టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)లో మంటలు.. భద్రతా లోపమా లేక అగ్నిప్రమాదమా..?

మనం ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో మంటలు చెలరేగడం గురించి విన్నాం మరియు చూశాం. కానీ, ఇప్పుడు మొదటిసారిగా ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగిన ఘటన నమోదైంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) విక్రయిస్తున్న పాపులర్ ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ముంబైలో జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)లో మంటలు.. భద్రతా లోపమా లేక అగ్నిప్రమాదమా..?

వివరాల్లోకి వెళితే.. జూన్ 22, 2022వ తేదీన ముంబైలో ఓ టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగాయి. భారతదేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటైన టాటా నెక్సాన్ ఈవీలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ప్రమాదం జరగడానికి భద్రతా లోపమే కారణమా లేక యాక్సిడెంటల్‌ గా ఈ ప్రమాదం జరిగిందా అనే విషయంపై పోలీసులు మరియు కంపెనీ దర్యాప్తు చేస్తున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)లో మంటలు.. భద్రతా లోపమా లేక అగ్నిప్రమాదమా..?

ప్రస్తుతం, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న నెంబర్ వన్ ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీ. కంపెనీ ఇటీవలే ఇందులో ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను కూడా విడుదల చేసింది. పెర్ఫార్మెన్స్, రేంజ్, ఛార్జింగ్ టైం మరియు ప్రాక్టికాలిటీ వంటి అంశాలలో ఇది ది బెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది. దీని విశిష్టమైన ఫీచర్లు మరియు సరసమైన ధర కారణంగా ఈ కారు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా దక్కించుకుంది.

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)లో మంటలు.. భద్రతా లోపమా లేక అగ్నిప్రమాదమా..?

టాటా మోటార్స్ ప్రస్తుతం మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్లను విక్రయిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ కూడా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా బ్యాటరీని కాపాడేందుకు కొన్ని అదనపు సాంకేతిక ఫీచర్లతో కూడా వస్తుంది. కాబట్టి, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, ముంబైలో జరిగిన ఘటనలో టాటా నెక్సాన్ ఈవీ యొక్క భద్రతా అంశాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అయితే, ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని వరుస ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్ని ప్రమాదాలు ఇప్పుడు ఈవీల సేఫ్టీ విషయంలో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)లో మంటలు.. భద్రతా లోపమా లేక అగ్నిప్రమాదమా..?

ముంబై నగరంలో జరిగిన టాటా నెక్సాన్ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ కమల్ జోషి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. ఇది ముంబైలోని వసాయ్ వెస్ట్‌లో జరిగినట్లు చెబుతున్నారు. సంఘటన జరిగినప్పుడు సదరు కారు యజమాని తన కార్యాలయంలో నెక్సాన్ ఈవీని ఛార్జ్ చేసి ఇంటికి తిరుగు పయనం అయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. బంపర్ టూ బంపర్ ట్రాఫిక్‌లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని నడుపుతున్నందున హై-స్పీడ్ డ్రైవింగ్ కూడా లేదని కూడా చెప్పబడింది.

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)లో మంటలు.. భద్రతా లోపమా లేక అగ్నిప్రమాదమా..?

అయితే, కారులో క్రింది భాగంలో అమర్చిన బ్యాటరీ ప్యాక్ నుండి పొగ రావడం ప్రారంభించడానికి ముందు డాష్‌బోర్డ్‌లో కొన్ని క్లిక్ సౌండ్‌లు మరియు కొన్ని వార్నింగ్ లైట్లు ఆన్ అయినట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాహనంలో మంటలు చెలరేగడంతో బ్యాటరీలోని సెల్‌లు ఒకదాని తర్వాత ఒకటి పేలడం ప్రారంభించాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. కానీ, అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు నురుగుకు (ఫోమ్) కి బదులు నీటిని ఉపయోగించడం సరికాదన్నారు.

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)లో మంటలు.. భద్రతా లోపమా లేక అగ్నిప్రమాదమా..?

నీరు విద్యుత్తు యొక్క అద్భుతమైన కండక్టర్ మరియు ఇది బ్యాటరీ ప్యాక్‌లోని మరిన్ని సెల్‌లు మంటల్లోకి పగిలిపోయేలా చేస్తుంది. చివరికి మంటలు బ్యాటరీ ప్యాక్‌లోని ప్రతి ఇతర సెల్‌కి వ్యాపిస్తాయి. టాటా నెక్సాన్ ఈవీ బ్యాటరీ ప్యాక్‌లో 7,000 కంటే ఎక్కువ సెల్‌లు ఉన్నట్లు సమాచారం.

టాటా నెక్సాన్ ఈవీ యజమానులు ఆందోళన చెందాలా?

ఇప్పటి వరకూ టాటా ఎలక్ట్రిక్ కార్లలో అగ్ని ప్రమాదాలు జరిగినట్లు ఎక్కడా కేసులు నమోదు కాలేదు, ఇదే మొదటి. కాబట్టి, ఈ ఒక్క సంఘటన ఆధారంగా మొత్తం టాటా మోటార్స్ కంపెనీని తప్పు పట్టడం సరికాదు. కాబట్టి, ఈ సంఘటన గురించి ప్రస్తుత మరియు కొత్త టాటా నెక్సాన్ ఈవీ యజమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లోకి రావడానికి ప్రాథమిక కారణం ఏమిటంటే, బ్యాటరీ ప్యాక్‌లో ఉపయోగించిన సెల్‌లు భారతీయ పరిస్థితులు మరియు ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఉండకపోవడమే. ఒక్క మాటలో చెప్పాలంటే, చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు తగిన శీతలీకరణ (కూలింగ్ సిస్టమ్) ఉండదు.

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)లో మంటలు.. భద్రతా లోపమా లేక అగ్నిప్రమాదమా..?

కానీ, ఎలక్ట్రిక్ కార్లలో పరిస్థితి మరోలా ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్లలో తగనంత స్థలం ఉంటుంది కాబట్టి, అందులో సరైన కూలింగ్ సిస్టమ్ ఉంటుంది మరియు ఇది బ్యాటరీలను త్వరగా చల్లబరచడంలో సహకరిస్తుంది. టాటా నెక్సాన్ వంటి ఎలక్ట్రిక్ కార్ల విషయంలో సమగ్ర శీతలీకరణ వ్యవస్థను అమలు చేయడానికి హుడ్ కింద తగినంత స్థలం ఉంటుంది. కాబట్టి, అవి పరిసర ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా చల్లగా మరియు మరింత సమర్ధవంతంగా నడుస్తాయి. అదనపు కూలింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ టాటా నెక్సాన్‌లో అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఒక నిర్ధారణకు రావడం కష్టమవుతుంది. ఈ ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata nexon ev catches fire in mumbai company to investigate the incident details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X