టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా..? వస్తే మంచి అమ్మకాలు పొందుతుందా..!!

దేశీయ విఫణిలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో 'టాటా నానో' (Tata Nano) ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో టాటా మోటార్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో 2008 లో అత్యంత సరసమైన కారు 'టాటా నానో' విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొన్ని రోజులు మంచి అమ్మకాలతో ముందుకు సాగినప్పటికీ క్రమంగా దీనికున్న ఆదరణ తగ్గుముఖం పట్ట సాగింది. దేశీయ మార్కెట్లో ఈ సరసమైన కారు విడుదలైన 10 సంవత్సరాలకు, అంటే 2018 లో ఈ మోడల్ యొక్క ఉత్పత్తి నిలిపివేయబడింది.

టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా..?

టాటా నానో కారుని ఇప్పటికి కూడా మనం రోడ్ల మీద చూడవచ్చు. అయితే కంపెనీ ఇప్పుడు నానో యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. అయితే టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ మోడల్ ఎప్పుడు దేశీయ మార్కెట్లో ఆవిష్కరిస్తుంది అనే విషయాన్ని ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్ లో విడుదలైతే తప్పకుండా దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన టాటా మోటార్స్ ఇప్పుడు నానో కారుని కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ లో విడుదల చేస్తే, ఆ స్థానం మరింత బలపడే అవకాశం ఉంటుంది. అత్యంత సరసమైన కారుగా ప్రసిద్ధి చెందిన టాటా నానో, ఎలక్ట్రిక్ వెర్షన్ లో విడుదలైతే కూడా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుంది. కావున ఇది ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వారిని తప్పకుండా ఆకర్షిస్తుంది.

టాటా నానో కారుని ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో తీసుకురావడానికి ఆటోమోటివ్ డిజైన్ నిపుణుడు ప్రత్యూష్ రౌత్ నానో ఈవి కోసం కాన్సెప్ట్ లుక్ కూడా రూపొందించారు. ఇది సాధారణ నానో కంటే కొంత పెద్దదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇందులో పెద్ద డేటైమ్ రన్నింగ్ లైట్ (డిఆర్ఎల్) మరియు కాంపాక్ట్ హెడ్ల్యాంప్ వంటివి ఉండే అవకాశం ఉంటుందని నివేదికల ద్వారా తెలుస్తుంది. సైడ్ ప్యానెల్స్ కాకుండా బంపర్ విభాగం కూడా కొంత అప్డేట్ చేయబడి ఉంటుంది.

రాబోయే టాటా నానో ఎలక్ట్రిక్ కారు పొడవైన వీల్ బేస్ మరియు విశాలమైన ఇంటీరియర్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది, కావున ఇది సాధారణ నానో కంటే కొంత పెద్దదిగా ఉంటుంది. టాటా నానో రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ విభాగంలో అడుగుపెడితే తప్పకుండా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో స్థిరమైన పట్టుని పొందుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఎంట్రీ-లెవల్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టాటా నెక్సాన్ ఈవి, టిగోర్ ఈవి మరియు టియాగో ఈవి వంటివి విజయవంతమైన అమ్మకాలను పొందుతున్నాయి. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టాటా వెహికల్ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక కంపెనీ తన నానో కారుని కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ లో విడుదల చేస్తే మరింత మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు త్వరలో తెలుస్తాయి.

ఇదిలా ఉండగా 2023 జనవరి ప్రారంభం నుంచి టాటా మోటార్స్ యొక్క వాహనాల ధరలు సుమారు 2 శాతం వరకు పెరగనున్నాయి. అయితే 2023 ప్రారంభం నుంచి టాటా టియాగో ఈవి ధరలు మాత్రం 3 నుంచి 4 శాతం పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగిన ఖర్చులలో గణనీయమైన భాగాన్నిదృష్టిలో ఉంచుకుని ధరల పెరుగుదల చేయడం జరిగిందని కంపెనీ వెల్లడించింది. టాటా మోటార్స్ మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో ఉన్న ఇతర ప్రముఖ కంపెనీలు కూడా ధరలను పెంచనున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 27, 2022, 6:30 [IST]
English summary
Tata nano version of micro ev segment car range details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+