ఫోర్డ్ గుజరాత్ ప్లాంట్‌ను కొనేందుకు సిద్ధమైన టాటా, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాన్స్!

భారతదేశంలో దివాళ తీసిన అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford) యొక్క గుజరాత్ కార్ ప్లాంట్ ను కొనేందుకు టాటా మోటార్స్ (Tata Motors) చాలా కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు ఈ ఇరు కంపెనీల మధ్య డీల్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టాటా మోటార్స్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న ఫోర్డ్ ఇండియా తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ డీల్ విలువ సుమారు రూ.725 కోట్లు.

ఫోర్డ్ గుజరాత్ ప్లాంట్‌ను కొనేందుకు సిద్ధమైన టాటా, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాన్స్!

ఫోర్డ్ యొక్క సనంద్ తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేయడానికి టాటా మోటార్స్ ఇప్పటికే ఆ కంపెనీతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఓ రకంగా చూస్తుంటే, టాటా మోటార్స్ ఇప్పుడు ఫోర్డ్ యొక్క విఫలమైన వెంచర్లను కొనుగోలు చేయడం మరియు వాటిని విజయవంతమైన పెట్టుబడులుగా మార్చడం అలవాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్. ఫోర్డ్ చేతిలో నష్టాల బాట పట్టిన ఈ బ్రిటీష్ కార్ బ్రాండ్ ని టాటా మోటార్స్ 2008లో కొనుగోలు చేసి, ఇప్పుడు ప్రపంచంలో కెల్లా విలువైన ఆటోమొబైల్ బ్రాండ్ గా మార్చింది.

ఫోర్డ్ గుజరాత్ ప్లాంట్‌ను కొనేందుకు సిద్ధమైన టాటా, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాన్స్!

పేలవమైన మార్కెటింగ్ స్ట్రాటజీ మరియు మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా అప్‌డేట్ కావండలో విఫలం కావడంతో ఫోర్డ్, భారతదేశంలో నష్టాల బాట పట్టింది. గతంలో ఫోర్డ్ కష్టాలలో ఉన్నప్పుడు టాటా మోటార్స్ ముందుకు వచ్చి ఈ కంపెనీని ఆదుకుంది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి నెలకొంది. గుజరాత్ లోని ఫోర్డ్ ప్లాంట్ ను కొనుగోలు చేయడం ద్వారా కంపెనీని మరోసారి ఒడ్డున పడేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది.

ఫోర్డ్ గుజరాత్ ప్లాంట్‌ను కొనేందుకు సిద్ధమైన టాటా, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాన్స్!

ఫోర్డ్ భారతదేశం నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన సమయంలో కంపెనీ దాని తయారీ ప్లాంట్‌లలో ఒకదానిని విక్రయిస్తుందనే పుకారు బలంగా వినిపించింది. కాగా, ఇప్పుడు టాటా మోటార్స్ నుండి తాజా ప్రకటనతో, టాటా మోటార్స్ మరో "విఫలమైన" వ్యాపార వెంచర్ నుండి ఫోర్డ్‌ను 'రక్షించడానికి' మళ్లీ ఓడ ఎక్కినట్లుగా కనిపిస్తోంది. టాటా మోటార్స్ సనంద్‌లోని ఫోర్డ్ ఇండియా తయారీ కేంద్రాన్ని రూ.725 కోట్లకు కొనుగోలు చేయనుంది.

ఫోర్డ్ గుజరాత్ ప్లాంట్‌ను కొనేందుకు సిద్ధమైన టాటా, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాన్స్!

ఈ మేరకు టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEML), ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (FIPL) యొక్క సనంద్ తయారీ ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి యూనిట్ బదిలీ ఒప్పందం (UTA) పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ద్వారా, టాటా మోటార్స్ ఫోర్డ్ ఇండియా యొక్క సనంద్ తయారీ కర్మాగారంలోని యంత్రాలు మరియు పరికరాలతో సహా మొత్తం భూమి మరియు మౌలిక సదుపాయాలను దక్కించుకుంటుంది.

ఫోర్డ్ గుజరాత్ ప్లాంట్‌ను కొనేందుకు సిద్ధమైన టాటా, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాన్స్!

ప్రస్తుతం, సనంద్ తయారీ కేంద్రం సంవత్సరానికి దాదాపు 3 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, ఈ ప్లాంట్ లో చిన్న చిన్న మార్పులను చేయడం ద్వారా సంవత్సరానికి 4.2 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఇండియా నుండి కొనుగోలు చేసిన ఈ గుజరాత్ ప్లాంట్ లో టాటా మోటార్స్ తమ కొత్త మరియు ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాలను అసెంబుల్ చేసే అవకాశం ఉంది.

ఫోర్డ్ గుజరాత్ ప్లాంట్‌ను కొనేందుకు సిద్ధమైన టాటా, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాన్స్!

అయితే, టాటా మోటార్స్ ఈ ప్లాంట్ ను కేవలం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం వినియోగిస్తుందా లేక ఇందులో ఇతర టాటా వాహనాలను కూడా తయారు చేస్తుందా అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న విపరీతమైన డిమాండ్ మరియు టాటా ఎలక్ట్రిక్ కార్లకు వస్తున్న బల్క్ ఆర్డర్లను కంపెనీ ఆన్‌టైమ్ లో డెలివరీ చేయాలంటే, తప్పనిసరిగా తమ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు వేగంతో పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి, టాటా మోటార్స్ ఈ సనంద్ ప్లాంట్ ను ఎక్స్‌క్లూజివ్ గా ఈవీ తయారీ కోసం ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది.

ఫోర్డ్ గుజరాత్ ప్లాంట్‌ను కొనేందుకు సిద్ధమైన టాటా, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాన్స్!

ప్రస్తుతం, భారత మార్కెట్లో టాటా మోటార్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో కార్లను అత్యధికంగా విక్రయించే టాప్ 10 కంపెనీల జాబితాలో టాటా మోటార్స్ 3వ స్థానంలో ఉంది. కాగా, టాటా మోటార్స్ భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా అవతరించడానికి హ్యుందాయ్ మోటార్స్‌తో చాలా దగ్గర రేసులో ఉన్న నేపథ్యంలో, కంపెనీ తమ మొత్తం ఉత్పత్తిని పెంచడానికి ఈ కొత్త ప్లాంట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఫోర్డ్ గుజరాత్ ప్లాంట్‌ను కొనేందుకు సిద్ధమైన టాటా, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాన్స్!

ఫోర్డ్ మరియు టాటా కంపెనీల మధ్య కుదిరిన తాజా ఒప్పందాన్ని చూస్తుంటే, ఈ రెండు కంపెనీల మధ్య ఏదో విడదీయలేని బంధం ఉన్నట్లు తెలుస్తోంది. రతన్ టాటా యాజమాన్యంలో టాటా మోటార్స్ 1991లో టాటా సియారా (Tata Sierra) కారుతో దేశంలో తొలిసారిగా కార్ల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 1998 లో తమ రెండవ కారు టాటా ఇండికా (Tata India)ను ప్రవేశపెట్టింది. అయితే, టాటా ఇండికా కారు మార్కెట్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టిన ఏడాది తర్వాత టాటా మోటార్స్ నష్టాల్లోకి వెళ్లిపోయింది.

ఫోర్డ్ గుజరాత్ ప్లాంట్‌ను కొనేందుకు సిద్ధమైన టాటా, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచేందుకు ప్లాన్స్!

ఆ సమయంలో తమ కార్ల వ్యాపారాన్ని ఫోర్డ్ (Ford) కంపెనీకి విక్రయించాలని టాటా మోటార్స్ నిర్ణయించుకుంది. ఈ డీల్ కోసం రతన్ టాటా బృందాన్ని ఫోర్డ్ కంపెనీ అమెరికాకు ఆహ్వానించింది. ఇందుకోసం రతన్ టాటా ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లి ఫోర్డ్ ప్రతినిధులతో చర్చలు కూడా జరిపారు. అయితే, ఆ సమయంలో ఫోర్డ్ అధికారుల దురుసు ప్రవర్తన వలన ఈ డీల్ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సరిగ్గా 9 ఏళ్లకు 2008లో ఫోర్డ్ అధీనంలో దాదాపు దివాళ స్థితిలో ఉన్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) టాటా మోటార్స్ స్వాధీనం చేసుకుంది. కాగా, ఇప్పుడు టాటా మోటార్స్ ఫోర్డ్ కంపెనీ యొక్క సనంద్ ప్లాంట్ ను కొనుగోలు చేయడం ద్వారా మరోసారి ఈ అమెరికన్ కార్ బ్రాండ్ కు మేలు చేయనున్నారు.

Most Read Articles

English summary
Tata motors to buy ford india s gujarat car plant for ev manufacturing details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X