టాటా మోటార్స్ నుంచి కొత్త 'నెక్సాన్ ఈవి మ్యాక్స్': వచ్చేస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 400 కిమీ రేంజ్ పక్కా..

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి 'టాటా మోటార్స్' (Tata Motors). టాటా మోటార్స్ యొక్క 'టాటా నెక్సాన్' (Tata Nexon) కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలు జరుపుతున్న SUV. ఇందులో ఇప్పటికే అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్ ఈవి కూడా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు కంపెనీ టాటా నెక్సాన్ ఈవి యొక్క లాంగ్ రేంజ్ మోడల్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కొత్త అప్డేటెడ్ మోడల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

టాటా మోటార్స్ నుంచి కొత్త 'నెక్సాన్ ఈవి మ్యాక్స్': వచ్చేస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 400 కిమీ రేంజ్ పక్కా..

టాటా మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం, టాటా నెక్సాన్ ఈవి యొక్క కొత్త మోడల్ ఈ వారంలోనే దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలకానుంది. కంపెనీ దీనికి 'టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్' (Tata Nexon EV Max) అని పేరు కూడా పెట్టింది. ఈ కొత్త ఆధునిక మోడల్ ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది.

టాటా మోటార్స్ నుంచి కొత్త 'నెక్సాన్ ఈవి మ్యాక్స్': వచ్చేస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 400 కిమీ రేంజ్ పక్కా..

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్ ఈవి 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఇది 127 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV ఒక్క చార్జితో దాదాపుగా 312 కిమీ పరిధిని అందిస్తుందని ARAI చేత ద్రువీకరించబడింది. అయితే వాస్తవ ప్రపంచంలో గణాంకాలు మారాయి. నిజానికి టాటా నెక్సాన్ ఈవి 200 కిమీ నుంచి 250 కిమీ పరిధిని అందిస్తుంది.

టాటా మోటార్స్ నుంచి కొత్త 'నెక్సాన్ ఈవి మ్యాక్స్': వచ్చేస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 400 కిమీ రేంజ్ పక్కా..

అయితే కంపెనీ ఇప్పుడు విడుదల చేయనున్న కొత్త అప్డేటెడ్ మోడల్ మరింత ఎక్కువ పరిధిని అందించేలా రూపొందించబడింది. కంపెనీ ఈ కొత్త SUV ని దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలచేయకముందే ఒక టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్‌లో, టాటా మోటార్స్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ SUV గురించి చాలా వివరాలు వెల్లడయ్యాయి.

టాటా మోటార్స్ నుంచి కొత్త 'నెక్సాన్ ఈవి మ్యాక్స్': వచ్చేస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 400 కిమీ రేంజ్ పక్కా..

త్వరలో రానున్న కొత్త టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ వేరియంట్‌ 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో అందించబడుతుంది. అంతే కాకూండా మంచి పరిధిని అందించడానికి ఇది మరింత శక్తివంతమైన మోటార్ కూడా పొందినట్లు తెలిపింది. ఈ కొత్త వేరియంట్ 136 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. అయితే ఈ వేరియంట్ ఇప్పుడు ఒక్క ఛార్జ్ తో ఏకంగా 400 కిమీ పరిధిని అందించగలదు.

టాటా మోటార్స్ నుంచి కొత్త 'నెక్సాన్ ఈవి మ్యాక్స్': వచ్చేస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 400 కిమీ రేంజ్ పక్కా..

తాజాగా విడుదలైన ఈ టీజర్‌లో, కొత్త టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ ఒక్క చార్జితో ముంబై నుండి పూణే వరకు ప్రయాణించగలదని టాటా మోటార్స్ ధృవీకరించింది. అదేవిధంగా ఈ కారు ఢిల్లీ నుండి కురుక్షేత్ర, బెంగుళూరు నుండి మైసూర్, చెన్నై నుండి పాండి, గాంధీనగర్ నుండి వడోదర, రాంచీ నుండి ధన్‌బాద్ వరకు తిరుగు ప్రయాణం చేయగలదని కూడా నిర్దారించడింది. మొత్తం మీద ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా గొప్ప పరిధిని అందించగలదని విశ్వసించవచ్చు.

టాటా మోటార్స్ నుంచి కొత్త 'నెక్సాన్ ఈవి మ్యాక్స్': వచ్చేస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 400 కిమీ రేంజ్ పక్కా..

కొత్త టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ యొక్క డిజైన్ లో ఊహించిన మార్పులు ఉండే అవకాశం లేదు. ఇందులో కేవలం టెక్నికల్ అప్డేటెడ్స్ మాత్రమే జరిగాయి. కావున ఈ SUV యొక్క ముందు, వెనుక మరియు వెస్ట్‌లైన్‌లో బ్లూ హైలైట్‌లను గమనించవచ్చు. అయితే హెడ్‌లైట్‌లు మరియు టెయిల్‌లైట్‌లు మునుపటి నెక్సాన్ ఈవి మాదిరిగానే ఉంచబడ్డాయి.

టాటా మోటార్స్ నుంచి కొత్త 'నెక్సాన్ ఈవి మ్యాక్స్': వచ్చేస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 400 కిమీ రేంజ్ పక్కా..

కొత్త టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ ఇప్పుడు చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా చాలా ఆకర్షణీయమైన 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను పొందింది. ఇందులో అదనపు బరువు మరియు అధిక వేగాన్ని నిర్వహించడానికి బ్రేక్‌లు మరింత శక్తివంతంగా తయారు చేయబడ్డాయి. సాధారణ టాటా నెక్సాన్ ఈవి మాదిరిగా కాకుండా, రానున్న కొత్త నెక్సాన్ ఈవి మ్యాక్స్ యొక్క వెనుక చక్రాలు కూడా డిస్క్ బ్రేక్‌లు అందించడం జరిగింది. కావున ఇప్పుడు బ్రేకింగ్ సిస్టం మునుపటికంటే కూడా చాలా మెరుగైనదిగా ఉంటుంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ యొక్క ఇంటీరియర్‌లు ఇల్యూమినేటెడ్ గేర్ సెలెక్టర్ రోటరీ నాబ్‌తో పార్క్ మోడ్‌ను పొందుతాయి. ఇది క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెదర్ అపోల్స్ట్రే మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ నుంచి కొత్త 'నెక్సాన్ ఈవి మ్యాక్స్': వచ్చేస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 400 కిమీ రేంజ్ పక్కా..

టాటా మోటార్స్ యొక్క అన్ని వాహనాలు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. కావున రానున్న 'టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్' కూడా అదే తరహాలు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని ఆశిస్తున్నాము. ఇకపోతే ఈ SUV యొక్క ధరకు సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారంత్వరలోనే వెల్లడవుతుంది.

Most Read Articles

English summary
Tata nexon ev max new range teaser released launch on 11 may details
Story first published: Monday, May 9, 2022, 19:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X