నెక్సాన్ ఈవి బ్యాటరీని ఉచితంగా రీప్లేస్ చేసిన టాటా మోటార్స్.. పూర్తి వివరాలు
టాటా మోటార్స్ (Tata Motors) భారతీయలకు నమ్మికయిన స్వదేశీ కార్ల తయారు సంస్థ. టాటా మోటార్స్ యొక్క వాహనాలకు కేవలం భారతీయ మార్కెట్లోనే కాకుండా.. ప్రపంచదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. దీనికి ప్రధాన కారణం కంపెనీ తమ వాహనాల్లో అందించే నాణ్యత. ఈ కారణంగానే ప్రజలు ఎక్కువ సంఖ్యలో టాటా మోటార్స్ యొక్క వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఎక్కువ అమ్మకాలతో దూసుకెళ్తున్న టాటా నెక్సాన్ ఈవి (Tata Nexon EV) కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, 'టాటా నెక్సాన్ ఈవి' కలిగి ఉన్న ఒక వ్యక్తి ఇటీవల దాని బ్యాటరీని మార్చుకున్నాడు. అయితే ఈ బ్యాటరీ ధర ఏకంగా రూ. 7 లక్షలు అని పేర్కొన్నారు. ఈ వార్త ఒక్కసారిగా నెక్సాన్ ఈవి వినియోగదారుల గుండెల్లో భయం కలిగించింది. అయితే ఆ వ్యక్తి బ్యాటరీ మార్చుకున్నందుకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఎందుకంటే అతడు కంపెనీ ఇచ్చిన వారంటీ వ్యాధిలోపల మార్చుకున్నాడు, కాబట్టి బ్యాటరీని ఉచితంగా రీప్లేస్ చేసుకోవడం సాధ్యమయ్యింది.

నిజానికి ఆ వ్యక్తి తన గత రెండు సంవత్సరాలలో 68,000 కిలోమీటర్ల దూరం టాటా నెక్సాన్ లో ప్రయాణించినట్లు తెలిపాడు. ఆ సంఖ్యను ఓడో మీటర్ మీద కూడా మీరు గమనించవచ్చు. ఆ తరువాత బ్యాటరీలో ఏదో ఒక చిన్న సమస్య వచ్చినట్లు గుర్తించాడు. ఎందుకంటే కారు యొక్క బ్యాటరీ ఛార్జింగ్ 15 శాతం ఉన్నప్పుడు కూడా కారును డ్రైవ్ చేయలేకపోయినట్లు పిర్యాదు చేసాడు.

టాటా మోటార్స్ తన నెక్సాన్ ఈవి బ్యాటరీపైన 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కోలోమీటర్ల వారంటీని అందిస్తోంది. కంపెనీ అందించిన వారంటీలోపు బ్యాటరీలో ఏదైనా సమస్య గుర్తిస్తే కంపెనీ ఆ బ్యాటరీని తిరిగి ఉచితంగా రీప్లేస్ చేస్తుంది. కంపెనీ అందించిన ఈ వారంటీ ఆ టాటా నెక్సాన్ ఈవి యజమానికి చాలా సహాయపడింది.
అయితే టాటా నెక్సాన్ ఈవి యజమాని బ్యాటరీ ఖర్చు రూ. 7 లక్షలు అని పేర్కొన్నాడు. కానీ కంపెనీ ఎటువంటి బ్యాటరీ ప్యాక్ ధరను దృవీకరించలేదు.

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు వేగంగా పుట్టుకొస్తున్నాయి. కానీ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఎందుకంటే బ్యాటరీకి సంబంధించిన సాంకేతికతలు ఇంకా మనదేశంలో అంతగా అభివృద్ధి చెందలేదు. ఈ కారంగానే బ్యాటరీలు కొంత ఖరీదైనవిగానే ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ ధరలు తప్పకుండా తగ్గుతాయి.

బ్యాటరీ ప్యాక్ ధరలు ఇప్పుడు భారతదేశంలో కిలోవాట్ కి రూ. 15,000 నుండి రూ. 20,000 వరకు ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకున్నట్లతే టాటా నెక్సాన్ ఈవిలో 30.3 కిలోవాట్ బ్యాటరీ ఉంది కావున దీని ధర, సుమారు రూ. 6.06 లక్షల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

నిజానికి భారతీయ మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవి మైలేజ్ పరంగా, భద్రత పరంగా తిరుగులేకుండా ముందుకు సాగుతోంది. డిజైన్ పరంగా కానీ ఫీచర్స్ పరంగా కానీ టాటా నెక్సాన్ ఉత్తమైన ఎలక్ట్రిక్ కారు. ఈ కారణాల వల్లనే టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రారాజుగా నిలిచింది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్‌ను ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చబడి ఉంటుంది. ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న ప్రకారం, నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. హోమ్ ఛార్జర్ ద్వారా 7 నుండి 8 గంటల సమయం పూర్తి ఛార్జింగ్ చేసుకుంటుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. మొత్తం మీద అన్ని విధాలుగా టాటా నెక్సాన్ ఈవి వాహన వినియోగదారులకు ఉత్తమైన ఎంపికగానే ఉంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
టాటా నెక్సాన్ భారతీయ మార్కెట్లో ఎంతగా అమ్మకాలను పొందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ కారుపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేదు. అయితే బ్యాటరీ సమస్యను నివేదించడం బహుశా ఇదే మొదటిసారి. కావున నెక్సాన్ వినియోగదారులు దీనిపైనా ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.


Click it and Unblock the Notifications








