని టాటా ఆదుకోవడం ఇదేం మొదటిసారి కాదు!

ఇదంతా జరిగి కొన్న దశాబ్ధాలు గడిచిపోయాయి. అప్పుడు తిరిగి టాటా మోటార్స్ టైమ్ వచ్చింది. 2008లో ఫోర్డ్ అధీనంలో ఉన్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) దాదాపు దివాళతీసే స్థితికి చేరుకుంది. నష్టాలలో ఉన్న జేఎల్ఆర్ కంపెనీని కొనేందుకు ప్రపంచంలోని ఏ కార్ కంపెనీ ముందుకు రాలేదు, కానీ రతన్ టాటా మాత్రం ధైర్యం చేసి ఫోర్డ్ వద్ద నుండి ఆ లగ్జరీ కార్ కంపెనీని కొనుగోలు చేశారు. జేఎల్ఆర్ ను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ బ్రీటీష్ కార్ బ్రాండ్ కి మహర్దశ పట్టుకుంది.

అప్పుడు కాదు పొమ్మన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యేలా ఉన్నారు.. ఫోర్డ్ ప్లాంట్ కొంటున్న టాటా!

జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ ను నిర్వహించడంలో ఫోర్డ్ పూర్తిగా విఫలమైంది, కానీ టాటా మోటార్స్ మాత్రం గట్టి పట్టుదలతో ఆ బ్రాండ్ కు తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆ సమయంలో ఫోర్డ్ అధికారులు రతన్ టాటాను చాలానే ప్రశించారు. ఈ సంస్థను కొనుగోలు చేసి, తమను నష్టాల బారి నుండి తప్పించారని, తమ సాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. ఈ డీల్ జరిగిన 5 ఏళ్ల తర్వాత (2013 నాటికి) జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కార్ బ్రాండ్ లలో ఒకటిగా నిలిచింది.

అప్పుడు కాదు పొమ్మన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యేలా ఉన్నారు.. ఫోర్డ్ ప్లాంట్ కొంటున్న టాటా!

ప్రస్తుతం టాటా మోటార్స్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీ విబాగంలో టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా హారియర్ మరియు టాటా సఫారీ కార్లు ఉన్నాయి. అలాగే, హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ విభాగంలో టాటా టియాగో, టాటా టిగోర్ మరియు టాటా ఆల్ట్రోజ్ మోడళ్లు ఉన్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, టిగోర్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీలను కంపెనీ విక్రయిస్తోంది. ఇవి కాదన్నట్లుగా, 2025 నాటికి కంపెనీ మొత్తం 10 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని గట్టి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తోంది.

అప్పుడు కాదు పొమ్మన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యేలా ఉన్నారు.. ఫోర్డ్ ప్లాంట్ కొంటున్న టాటా!

కొత్త కార్ల విడుదల విషయంలో టాటా మోటార్స్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే, కంపెనీ తమ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం కంపెనీ కొత్త ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఫోర్డ్ ప్లాంట్లను కొనుగోలు చేయడం ద్వారా వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవాలని టాటా మోటార్స్ చూస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 17, 2022, 14:44 [IST]
English summary
Tata motors ready to takeover the ford india s sanand plant details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+