టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీలో 'క్యామో ఎడిషన్".. సెప్టెంబర్ 22న విడుదల

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) నుండి మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) లో కంపెనీ త్వరలోనే ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. టాటా పంచ్ క్యామో ఎడిషన్ (Tata Punch Camo Edition) పేరుతో రానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Recommended Video

భారత్‌లో విడుదలైన Tata Nexon EV Max: పూర్తి వివరాలు

టాటా పంచ్ దాని ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లు మరియు సాటిలేని సేఫ్టీ రేటింగ్‌తో అతికొద్ది కాలంలోనే టాటా బ్రాండ్ యొక్క పాపులర్ కారుగా మారిపోయింది. టాటా పంచ్ ప్రతినెలా సగటున వెయ్యి యూనిట్లకుపైగా అమ్మకాలను నమోదు చేస్తోంది. ఇప్పుడు ఈ మోడల్ అమ్మకాలకు మరింత ఊతమిచ్చేందుకు కంపెనీ ఇందులో కొత్త క్యామో ఎడిషన్‌ను సెప్టెంబర్ 22వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. స్టాండర్డ్ టాటా పంచ్‌తో పోల్చుకుంటే, టాటా పంచ్ క్యామో ఎడిషన్ మరిన్ని అదనపు కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుంది.

టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీలో 'క్యామో ఎడిషన్

టాటా మోటార్స్ తమ వాహనాలలో క్యామో ఎడిషన్లను తీసుకురావడం ఇదేం మొదటి సారికాదు. అయితే, పంచ్ ఎస్‌యూవీలో మాత్రం ఇది మొదటిసారే. కేవలం క్యామో ఎడిషన్ మాత్రమే కాకుండా, డార్క్, కజిరంగా మరియు ఇటీవల జెట్ ఎడిషన్లను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లన్నీ కూడా వాటి స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే ప్రత్యేకంగా కనిపించేలా ఉంటాయి. తాజాగా, టాటా పంచ్ క్యామో ఎడిషన్‌కు సంబంధించి కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీలో 'క్యామో ఎడిషన్

ఈ టీజర్‌లో టాటా పంచ్ పూర్తిగా డార్క్ కలర్ థీమ్‌ను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. రాబోయే పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ తమ పంచ్ క్యామో ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో కేవలం ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే కాకుండా, కొన్ని అదనపు ఫీచర్లను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ అందిస్తున్న ఇతర స్పెషల్ ఎడిషన్ల మాదిరిగానే, టాటా పంచ్ క్యామో ఎడిషన్ కూడా దాని సాధారణ మోడల్ ధర కంటే సుమారు రూ. 50,000 ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీలో 'క్యామో ఎడిషన్

ప్రస్తుతం, టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 5.93 లక్షల వద్ద అందుబాటులో ఉంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీకి నేరుగా ఈ విభాగంలో ఎలాంటి మోడల్ పోటీగా లేకపోయినప్పటికీ, ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోని నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ వంటి మోడళ్లకు పరోక్ష పోటీదారుగా నిలుస్తుంది. టాటా పంచ్ చిన్న కారే అయినప్పటికీ, ఇది చాలా ధృడమైనది మరియు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది.

టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీలో 'క్యామో ఎడిషన్

టాటా పంచ్ ప్రస్తుతం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో 1.2 లీటర్, త్రీ సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. భవిష్యత్తులో టాటా పంచ్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం. కాగా, ఈ 1.2 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్‌లలో 'ట్రాక్షన్ ప్రో' అనే డ్రైవింగ్ మోడ్ కూడా ఉంటుంది.

టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీలో 'క్యామో ఎడిషన్

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టాటా పంచ్ చిన్న కారు కేవలం 6.5 సెకన్లలోనే గంటకు 0 - 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, 16.5 సెకన్లలో గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇక మైలేజ్ వివరాలను గమనిస్తే, టాటా పంచ్ మ్యాన్యువల్ వేరియంట్ లీటరుకు 18.97 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 18.82 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్) కంపెనీ పేర్కొంది.

టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీలో 'క్యామో ఎడిషన్

టాటా పంచ్ ఎస్‌యూవీలో ప్రధానంగా లభించే ఫీచర్ల విషయానికి వస్తే, కంపెనీ ఈ చిన్న కారులో ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, రెండు డ్రైవ్ మోడ్‌లు (ఎకో మరియు సిటీ), క్రూయిజ్ కంట్రోల్, టైర్ పంక్చర్ రిపేర్ కిట్, బ్రేక్ స్వే కంట్రోల్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, ఐఆర్‌ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు 27 కనెక్టెడ్ ఫీచర్లను అందిస్తోంది. టాటా పంచ ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్‌ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీలో 'క్యామో ఎడిషన్

సేఫ్టీ పరంగా చూసుకుంటే, ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో తో కూడిన ఏబిఎస్, కెమెరాతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైనవి ఉన్నాయి. టాటా మోటార్స్ పంచ్ మైక్రో ఎస్‌యూవీని కంపెనీ యొక్క కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించింది. ఇది పరిమాణంలో తేలికగా ఉండటమే కాకుండా, చాలా ధృడంగా కూడా ఉంటుంది.

టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీలో 'క్యామో ఎడిషన్

కాగా, టాటా పంచ్ ఎస్‌యూవీలో కస్టమర్లు చాలా కాలంగా ఓ డార్క్ ఎడిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. వారికి మాత్రం ఇది నిరాశపరిచే వార్త కావచ్చు. టాటా పంచ్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి చాలా మంది కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా డార్క్ ఎడిషన్‌ గురించి పలు చర్చలు ప్రారంభించారు మరియు కంపెనీని కూడా అభ్యర్థించారు. అయితే, టాటా మోటార్స్ నుండి మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ ఈవీ, టాటా అల్ట్రోజ్ మరియు టాటా హారియర్ మోడళ్లలో మాత్రమే డార్క్ ఎడిషన్స్ అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

English summary
Tata motors tolaunch punch camo edition on 22nd september details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X