ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానున్న 'టాటా పంచ్'.. ఇక అభిమానులకు పండుగే
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తిరుగులేని కంపెనీగా కొనసాగుతున్న దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' భారతీయ మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ 'టాటా పంచ్' SUV ని ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో విడుదల చేయనుంది.
టాటా మోటార్స్ భారత మార్కెట్ కోసం 'పంచ్ EV' ని తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుంది అనేదానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడించలేదు. కానీ దేశీయ మార్కెట్లో 2023 మూడవ త్రైమాసికంలో విక్రయించబడే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాదికి భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది.

టాటా మోటార్స్ తన 'పంచ్ ఈవి' ని దేశీయ మార్కెట్లో విడుదల చేస్తే టాటా లైనప్‌లో నాల్గవ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ అవుతుంది. కాగా ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న Tigor EV మరియు Nexon EV మధ్య ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు యొక్క రేంజ్ వంటివి కూడా ఇంకా అందుబాటులో లేదు, అయినప్పటికీ ఇది 300 నుంచి 350 కిమీ పరిధిని అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
టాటా పంచ్ ఆల్ఫా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండనుంది. ALFA ప్లాట్‌ఫారమ్ మల్టిపుల్ బాడీ స్టైల్స్ మరియు ICE, ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లకు సరిపోయేలా రూపొందించబడింది. టాటా Altroz కూడా అదే ప్లాట్‌ఫారమ్ మీద ఆధారపడి ఉంటుంది. రాబోయే టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు దాని స్టాండర్డ్ మోడల్ యొక్క డిజైన్ పొందుతుందని భావిస్తున్నాము. కావున చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ప్రస్తుతం టాటా పంచ్ మైక్రో SUV మొత్తం 7 కలర్స్ (ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్, టోర్నాడో బ్లూ) లో అందుబాటులో ఉంటుంది. ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.
డిజైన్ విషయానికి వస్తే సాధారణ టాటా పంచ్ సిగ్నేచర్ గ్రిల్ పొందుతుంది, ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.
టాటా పంచ్ SUV 7 ఇంచెస్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హెడ్‌ల్యాంప్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా రెయిన్ సెన్సింగ్ వైపర్, ఆటో ఫోల్డింగ్ రియర్ వ్యూ మిర్రర్, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ సిస్టమ్, కూల్డ్ గ్లో బాక్స్, రియర్ వైపర్ ప్లస్ వాష్, రియర్ డీఫాగర్, పెడల్ ల్యాంప్స్, రియర్ సీట్ ఆర్మ్ రెస్ట్ మరియు గేర్ నాబ్‌తో కూడిన స్టీరింగ్ వీల్ అందించబడతాయి.
ఇక చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








