2022 IPL లో దర్శనమిచ్చిన Tata Punch కొత్త ఎడిషన్.. ఇది చాలా స్పెషల్ గురూ..!!
దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ (Tata Motors) యొక్క టాటా పంచ్ (Tata Punch) దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో మంచి ప్రజాదరణ పొందుతోంది. అయితే కంపెనీ ఈ వెర్షన్ యొక్క కజిరంగా ఎడిషన్ (Kaziranga Edition) ను 2022 IPL లో వేలం వేయనుంది. ఈ మైక్రో SUV సాధారణ మోడల్ కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడానికి, కంపెనీ తన ప్రత్యేక ఎడిషన్‌ను ఇక్కడ ప్రదర్శిస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

టాటా పంచ్ యొక్క ఈ స్పెషల్ ఎడిషన్ IPL 2022 లో వేలం వేయబడిన తరువాత, దాని నుండి వచ్చే ఆదాయం ఈ సంవత్సరం IPL యొక్క అధికారిక స్పాన్సర్‌గా ఉన్న Kaziranga టాటా మోటార్స్ పరిరక్షణకు ఉపయోగించబడుతుంది. ఈ స్పెషల్ ఎడిషన్‌ను IPL 2022 ఈవెంట్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు.

Tata Punch Kaziranga Edition ఉత్పత్తి కేవలం ఒక యూనిట్‌కు పరిమితం చేయబడుతుంది. కావున ఇది చాలావరకు ప్రత్యేకమైందిగా ఉంటుంది. ఈ మైక్రో-SUV యొక్క టాప్-స్పెక్ 'క్రియేటివ్' ట్రిమ్‌పై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ విడుదల చేసిన ఈ SUV ని మీరు ఇక్కడ చూడవచ్చు.

సాధారణంగా భారతీయ మార్కెట్లో Tata Punch నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.
దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ కలర్స్.

Tata Punch మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Tata Punch 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV అత్యంత సురక్షితమైన వాహనం. ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. Tata Punch లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి.

టాటా మోటార్స్ ఇప్పుడు IPL యొక్క అధికారిక భాగస్వామి, దీని కారణంగానే కంపెనీ టాటా పంచ్ యొక్క స్పెషల్ ఎడిషన్ ప్రదర్శిస్తుంది. ఇది దాని స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కావున ఇది ఎక్కువమంది ప్రజలను తప్పకుండా ఆకర్షిస్తుంది.


Click it and Unblock the Notifications








