వేసవిలో విడుదల కానున్న లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ.. రేంజ్ ఎంతంటే..?

ప్రముఖ దేశీయ కంపెనీ టాటా టాటా మోటార్స్ (Tata Motors), ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ బ్రాండ్ నుండి టిగోర్ ఈవీ (Tata Tigor EV) మరియు నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో టాటా నెక్సాన్ ఈవీ కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఇది పూర్తి చార్జ్ పై 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. అయితే, కంపెనీ ఇప్పుడు ఇందులో లాంగ్ రేంజ్ వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

వేసవిలో విడుదల కానున్న లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ.. రేంజ్ ఎంతంటే..?

తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 400 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని సమాచారం మరియు ఇది ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఈ కొత్త 2022 టాటా నెక్సాన్ ఈవీలో పెద్ద 40 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఫలితంగా, ఇందులో ఎక్కువ రేంజ్ ను పొందటం సాధ్యమవుతుంది.

వేసవిలో విడుదల కానున్న లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ.. రేంజ్ ఎంతంటే..?

ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్‌ను ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చబడి ఉంటుంది. ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న ప్రకారం, నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

వేసవిలో విడుదల కానున్న లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ.. రేంజ్ ఎంతంటే..?

అయితే, ఈ కొత్త లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ మోడల్ లో మునుపటి కన్నా దాదాపు 30 శాతం పెద్ద బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించడం ఉండటం వలన దాని బరువు మరియు బూట్ స్పేస్‌ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఇంది. అప్‌డేట్ చేయబడిన కొత్త 2022 మోడల్ టాటా నెక్సాన్ ఈవీ లోకల్ టెస్ట్ సైకిల్ లో ఒకే ఛార్జ్‌పై సుమారు 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ను కలిగి ఉంటుంని, అయితే వాస్తవ ప్రపంచ పరిధి అది దాదాపు 300-320 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని అంచనా వేయబడింది.

వేసవిలో విడుదల కానున్న లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ.. రేంజ్ ఎంతంటే..?

కాగా, ప్రస్తుతం విక్రయించబడుతున్న 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగిన టాటా నెక్సాన్ ఈవీ రియల్ వరల్డ్ లో సుమారు 200-250 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని సమాచారం. టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుత వెర్షన్ యొక్క రేంజ్ విషయంలో వినియోగదారులు సంతృప్తిగా లేని నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ ను విడుదల చేయాలని చూస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.

వేసవిలో విడుదల కానున్న లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ.. రేంజ్ ఎంతంటే..?

టెస్టింగ్ దశలో ఉన్న లాంగ్ రేంజ్ టాటా నెక్సాన్ ఈవీ వేరియంట్ చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. ఈ స్పై చిత్రాలను చూస్తుంటే, ప్రస్తుతం విక్రయిస్తున్న వెర్షన్ మరియు త్వరలో అమ్మకానికి రానున్న కొత్త వెర్షన్ రెండూ కూడా డిజైన్ పరంగా దాదాపు ఒకేలా ఉంటాయని తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లలో డిజైన్ పరంగా పెద్దగా మార్పులు ఉండబోవని, ఎయితే పవర్‌ట్రైన్ పరంగా మాత్రం పెద్ద మార్పు ఉండబోతోందని తెలుస్తోంది.

వేసవిలో విడుదల కానున్న లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ.. రేంజ్ ఎంతంటే..?

కొత్త టాటా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ యొక్క టెస్ట్ మోడల్‌లో 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు మొత్తం 4 చక్రాలలో డిస్క్ బ్రేక్‌లు వంటివి మాత్రమే ముఖ్యమైన మార్పులుగా కనిపిస్తున్నాయి. ఈ తరహా అల్లాయ్ వీల్స్ ని కంపెనీ ఇప్పటికే తమ పెట్రోల్ పవర్డ్ నెక్సాన్ కారు యొక్క డార్క్ ఎడిషన్‌లో ఉపయోగిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ఇప్పుడు వెనుక చక్రాలపై కూడా డిస్క్ బ్రేక్‌లను జోడించడం ద్వారా అదనపు స్టాపింగ్ పవర్ లభిస్తుంది.

వేసవిలో విడుదల కానున్న లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ.. రేంజ్ ఎంతంటే..?

ఈ 2022 మోడల్ టాటా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్ లో ఉపయోగించబోయే పెద్ద 40 kWh బ్యాటరీ ప్యాక్‌ కారణంగా దాని బరువు కూడా దాదాపు 100 కిలోలు పెరిగే అవకాశం ఉంది మరియు దానికి అనుగుణంగా కంపెనీ ఈ కారు ఫ్లోర్ డిజైన్ ను మార్చనుంది. పెరిగిన బరువును హ్యాండిల్ చేయడం కోసం ఇందులో బ్రేకింగ్ సెటప్ ను కూడా మార్చినట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం, కొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంగ్-రేంజ్ వెర్షన్ లో కొన్ని అదనపు ఫీచర్లు కూడా జోడించబడుతాయని సమాచారం.

వేసవిలో విడుదల కానున్న లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ.. రేంజ్ ఎంతంటే..?

ఈ కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ ఈ ఏడాది వేసవి నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. పెరిగిన రేంజ్ కారణంగా దీని ధర కూడా ప్రీమయంగా మారనుంది. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకాని ఉన్న నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారుతో పోలిస్తే ఈ కొత్త మోడల్ ధర దాదాపు రూ. 3 నుంచి రూ. 4 లక్షలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం, మార్కెట్లో టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 14.24 లక్షల నుంచి రూ. 16.85 లక్షల (ఎక్స్-షోరూమ్ ) మధ్యలో ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 17, 2022, 17:05 [IST]
English summary
Tata nexon ev long range variant under works likely to hit roads by this summer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+