టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ (Tata Nexon EV Prime) విడుదల.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) లో ఓ కొత్త వెర్షన్ ను విడుదల చేసింది. టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ (Tata Nexon EV Prime) పేరుతో కంపెనీ ఈ కొత్త మోడల్ ను పరిచయం చేసింది. అయితే, ఇది టాటా మోటార్స్ ప్రస్తుతం విక్రయిస్తున్న స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్ గా ఉంటుంది మరియు పాత మోడల్ కన్నా మరిన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ (Tata Nexon EV Prime) విడుదల.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన లాంగ్ రేంజ్ వెర్షన్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) లో అందించిన కొన్ని ఫీచర్లను ఇప్పుడు ఈ టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ లో కూడా పొందవచ్చు. వీటిలో మల్టీ రీజియన్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ మరియు i-TPMS మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త ఫీచర్లను కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఇప్పటికే ఉన్న టాటా నెక్సాన్ ఈవీ ఓనర్‌లకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ (Tata Nexon EV Prime) విడుదల.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

జూలై 25 నుండి బ్రాండ్ యొక్క సర్వీస్ సెంటర్‌లలో ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది, కాబట్టి అప్‌డేట్ పొందాలనుకునే కస్టమర్‌లు కంపెనీ సర్వీస్ సెంటర్‌లను సందర్శించవచ్చు. టాటా నెక్సాన్ ఈవీ యొక్క కొత్త లాంగ్ రేంజ్ వెర్షన్ అయిన నెక్సాన్ ఈవీ మ్యాక్స్ విషయానికి వస్తే, కంపెనీ దీనిని మూడు కలర్ ఆప్షన్లలో విక్రయిస్తోంది. వీటిలో డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్ మరియు ఇంటెన్సిటీ-టీల్ అనే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో ఇంటెన్సిటీ-టీల్ కలర్ ఆప్షన్ పూర్తిగా కొత్తది మరియు టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కోసం మాత్రమే ప్రత్యేకంగా అందించబడుతోంది.

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ (Tata Nexon EV Prime) విడుదల.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ను కంపెనీ రెండు వేరియంట్లు మరియు రెండు రకాల చార్జర్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. వీటిలో XZ+ మరియు XZ+ Lux అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇవి రెండూ కూడా 3.3kW చార్జర్ మరియు 7.2kW ఏసి ఫాస్ట్ చార్జర్‌తో లభిస్తాయి. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో ఎక్కువ రేంజ్ ను సాధించడం కోసం కంపెనీ పెద్ద 40.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించింది. ఇది పూర్తి చార్జ్ పై ARAI సర్టిఫై చేసిన దాని ప్రకారం 437 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అయితే, రియల్ వరల్డ్ కండిషన్స్ లో దీని రేంజ్ సుమారు 350-400 కిలోమీటర్ల వరకూ ఉంటుంది.

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ (Tata Nexon EV Prime) విడుదల.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

కాగా, స్టాండర్డ్ మోడల్ టాటా నెక్సాన్ ఈవీ మరియు కొత్తగా వచ్చిన నెక్సాన్ ఈవీ ప్రైమ్ రెండూ కూడా 30.3 kWh చిన్న బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటాయి. ఇవి పూర్తి చార్జ్ పై 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తాయి. అయితే, రియల్ వరల్డ్ లో ఇది 250 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే ఈ లాంగ్ రేంజ్ వేరియంట్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ దాని కన్నా 125 కిలోమీటర్లు ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. డిజైన్ పరంగా స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, వాటి రేంజ్, పెర్ఫార్మెన్స్ మరియు ఫీచర్ల పరంగా ఇవి వేర్వేరుగా ఉంటాయి.

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ (Tata Nexon EV Prime) విడుదల.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో మల్టీ-లెవల్ రీజెన్ బ్రేకింగ్‌ సిస్టమ్, యాక్టివ్ మోడ్ డిస్‌ప్లేతో కూడిన కంట్రోల్ నాబ్, సరికొత్త మకరనా బేజ్ ఇంటీరియర్స్, ముందు ప్రయాణికుల కోసం వెంటిలేషన్‌తో కూడిన లెథెరెట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, క్రూయిజ్ కంట్రోల్, I-VBAC (ఇంటెలిజెంట్ - వాక్యూమ్-లెస్ బూస్ట్ అండ్ యాక్టివ్ కంట్రోల్), హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆటో వెహికల్ హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు 4 చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ (Tata Nexon EV Prime) విడుదల.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా ఈ వేరియంట్ డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కేవలం 9 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 140 కిమీ టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఇక చార్జింగ్ సమయం విషయానికి వస్తే, ఈ బ్యాటరీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జర్లను రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క 40.5kWh బ్యాటరీ ప్యాక్‌ను వేగవంతమైన 50kW DC ఛార్జర్‌కి కనెక్ట్ చేసినప్పుడు కేవలం 56 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే కొత్త 7.2kWh AC ఛార్జర్‌ సాయంతో అయితే బ్యాటరీ పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ (Tata Nexon EV Prime) విడుదల.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ ఇప్పుడు తమ నెక్సాన్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రెండు వెర్షన్ల ధరలను రూ.20,000 నుండి రూ.60,000 వరకూ పెంచింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ ను బట్టి దీని ధరలు మారుతూ ఉంటాయి. టాటా నెక్సాన్ ఈవీ యొక్క అన్ని వేరియంట్ల కొత్త ధరలు ఇలా ఉన్నాయి:

టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ఎమ్ - రూ.14,99 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్ ప్లస్ - రూ.16.30 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ - రూ.17.30 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎక్స్‌జెడ్ ప్లస్ - రూ.16.49 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ - రూ.17.50 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ప్లస్ 3.3 kW - రూ.18.34 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ప్లస్ 7.2 kW - రూ.18.84 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ 3.3 kW - రూ.19.34 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ 7.2 kW - రూ.19.84 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

More from DriveSpark

Article Published On: Wednesday, July 13, 2022, 11:40 [IST]
English summary
Tata nexon ev prime launched with updated features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+