బ్యాటరీతో నడిచే టాటా ఏస్ ఈవీ (Tata Ace EV) వచ్చేసిందోచ్.. దీని రేంజ్ ఏంతో తెలుసా..?

ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors), తాజాగా భారతదేశంలో టాటా ఏస్ ఈవీ (Tata Ace EV) వాణిజ్య వాహనాన్ని ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ డీజిల్ పవర్‌ట్రైన్‌తో లభిస్తూ వచ్చిన టాటా ఏస్, ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో కూడా లభ్యం కానుంది. టాటా మోటార్స్ తొలిసారిగా 2005లో ఏస్ వాణిజ్య వాహనాన్ని ప్రవేశపెట్టింది. చిన్నతరహా వ్యాపారస్థులు మరియు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ వాణిజ్య వాహనాన్ని రూపొందించింది.

బ్యాటరీతో నడిచే టాటా ఏస్ ఈవీ (Tata Ace EV) వచ్చేసిందోచ్.. దీని రేంజ్ ఏంతో తెలుసా..?

టాటా ఏస్ మార్కెట్లోకి వచ్చిన దాదాపు 17 ఏళ్ల తర్వాత కంపెనీ ఇందులో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. టాటా ఏస్ ఈవీ కంపెనీ యొక్క ఇవోజెన్ ఈవీ (Evogen EV) పవర్‌ట్రెయిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ పవర్‌ట్రైన్ సెటప్‌లో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది గరిష్టంగా 36.2 బిహెచ్‌పి పవర్ ను మరియు 130 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ట్రక్కులో అమర్చిన లిక్విడ్-కూల్డ్ IP67 సర్టిఫైడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ తో పనిచేస్తుంది.

బ్యాటరీతో నడిచే టాటా ఏస్ ఈవీ (Tata Ace EV) వచ్చేసిందోచ్.. దీని రేంజ్ ఏంతో తెలుసా..?

ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది. ఫ్లీట్ ఆపరేటర్‌లకు అధిక ఆదాయాలను సమకూర్చేలా, ఈ బ్యాటరీ ప్యాక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు కూడా ఇస్తుంది. కొత్త టాటా ఏస్ ఈవీ 3,800 మిమీ పొడవును, 1,500 మిమీ వెడల్పును మరియు 2,635 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. టాటా ఏస్ ఈవీ యొక్క వీల్‌బేస్ 2,100 మిమీగా ఉంటుంది మరియు దీని టర్నింగ్ రేడియస్ 4.3 మీటర్లుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం మొత్తం బరువు 1,840 కిలోలుగా ఉంటుంది మరియు ఇది 600 కిలోల వరకూ పేలోడ్ సామర్థ్యాన్ని మోయగలదని కంపెనీ తెలిపింది.

బ్యాటరీతో నడిచే టాటా ఏస్ ఈవీ (Tata Ace EV) వచ్చేసిందోచ్.. దీని రేంజ్ ఏంతో తెలుసా..?

టాటా ఏస్ ఈవీ యొక్క లోడ్ బాడీ 2,163 మిమీ పొడవు, 1,475 మిమీ వెడల్పు మరియు 1,847 మిమీ ఎత్తును కలిగి ఉండి 208 క్యూబిక్ అడుగుల లోడింగ్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఇది చిన్నపాటి కార్గో అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. టాటా ఏస్ ఈవీ టైర్లను గమనిస్తే, నాలుగు చక్రాలపై 155 R13 LT 8PR ప్రొఫైల్‌ తో కూడిన టైర్లు అమర్చబడి ఉంటాయి. ఇందులో 13 ఇంచ్ స్టీల్ వీల్స్, లీఫ్ స్ప్రింగ్‌లతో కూడిన ధృడమైన ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ సెటప్ మృదువైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. టాటా ఏస్ ఈవీ 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది మరియు ఏటవాలు ప్రదేశంలో కూడా సులువుగా ముందుకు సాగిపోతోంది.

బ్యాటరీతో నడిచే టాటా ఏస్ ఈవీ (Tata Ace EV) వచ్చేసిందోచ్.. దీని రేంజ్ ఏంతో తెలుసా..?

ఏస్ ఈవీ యొక్క రేంజ్ (పూర్తి చార్జ్ పై 154 కిలోమీటర్లు) ను పరిగణలోకి తీసుకుంటే, ప్రస్తుతానికి ఇది చార్జింగ్ సదుపాయాలు ఎక్కువగా ఉండే మెట్రో నగరాలకు మాత్రమే చక్కగా సరిపోతుంది. అర్బన్, రూరల్ ప్రాంతాలలో ఇంత తక్కువ రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని నిర్వహించడం కష్టంగానే ఉంటుంది. టాటా మోటార్స్ తమ ఏస్ ఈవీని ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు మరియు లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లకు కొత్త Ace EVని సరఫరా చేసేందుకు గానూ, కంపెనీ ఇప్పటికే కొన్ని అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.

బ్యాటరీతో నడిచే టాటా ఏస్ ఈవీ (Tata Ace EV) వచ్చేసిందోచ్.. దీని రేంజ్ ఏంతో తెలుసా..?

టాటా మోటార్స్ సుమారు 39,000 యూనిట్ల సరికొత్త టాటా ఏస్ ఎలక్ట్రిక్ వాహనాలను అమెజాన్ (Amazon), బిగ్‌బాస్కెట్ (BigBasket), సిటీ లింక్ (City Link), డాట్ (DOT), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), లెట్స్ ట్రాన్స్‌పోర్ట్ (LetsTransport), మూవింగ్ (MoEVing) మరియు యెల్లో ఈవీ (Yelo EV) వంటి కంపెనీ లకు డెలివరీ చేయనుంది. టాటా తన టాటా ఫ్లీట్ ఎడ్జ్ ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌ను అమలు చేస్తూ గరిష్ట ఫ్లీట్ అప్‌టైమ్ కోసం డెడికేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సపోర్ట్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

బ్యాటరీతో నడిచే టాటా ఏస్ ఈవీ (Tata Ace EV) వచ్చేసిందోచ్.. దీని రేంజ్ ఏంతో తెలుసా..?

సరికొత్త టాటా ఏస్‌ను ఆవిష్కరించిన సందర్భంగా టాటా సన్స్ మరియు టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఈ-మొబిలిటీ గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో టాటా మోటార్స్‌ అందరి కన్నా ముందంజలో వేగంగా సాగిపోందని అన్నారు. ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాలు మరియు జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి లగ్జరీ బ్రాండ్లలో కూడా తాము ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టామని, ఇప్పుడు ఏస్ ఈవీని ప్రారంభించడంతో, తాము ఈ-కార్గో మొబిలిటీ యొక్క కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నందుకు సంతోషిస్తున్నామని అన్నారు.

బ్యాటరీతో నడిచే టాటా ఏస్ ఈవీ (Tata Ace EV) వచ్చేసిందోచ్.. దీని రేంజ్ ఏంతో తెలుసా..?

టాటా ఏస్ భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన వాణిజ్య వాహనమని, ఇది రవాణాలో విప్లవాత్మక మార్పులు చేసింది మరియు లక్షలాది మంది విజయవంతమైన పారిశ్రామికవేత్తలను సంవత్సరాల తరబడి సృష్టించిందని చెప్పారు. సాంకేతికంగా అధునాతనమైన, స్వచ్ఛమైన మరియు స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌ను అందించడం ద్వారా ఇది తన వారసత్వాన్ని మరింత మెరుగుపరుస్తుందని, వాణిజ్య వాహనాలను కూడా విద్యుదీకరణ (ఎలక్ట్రిఫికేషన్) చేయడం గురించి తాను సంతోషిస్తున్నానని చంద్రశేఖరన్ తెలిపారు.

Article Published On: Thursday, May 5, 2022, 15:48 [IST]
English summary
Tata motors unveiled ace ev runs upto 154 km on full charge details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+