కస్టమర్ల కోరిక తీర్చడానికి సిద్దమైన Tata Motors: సింగిల్ టోన్ కలర్‌లో రానున్న Tata Punch
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'టాటా పంచ్' (Tata Punch) మొత్తం 5 వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులోని క్రియేటివ్ వేరియంట్ త్వరలో కొన్ని కొత్త సింగిల్ టోన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త టాటా పంచ్ యొక్క ఈ వేరియంట్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, అయితే కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ త్వరలో సింగిల్ టోన్ కలర్ ఆప్షన్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. టాటా పంచ్ ప్యూర్, అడ్వెంచర్, కంప్లీట్ మరియు క్రియేటివ్ అనే వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

ఇటీవల కాలంలోనే టాటా మోటార్స్ టాటా పంచ్ యొక్క కజిరంగా ఎడిషన్ ని కూడా పరిచయం చేసింది. అయితే త్వరలో రానున్న కొత్త సింగిల్ టోన్ కలర్ వేరియంట్ ధర దాని డ్యూయెల్ టోన్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మీటియార్ బ్రాంజ్, అటామిక్ ఆరెంజ్, ట్రాపికల్ మిస్ట్, డేటోనా గ్రే మరియు ఓర్క్స్ వైట్ వంటి కొత్త కలర్ ఆప్సన్స్ లో తీసుకురాబడుతుంది.

టాటా పంచ్ యొక్క కలర్ ఆప్సన్స్ తప్ప, ఎటువంటి మార్పులు జరిగే అవకాశం లేదు. కావున ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు ఫీచర్స్ వంటి వాటిని గురించి కూడా కస్టమర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన ధరలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ యొక్క కొత్త టాటా పంచ్ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందటం వల్ల ఎక్కువ బుకింగ్స్ మరియు అమ్మకాలను పొందగలిగింది. టాటా పంచ్ ఇప్పటికి 32,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలను పొందగలిన కారుగా నిలిచింది.

టాటా పంచ్ 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్‌ఎ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 27 కనెక్టెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

టాటా పంచ్ 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ ఉన్నాయి. ఇటువంటి అధునాతన మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కొత్త మైక్రో SUV దేశీయ మార్కెట్లో ఈ నెలలో కూడా మరింత ఆశాజనకమైన అమ్మకాలను పొందుతుంది.

టాటా పంచ్ 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

టాటా పంచ్ మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో టాటా పంచ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకొని, భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన చిన్నకారుగా నిలిచింది. ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో కూడిన ABS, కెమెరాతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రను నిర్ధరిస్తాయి. కంపెనీ త్వరలో టాటా పంచ్ మైక్రో SUV ని సింగిల్ టోన్ కలర్ లో తీసుకు రానుంది, కావున మరింత ఎక్కువ అమమకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








