ఆ ఫీచర్ లేకుండానే 'టాటా పంచ్' కొనాల్సిందేనా..: మీరు సిద్దమేనా?
'టాటా మోటార్స్' యొక్క 'టాటా పంచ్' (Tata Punch) దేశీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందుతున్న కంపెనీ బ్రాండ్. ఇది చిన్న SUV అయినప్పటికీ ఇందులోని ఫీచర్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరిన ఈ టాటా పంచ్ ఇప్పుడు 'ఐడెల్ సార్ట్/స్టాప్' అనే ఫీచర్ ని కోల్పోయింది.
ఇంతకీ ఈ ఫీచర్ వేరియంట్ లో లేదు, ఉంటే దీని ఉపయోగం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథంనంలో తెలుసుకుందాం.. రండి.

టాటా మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం, తన పంచ్ యొక్క బేస్ వేరియంట్ అయిన 'ప్యూర్' ట్రిమ్ మాత్రమే ఈ 'ఐడెల్ సార్ట్/స్టాప్' ఫీచర్ కోల్పోతుందని తెలుస్తోంది. కాగా మిగిలిన మూడు ట్రిమ్స్ 'అడ్వెంచర్, అకాప్లిష్డ్ మరియు క్రియేటివ్' ఈ ఫీచర్ ని కలిగి ఉంటాయి. అంతే కాకుండా టాటా పంచ్ కజిరంగా ఎడిషన్ మరియు క్యామో ఎడిషన్‌లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

బేస్ వేరియంట్ లో ఈ ఫీచర్ తొలగించడం మినహా మిగిలిన ఎటువంటి మార్పులు జరగలేదు, కావున టాటా పంచ్ కొనుగోలుదారులు దీనిని గుర్తించాలి. డిజైన్ లో కూడా ఎటువంటి మార్పులు జరగలేదు.

ఇక 'ఐడెల్ సార్ట్/స్టాప్' ఫీచర్ ఉపయోగం విషయానికి వస్తే, ఐడెల్ మోడ్‌లో ఉన్నప్పుడు ఇంజిన్ ఆటోమాటిక్ గా ఆఫ్ అవుతుంది, అయితే క్లచ్‌ని నొక్కడం ద్వారా మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా ఫ్యూయెల్ కొంతవరకు ఆదాచేయబడుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్. ఈ ఫీచర్ ఇప్పుడు బేస్ వేరియంట్ లో లేకపోవడం వల్ల కొనుగోలుదారులు కొంత నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది.

ఇంజిన్ లో ఎటువంటి మార్పులు లేదు, కావున టాటా పంచ్ అదే 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

టాటా పంచ్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. టాటా పంచ్ యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు మరియు డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

టాటా పంచ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఐఆర్‌ఎ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 27 కనెక్టెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఆటోమేటిక్ ఎసి, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

టాటా పంచ్ మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV అత్యంత సురక్షితమైన వాహనం. ఎందుకంటే ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
టాటా మోటార్స్ యొక్క పంచ్ SUV అత్యధిక అమ్మకాలు పొందుతున్న టాప్ 10 SUV లలో ఒకటి. అయితే కంపెనీ ఇప్పుడు తన బేస్ వేరియంట్ లో 'ఐడెల్ సార్ట్/స్టాప్' ఫీచర్ తీసివేయడం వల్ల అమ్మకాలపైన ఏమైనా ప్రభావం చూపుతుందా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. దీని గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








