టాటా అవిన్య (Tata Avinya) ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఆవిష్కరణ.. పూర్తి చార్జ్‌పై 500 కిలోమీటర్ల రేంజ్..!
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తమ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ 'టాటా అవిన్య' (Tata Avinya) ను ఆవిష్కరించింది. ఈ అధునాతన ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 500 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. అవిన్య అనే పేరును టాటా మోటార్స్ సంస్కృతం నుండి సేకరించింది, ఈ పేరుకి అర్థం ఆవిష్కరణ అని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ యొక్క మూడవ తరం ఎలక్ట్రిక్ వాహనాలలో (Gen 3 EV) భాగంగా కంపెనీ టాటా అవిన్య కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది.

టాటా మోటార్స్ ఆవిష్కరించిన ఈ అధునాతన ఎలక్ట్రిక్ కార్ అవిన్య, స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాల కోసం కంపెనీ తయారు చేసిన సరికొత్త స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంటుంది. కొత్త Gen 3 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపుదిద్దుకుంటుకున్న ఈ మొదటి ఎలక్ట్రిక్ వాహనం 2025 నాటికి ఉత్పత్ దశకు చేరుకునే అవకాశం ఉంది. ఈ కొత్త Gen 3 ఎలక్ట్రిక్ వాహనాలు కనీసం 500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయని టాటా మోటార్స్ పేర్కొంది.

టాటా అవిన్య మానవ కేంద్రీకృత వాహనం (human centric vehicle) అని టాటా పేర్కొంది. ఇది 4.3 మీటర్ల పొడవును కలిగి ఉండి, బయటి వైపు నుండి చాలా మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, టాటా అవిన్య ఎక్కువగా లోపలి భాగం నుండి డిజైన్ చేయబడిందని కంపెనీ పేర్కొంది. అంటే, దీని డిజైన్ మరియు ఫీచర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇంటీరియర్ లో కనిపిస్తాయి.

అవిన్య బయటి డిజైన్‌లో T-ఆకారపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా ఉంటాయి. ఇది ఈ కాన్సెప్ట్ కారు ముందు భాగం అంతటా విస్తరించినట్లు ఉంటుంది. ఈ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్ల అంచుల వద్ద సొగసైన ఎల్ఈడి హెడ్‌లైట్‌ల సెట్ కనిపిస్తుంది. టాటా అవిన్యలో భారీగా షేప్ చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు వాహనం ముందు భాగంలో ఉండే పెద్ద బ్లాక్ ప్యానెల్‌లు ముందు డిజైన్‌ను డామినేట్ చేస్తాయి. ఈ ప్యానెల్‌లో అనేక ఎల్ఈడి లైట్లు కూడా ఉంటాయి.

ఇక టాటా అవిన్య సైడ్స్ డిజైన్ ను గమనిస్తే, ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వాహనంలో పక్కపక్కనే ఉండే రెండు డోర్లు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఖరీదైన రోల్స్ రాయిస్ వంటి కార్లలో కనిపించే సూసైడ్ డోర్స్ ఇందులో హైలైట్‌గా నిలుస్తాయి. ఇక ఇక్కడ మనల్ని ఆకట్టుకునే మరొక అంశం దాని స్పోర్టీ అల్లాయ్ వీల్స్. ఈ అల్లాయ్ వీల్స్ అవిన్య కాన్సెప్ట్ కారు యొక్క అంచులలో అమర్చబడి ఉంటాయి. కాబట్టి, ఇది ముందు మరియు వెనుక భాగంలో అతి తక్కువ ఓవర్‌హాంగ్‌లను కలిగి ఉంటుంది.

కారు చక్రాలను ఇరువైపులా అంచులలో అమర్చిన కారణంగా, ఈ వాహనంలో గరిష్టమైన వీల్‌బేస్ లభిస్తుంది. ఫలితంగా, క్యాబిన్ లోపల ఎక్కువ ఇంటీరియర్ స్పేస్ లభిస్తుంది. టాటా అవిన్య కారులో బి-పిల్లర్ ఉండదు కాబట్టి, ఇది మొత్తం ఇంటీరియర్‌ను ఒకేసారి చూపించేందుకు కోచ్ డోర్లను కలిగి ఉంటుంది. ఈ వెడల్పాటి డోర్ల వలన కారు లోపలకి ప్రవేశించడం మరియు నిష్క్రమించడం చాలా సులభంగా ఉంటుంది.

ఇక టాటా అవిన్య వెనుక భాగంలోని డిజైన్‌ను గమనిస్తే, ఇక్క కూడా T-ఆకారపు లైట్ బార్ ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుంది. ఈ టైల్‌లైట్ వెంటనే మీ దృష్టిని ఆకర్షిస్తుంది మరియు టైల్‌లైట్‌లు స్పాయిలర్ ఎలిమెంట్‌ను ఏర్పరుస్తాయి. ఇవి అవిన్య యొక్క ఓవరాల్ డిజైన్ నైపుణ్యాన్ని పెంచుతుంది. కాన్సెప్ట్ కారు వెనుక భాగం బంపర్ విభాగంలోకి వంగి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

టాటా అవిన్య ఇంటీరియర్స్ లో కూడా చాలా సింప్లిసిటీ కనిపిస్తుంది. లోపలి వైపు ఎలాంటి భౌతిక బటన్లు మరియు భారీ డిస్‌ప్లే యూనిట్లు ఇందులో కనిపించవు. అలాంటివి లేవని మీరు నిరాశకు గురవ్వాల్సిన అవసరం కూడా లేదు. టాటా అవిన్య అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంది. ఈ కాన్సెప్ట్ ఈవీ యొక్క అన్ని సీట్లకు సౌండ్ బార్ స్టైల్ స్పీకర్‌లు అమర్చబడి ఉంటాయి. (ముందు వైపున రెండు పెద్ద వ్యక్తిగత సీట్లు మరియు వెనుక వైపున విశాలమైన మరియు చాలా సౌకర్యవంతమైన బెంచ్ టైప్ సీట్స్ ఉంటాయి).

ఈ వాహనంలో దాని యజమానుల కోసం ఓ సెకండరీ డిస్‌ప్లే సెటప్ ను కూడా కలిగి ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ అంతా చాలా ప్లెయిన్‌గా కనిపిస్తుంది. సెంట్రల్ ఏసి టైప్ సిస్టమ్ ఇందులో మరొక అదనపు ఆకర్షణంగా ఉంటుంది. టాటా అవిన్య స్థిరమైన మూలాధారాల నుండి తయారు చేయబడిన అప్‌హోలెస్ట్రీని కలిగి ఉంటుంది. దానితో పాటుగా ఇందులో అనేక ఇతర ఫీచర్లు మరియు లేటెస్ట్ కనెక్టింగ్ టెక్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి, టాటా మోటార్స్ ఈ కాన్సెప్ట్ కారు గురించి చాలా ఎక్కువ వివరాలనైతే వెల్లడించలేదు. అయితే, త్వరలోనే దేశల వారీగా ఈ కారుకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను కంపెనీ పంచుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications