టాటా కార్లను కొనేందుకు బారులుతీరుతున్న కస్టమర్లు.. జులై నెల అమ్మకాలే ఇందుకు నిదర్శనం..

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఇప్పుడు భారతదేశపు నెంబర్ వన్ కార్ కంపెనీగా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు అమ్మకాల జాబితాలో ఎక్కడో అడుగున ఉండే టాటా మోటార్స్, ఇప్పుడు మొదటి రెండు-మూడు స్థానాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం, టాటా మోటార్స్ అందిస్తున్న సరికొత్త మరియు సురక్షితమైన వాహనాలే అని చెప్పొచ్చు. దేశీయ మార్కెట్లో టాటా కార్లకు అన్ని వర్గాల కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

టాటా కార్లను కొనేందుకు బారులుతీరుతున్న కస్టమర్లు.. జులై నెల అమ్మకాలే ఇందుకు నిదర్శనం..

టాటా మోటార్స్ భారత మార్కెట్లో తమ ఫరెవర్ రేంజ్ మోడళ్లను ప్రవేశపెట్టిన తర్వాత, కస్టమర్లు టాటా కార్లను కొనేందుకు క్యూ కడుతున్నారు. దీంతో గడచిన జులై 2022 నెలలో కూడా కంపెనీ అమ్మకాలు పరుగులు పెట్టాయి. టాటా మోటార్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, కంపెనీ ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు పేర్కొంది. టాటా మోటార్స్ గడచిన జూలై నెలలో మొత్తం 47,505 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (జులై 2021లో) కంపెనీ విక్రయించిన వాహనాలతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 57 శాతం పెరిగాయి.

టాటా కార్లను కొనేందుకు బారులుతీరుతున్న కస్టమర్లు.. జులై నెల అమ్మకాలే ఇందుకు నిదర్శనం..

ఈ మొత్తం ప్యాసింజర్ వాహనాలలో 43,483 యూనిట్ల ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) వాహనాలు ఉండగా, 4,022 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ మరియు కమర్షియల్ వెహికల్ అమ్మకాలను కలిపి చూస్తే, గత నెలలో మొత్తంగా ఇవి 81,790 యూనిట్లు అమ్ముడయ్యాయి. జులై 2021 నెలతో పోలిస్తే, గత నెలలో పెట్రోల్/డీజిల్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 47 శాతం పెరగగా, ఈవీ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 566 శాతం పెరిగాయి.

టాటా కార్లను కొనేందుకు బారులుతీరుతున్న కస్టమర్లు.. జులై నెల అమ్మకాలే ఇందుకు నిదర్శనం..

ఈ మొత్తం అమ్మకాలలో కంపెనీ దేశీయ విపణిలో 78,978 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఇందులో ప్రయాణీకుల మరియు వాణిజ్య వాహనాలు కలిసి ఉన్నాయి. జూలై 2021తో పోలిస్తే ఈ మొత్తం అమ్మకాలు 52 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. టాటా మోటార్స్ జూలై 2022 నెలలో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. గత నెలలో కంపెనీ అత్యధిక సంఖ్యలో 5,293 యూనిట్ల సిఎన్‌జి వాహనాలను కూడా విక్రయించింది. గత నెల మొత్తం అమ్మకాలలో ఎస్‌యూవీలే 64 శాతం వాటాను కలిగి ఉన్నాయి మరియు ఇవి జూలై 2021 కంటే 105 శాతం ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి.

టాటా కార్లను కొనేందుకు బారులుతీరుతున్న కస్టమర్లు.. జులై నెల అమ్మకాలే ఇందుకు నిదర్శనం..

టాటా మోటార్స్ విక్రయిస్తున్న పంచ్ ఎస్‌యూవీ మరియు టిగోర్ సెడాన్ మోడళ్లు గత నెలలో అత్యధిక విక్రయాలను నమోదు చేశాయి. జులై 2022 నెలలో ఈ మోడళ్ల అమ్మకాలు వరుసగా 11,007 యూనిట్లు మరియు 5,433 యూనిట్లుగా ఉన్నాయి. ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే, జూలై 2022 నెలలో కంపెనీ మొత్తం 34,154 యూనిట్ల వాహనాలు విక్రయించింది. ఇది గత జూలై 2021 నెలలో విక్రయించిన 23,848 యూనిట్లతో పోలిస్తే 43 శాతం అధికం. ఇందులో దేశీయ మార్కెట్‌లో 31,473 యూనిట్లు విక్రయించబడగా, 2,681 యూనిట్లు భారతదేశం నుండి ఎగుమతి అయ్యాయి.

టాటా కార్లను కొనేందుకు బారులుతీరుతున్న కస్టమర్లు.. జులై నెల అమ్మకాలే ఇందుకు నిదర్శనం..

టాటా మోటార్స్ అందిస్తున్న ప్యాసింజర్ వాహనాల గొప్పతనం గురించి ఆనోటా ఈనోటా ప్రచారం కావడంతో, కంపెనీ ఉత్పత్తులకు ఆదరణ భారీగా పెరిగింది. మరోవైపు, కంపెనీ కూడా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ మరియు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా సరసమైన ధరలకే వాహనాలను అందిస్తుండటంతో కంపెనీ అమ్మకాలు క్రమంగా వృద్ధి చెందుతూ వస్తున్నాయి. అంతేకాకుండా, టాటా మోటార్స్ అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా గొప్ప స్పందన లభిస్తోంది. కంపెనీ ప్రస్తుతం టాటా నెక్సాన్ ఈవీ మరియు టాటా టిగోర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వీటిలో టాటా నెక్సాన్ ఈవీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా ఉంది.

టాటా కార్లను కొనేందుకు బారులుతీరుతున్న కస్టమర్లు.. జులై నెల అమ్మకాలే ఇందుకు నిదర్శనం..

టాటా నెక్సాన్ ఈవీ విజయాన్ని పురస్కరించుకొని, ఇందులో అధిక రేంజ్ కోరుకునే కస్టమర్ల కోసం టాటా మోటార్స్ ఇటీవలో ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Nexon EV Max) ను పరిచయం చేసింది. కొత్త 2022 టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వేరియంట్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి ఈ మోడల్ అమ్మకాలు మరింత పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ 9,300 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన మొత్తం ఎలక్ట్రిక్ కార్లతో ఇవి రెట్టింపు వృద్ధిని సాధించాయి.

టాటా కార్లను కొనేందుకు బారులుతీరుతున్న కస్టమర్లు.. జులై నెల అమ్మకాలే ఇందుకు నిదర్శనం..

టాటా మోటార్స్ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించగలమని భావిస్తోంది. దీనికితోడు, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లకు వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల నుండి భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఆర్డర్లు కూడా వస్తున్నాయి. ఈవీ విభాగంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని, టాటా మోటార్స్ రాబోయే కాలంలో మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటికే ఈవీ కాన్సెప్ట్‌ కార్లను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసినదే. వాటి ఆధారంగా ప్రొడక్షన్ రెడీ మోడళ్లు ప్రవేశపెట్టబడుతాయి.

టాటా కార్లను కొనేందుకు బారులుతీరుతున్న కస్టమర్లు.. జులై నెల అమ్మకాలే ఇందుకు నిదర్శనం..

పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో టాటా మోటార్స్ కూడా మారుతి సుజుకి, హ్యుందాయ్ మాదిరిగా సిఎన్‌జి విభాగంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో, అధిక మైలేజీనిచ్చే టాటా మోటార్స్ సిఎన్‌జి వేరియంట్‌లు కూడా అద్భుతమైన ఫలితాలను కనబరుస్తున్నాయి. కంపెనీ టియాగో మరియు టిగోర్‌ లైనప్ లో సిఎన్‌జి వేరియంట్లను విక్రయిస్తోంది. గడచిన జూలై 2022 నెల అమ్మకాలను పరిశీలిస్తే, టాటా సిఎన్‌జి వాహనాలకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే స్పష్టమవుతుంది. ఈ పరిస్థితిలో, టాటా మోటార్స్ రాబోయే రోజుల్లో మరిన్ని CNG వేరియంట్లను తీసుకువచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Tata motors sales in 2022 july details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X