టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఏం తీసుకురాబోతోంది..? ఈ లేటెస్ట్ టీజర్ దేని గురించి..?

ప్రస్తుతం, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్ కొత్త కార్ల విడుదలతో చాలా సందడిగా కనిపిస్తోంది. మార్కెట్లో దాదాపు అన్ని కార్ కంపెనీలు ఏదో ఒక్క కొత్త ఉత్పత్తిని విడుదల చేస్తూ యాక్టివ్‌గా ఉంటే, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) మాత్రం తమ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) విడుదల తర్వాత సైలెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. టాటా మోటార్స్ తమ ప్రస్తుత లైనప్‌లో అప్పుడప్పుడూ కొత్త వేరియంట్లను విడుదల చేస్తున్నప్పటికీ, ఈ బ్రాండ్ నుండి పంచ్ తర్వాత పూర్తిగా ఎలాంటి కొత్త ఉత్పత్తి విడుదల కాలేదనే చెప్పాలి.

Recommended Video

Mahindra Scorpio Classic Launched In TELUGU | Price At Rs 11.99 Lakh | Variants & Features Explained

అయితే, ఇప్పుడు అందరి మదిలో ఆసక్తిని రేపుతూ టాటా మోటార్స్ ఓ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. జెట్ సెట్ స్లే (#JetSetSlay) అనే హ్యాష్‌ట్యాగ్ తో కమింగ్ సూన్ (త్వరలో వస్తోంది) అంటూ కంపెనీ ఓ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. అయితే, టాటా మోటార్స్ ఈ టీజర్ ద్వారా ఈ కారును మార్కెట్లో విడుదల చేయబోతోందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కంపెనీ తమ సోషల్ మీడియా పోస్టులలో చేసిన హ్యాష్‌ట్యాగ్స్ (#TataSUV, #IndianSUV) ప్రకారం, ఇదొక ఎస్‌యూవీ మోడల్ అని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఏం తీసుకురాబోతోంది..? ఈ లేటెస్ట్ టీజర్ దేని గురించి..?

టాటా మోటార్స్ పూర్తిగా సరికొత్త ఎస్‌యూవీ మోడల్ ను మార్కెట్లో విడుదల చేస్తుందా లేక ప్రస్తుతం ఉన్న హారియర్ లేదా సఫారీ మోడళ్లలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేస్తుందా అనే దానిపై క్లారిటీ లేదు. మా అంచనా ప్రకారం, టాటా మోటార్స్ నుండి రాబోయే కొత్త కారు హారియర్ లేదా సఫారి లేదా ఈ రెండు మోడళ్లలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు కావచ్చని తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ మరింత ప్రీమియంగా ఉండే అవకాశం ఉంది. టాటా ఈ టీజర్‌లో ఇచ్చిన హింట్‌ను (Suit Up To Soar High) బట్టి చూస్తుంటే, ఈ కొత్త కారు మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో మరియు ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో వచ్చే అవకాశం కనిపిస్తోంది.

టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఏం తీసుకురాబోతోంది..? ఈ లేటెస్ట్ టీజర్ దేని గురించి..?

టాటా మోటార్స్ అందిస్తున్న 5-సీటర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ టాటా హారియర్‌లో గత రెండేళ్లుగా ఎలాంటి మేజర్ అప్‌డేట్ రాలేదు. అయితే, ఈ రెండేళ్ల కాలంలో ఈ విభాగంలోకి అనేక కొత్త మరియు రిఫ్రెష్డ్ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, పెరిగిన పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు టాటా మోటార్స్ కూడా తమ హారియర్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఆన్‌లైన్‌లో లీకైన స్పై చిత్రాలు కూడా కంపెనీ టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్‌ను పరీక్షిస్తున్నట్లు నిర్ధారించాయి.

టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఏం తీసుకురాబోతోంది..? ఈ లేటెస్ట్ టీజర్ దేని గురించి..?

టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కంపెనీ కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఎక్కువగా ఇంటీరియర్‌లో ప్రధానమైన మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. క్యాబిన్ లోపల ప్రీమియం అనుభూతిని అందించేందుకు ఇందులో లెదర్ సీట్లు, డ్యాష్‌బోర్డ్‌పై లెదర్ మరియు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్‌తో పాటుగా ఇంటీరియర్‌లలో రిఫ్రెష్ లుక్ ఇవ్వడానికి సరికొత్త ఇంటీరియర్ థీమ్ ఆప్షన్‌ను కూడా తీసుకురావచ్చు.

టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఏం తీసుకురాబోతోంది..? ఈ లేటెస్ట్ టీజర్ దేని గురించి..?

ఇక ఇందులో ఆఫర్ చేయబోయే ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త 2022 టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో 360-డిగ్రీ కెమెరా, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీ (అడాస్), అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే మొదలైన ప్రీమియం ఫీచర్లను ఆశించవ్చచు. అంతేకాకుండా, కంపెనీ గతంలో విడుదల చేసిన కజిరంగా ఎడిషన్‌లో అందించిన వెంటిలేటెడ్ సీట్లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్‌లను కూడా ఈ కొత్త మోడల్‌లో పరిచయం చేయవచ్చు.

టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఏం తీసుకురాబోతోంది..? ఈ లేటెస్ట్ టీజర్ దేని గురించి..?

టాటా మోటార్స్ రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన మరిన్ని టీజర్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇది కొత్త హారియర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అయితే, ఇందులో కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ గా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం, హారియర్ లో ఉపయోగిస్తున్న అదే డీజిల్ ఇంజన్ ను యధావిధిగా కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఈసారి ఇందులో చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెట్రోల్ ఇంజన్ తీసుకురావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.

టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఏం తీసుకురాబోతోంది..? ఈ లేటెస్ట్ టీజర్ దేని గురించి..?

ఈ విభాగంలోని చాలా ఎస్‌యూవీలు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ తో విక్రయించబడుతుంటే, ప్రస్తుతం హారియర్ మరియు సఫారి ఎస్‌యూవీలు మాత్రం కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఇతర ఎస్‌యూవీలకు ధీటుగా నిలబడాలంటే, ఇందులో పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేయడం చాలా అవసరం. ప్రస్తుతానికి, ఈ పెట్రోల్ ఇంజన్ గురించి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ, ఇది 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కావచ్చని తెలుస్తోంది.

టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఏం తీసుకురాబోతోంది..? ఈ లేటెస్ట్ టీజర్ దేని గురించి..?

ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఉత్తమమైన 5-సీటర్ ఎస్‌యూవీలలో టాటా హారియర్ కూడా ఒకటి. ఇది శక్తివంతమైన 2.0 లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ 3,750 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 167.67 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లు లీటరుకు 16.35 కిమీ మైలేజీని అందిస్తుండగా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లు లీటరుకు 14.6 కిమీ మైలేజీని అందిస్తాయి.

టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఏం తీసుకురాబోతోంది..? ఈ లేటెస్ట్ టీజర్ దేని గురించి..?

టాటా హారియర్‌లో కంపెనీ అందిస్తున్న కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఈ ఎస్‌యూవీలో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 9 ఇంచ్ హర్మాన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, iRA కనెక్టెడ్ కార్ టెక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఆపరేటెడ్ మరియు ఆటో-ఫోల్డింగ్ అవుట్-సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ORVMలు), క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

టాటా మోటార్స్ ఈసారి కొత్తగా ఏం తీసుకురాబోతోంది..? ఈ లేటెస్ట్ టీజర్ దేని గురించి..?

అలాగే, సేఫ్టీ పరంగా చూసుకుంటే, టాటా హారియర్ లో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 24, 2022, 17:51 [IST]
English summary
Tata motors to launch new car soon will it be updated harrier or safari
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+