అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,500 సేల్స్

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) యొక్క టాటా నెక్సాన్ (Tata Nexon) EV భారతీయ మార్కెట్లో విపరీతమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని దేశీయ మార్కెట్లో విడుదలచేసినప్పటినుంచి కూడా మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే ఇప్పటికి కంపెనీ ఈ SUV ని 13,500 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది.

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

భారత మార్కెట్లో టాటా మోటార్స్ కంపెనీ గత రెండేళ్లుగా నెక్సాన్ ఈవీని విక్రయిస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో, కంపెనీ భారతదేశంలో 4,000 యూనిట్ల అమ్మకాలను దాటుతుందని తెలిపింది. అయితే దాదాపుగా 10 నెలల్లో 9,000 నెక్సాన్ ఈవిలను విక్రయించింది. దేశీయ మార్కెట్లో ఎలక్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా క్రమంగా ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు కూడా ఊపందుకుంటున్నాయి.

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

కంపెనీ యొక్క నెక్సాన్ EV నెలకు సగటున 1,000 యూనిట్ల విక్రయాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రైవేట్ కొనుగోలుదారుల కోసం దేశీయ వాహన తయారీదారు ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ వాహనం మరియు త్వరగా భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎలక్ట్రిక్ కారుగా మారింది.

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

Tata Nexon EV భారతదేశంలో రూ. 14.29 లక్షల నుండి రూ. 16.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంది. కావునా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. Nexon EV మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి సిగ్నేచర్ టీల్ బ్లూ, గ్లేసియర్ వైట్ మరియు మూన్‌లైట్ సిల్వర్‌ కలర్స్. ఇటీవల, కంపెనీ డార్క్ ఎడిషన్‌ను కూడా పరిచయం చేసింది, ఇది EV ని స్టైలిష్ మిడ్‌నైట్ బ్లాక్ షేడ్‌లో అందుబాటులో ఉంచుతుంది.

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

టాటా నెక్సాన్ EV ని కంపెనీ జిప్‌ట్రాన్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. టాటా టిగోర్ EV కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌పైనే నిర్మించింది. Nexon EV లో డ్యుయల్ పాడ్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, 16-ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, లెదర్-కవర్డ్ స్టీరింగ్ వీల్, పుష్ బటన్ స్టార్ట్ మరియు క్లైమేట్ కంట్రోల్‌ వంటి ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

టాటా మోటార్స్ కంపెనీపైన కస్టమర్లకు ఉన్న నమ్మకం కారణంగా కంపెనీ యొక్క అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో కంపెనీ తన ఉత్పత్తులను కూడా నిరంతరం పెంచుతూనే ఉంది. ఇందులో భాగంగానే టాటా నెక్సాన్ EV కూడా ఎప్పకప్పుడు నవీనీకరించబడుతోంది. భారతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో టాటా నెక్సాన్ EV ఏకంగా 70 శాతం వాటాను కలిగి ఉంది

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

టాటా నెక్సాన్ EV మంచి పనితీరుని అందిస్తుంది. ఇందులో 30.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది 129 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది IP67 ప్రమాణాలకు అనుకూలంగా ఉండటమే కాకుండా ఇది వాట్ ప్రూఫ్ గా కూడా ఉంటుంది.

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

టాటా నెక్సాన్ కేవలం 9.58 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. టాటా నెక్సాన్ EV పూర్తిగా ఛార్జ్ చేస్తే 312 కిమీల పరిధిని అందిస్తుంది. టాటా మోటార్స్ నెక్సాన్ EVని 3.3 kW ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో అందిస్తుంది, ఇది ఎనిమిది గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదు. అదే విధంగా ఇది 25 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 60 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ తన ఎంపిక చేసిన మోడళ్ల ధరలను 2022 జనవరి 19 నుంచి పెంచుతూ ప్రకటించింది. ఇందులో భాగంగానే మోడల్ మరియు వేరియంట్ ప్రకారం వాటి ధరలను 0.9 శాతం పెంచింది. కానీ జనవరి 19 మరియు అంతకంటే ముందు బుక్ చేసుకున్న కస్టమర్లకు వాటి పాత ధరలే వర్తిస్తాయి.

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు అనేది Tigor EV మినహా అన్ని మోడళ్లకు వర్తించింది. టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ధర ఇప్పుడు రూ. 22,000 వరకు పెరిగింది. అయితే NRG వెర్షన్ ఇప్పుడు రూ. 5,500 మాత్రమే పెరిగింది. అదే సమయంలో టాటా హారియర్ మరియు టాటా సఫారీలు వంటి వాటి ధరలు కూడా రూ. 15,000 వరకు పెరిగాయి.

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

అంతే కాకుండా ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన టాటా మోటార్స్ యొక్క కొత్త మైక్రో SUV టాటా పంచ్ యొక్క క్రియేటివ్ వేరియంట్‌ రూ. 10,100 తగ్గించబడింది, మిగిలిన అన్ని వేరియంట్‌ల ధరలు ఇప్పుడు రూ. 15,900 మేర ధర పెరిగాయి.

అమ్మకాల్లో Tata Nexon న్యూ రికార్డ్ కైవసం.. ఇప్పటికి ఏకంగా 13,000 క్రాస్

ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క బేస్ టర్బో-పెట్రోల్ వేరియంట్ ధర రూ. 2,000 మరియు ఇతర టర్బో-పెట్రోల్ వేరియంట్‌ల ధరలు రూ. 8,000 వరకు తగ్గించబడ్డాయి. ఆల్ట్రోజ్ యొక్క అన్ని ఇతర వేరియంట్‌లు రూ. 15,000 పెరుగుదలను పొందాయి. మార్కెట్లో ఇప్పుడు టాటా నెక్సాన్ ధర రూ. 13,000 పెరిగింది. అదే సమయంలో Tigor ధర కూడా ఇప్పుడు రూ. 15,000 వరకు పెరిగింది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ యొక్క అన్ని వేరియంట్‌లలో రూ. 5,000 పెరుగుదల ఉంది. ఈ ధరలన్నీ కూడా అమ్మకాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉందా.. అనే విషయం త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 31, 2022, 12:58 [IST]
English summary
Tata nexon ev sales milestone 13500 units details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+