ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెళ్తున్న Tata Punch: డిసెంబర్ సేల్స్ రిపోర్ట్

దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) భారతీయ మార్కెట్లో ఇటీవల కాలంలో విడుదల చేసిన టాటా పంచ్ (Tata Punch) అనే మైక్రో SUV ని విడుదల చేసిన విషయం తెలిసిందే, ఈ SUV దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే కంపెనీ ఇప్పుడు 2021 డిసెంబర్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెళ్తున్న Tata Punch: డిసెంబర్ సేల్స్ రిపోర్ట్

కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021 డిసెంబర్ నెలలో టాటా పంచ్ మొత్తం 8,008 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది కంపెనీ సాధించిన అత్యధిక విక్రయాలు అని చెప్పవచ్చు. కంపెనీ 2021 నవంబర్ నెలలో 6,110 యూనిట్లు విక్రయించబడ్డాయి. కావున నవంబర్ కంటే కూడా డిసెంబర్ నెల అమ్మకాలు వృద్ధి చెందినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది.

ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెళ్తున్న Tata Punch: డిసెంబర్ సేల్స్ రిపోర్ట్

అమ్మకాలు 2021 నవంబర్ నెల కంటే కూడా 2021 డిసెంబర్ నెలలో 31.06 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ 2022 జనవరిలో కూడా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. దేశీయ మార్కెట్లో ఈ చిన్న SUV ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉంది.

ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెళ్తున్న Tata Punch: డిసెంబర్ సేల్స్ రిపోర్ట్

Tata Punch నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ కలర్స్.

ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెళ్తున్న Tata Punch: డిసెంబర్ సేల్స్ రిపోర్ట్

Tata Punch మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెళ్తున్న Tata Punch: డిసెంబర్ సేల్స్ రిపోర్ట్

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెళ్తున్న Tata Punch: డిసెంబర్ సేల్స్ రిపోర్ట్

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెళ్తున్న Tata Punch: డిసెంబర్ సేల్స్ రిపోర్ట్

Tata Punch 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెళ్తున్న Tata Punch: డిసెంబర్ సేల్స్ రిపోర్ట్

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV అత్యంత సురక్షితమైన వాహనం. ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్‌ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కావున మార్కెట్లో ఈ కారుకి మరింత డిమాండ్ పెరిగింది.

ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెళ్తున్న Tata Punch: డిసెంబర్ సేల్స్ రిపోర్ట్

Tata Punch లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇటువంటి అధునాతన మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కొత్త మైక్రో SUV దేశీయ మార్కెట్లో ఈ నెలలో కూడా మరింత ఆశాజనకమైన అమ్మకాలను పొందుతుంది.

Most Read Articles

English summary
Tata motors sold over 8000 of punch in december 2021 details
Story first published: Monday, January 10, 2022, 17:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X