టాటా పంచ్: పెరిగిన 8 వేరియంట్ ధరలు & తగ్గిన మరో 8 వేరియంట్ ధరలు
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన టాటా పంచ్ (Tata Punch) మైక్రో SUV అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. అయితే ఈ SUV యొక్క ధరలు ఇప్పుడు అమాంతం పెరిగాయి. పెరిగిన ధరలు 2022 ఏప్రిల్ 23 నుంచి అమలులోకి వచ్చాయి. కావున దేశీయ విఫణిలో టాటా పంచ్ ప్రారంభ ధర ఇప్పుడు రూ. 5.82 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుంచి ప్రారంభమవుతాయి. టాటా పంచ్ యొక్క కొత్త ధరలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, టాటా పంచ్ యొక్క అన్ని వేరియంట్‌ల ధరలను పెంచలేదు. ఇందులో కంపెనీ 8 వేరియంట్‌ల ధరలను తగ్గించింది అదే సమయంలో 8 వేరియంట్ ధరలను పెంచింది. వినియోగదారులు దీనిని తప్పకుండా గమనించాలి. ఇప్పుడు టాటా పంచ్ మాన్యువల్ వేరియంట్స్ ప్రారంభ ధర రూ. 5.82 లక్షలు కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.88 లక్షలు. ఈ టాప్ ఎండ్ వేరియంట్ ధరలు ఎటువంటి మార్పు లేదు. కానీ బేస్ వేరియంట్ ధర మునుపటికంటే కూడా దాదాపు రూ.15,000 ఎక్కువగా ఉంది.

ఇక ఇందులోని క్రియేటివ్, క్రియేటివ్ డ్యూయల్ టోన్, క్రియేటివ్ IRA మరియు క్రియేటివ్ IRA DT వంటి వేరియంట్ ధరలు ఇప్పుడు మునుపటికంటే కూడా రూ. 10,000 తగ్గింది. కావున ఇప్పుడు టాటా పంచ్ క్రియేటివ్ ధర రూ. 8.31 లక్షలు మరియు టాటా పంచ్ క్రియేటివ్ IRA DT ధర రూ. 8.71 లక్షలు.
| Punch MT | New Price | Old Price | Difference |
| Pure | ₹5,82,900 | ₹5,67,900 | ₹15,000 |
| Pure Rhythm | ₹6,14,900 | ₹5,99,900 | ₹15,000 |
| Adventure | ₹6,64,900 | ₹6,52,900 | ₹12,000 |
| Adventure Rhythm | ₹6,99,900 | ₹6,87,900 | ₹12,000 |
| Accomplished | ₹7,49,900 | ₹7,42,900 | ₹7,000 |
| Accomplished Dazzle | ₹7,87,900 | ₹7,87,900 | 0 |
| Creative | ₹8,31,900 | ₹8,41,900 | -₹10,000 |
| Creative DT | ₹8,41,900 | ₹8,51,900 | -₹10,000 |
| Kaziranga | ₹8,58,900 | ₹8,58,900 | 0 |
| Creative IRA | ₹8,61,900 | ₹8,71,900 | -₹10,000 |
| Creative IRA DT | ₹8,71,900 | ₹8,81,900 | -₹10,000 |
| Kaziranga IRA | ₹8,88,900 | ₹8,88,900 | 0 |

అదే విధంగా టాటా పంచ్ ఆటోమాటిక్ వేరియంట్స్ అయిన పంచ్ అడ్వెంచర్ ధర ఇప్పుడు రూ. 12,000 పెరిగి రూ. 7.24 లక్షలకు చేరింది. ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 9.48 లక్షలు. ఈ ధరలు ఎటువంటి మార్పు లేదు. ఇందులో కూడా క్రియేటివ్, క్రియేటివ్ డ్యూయల్ టోన్, క్రియేటివ్ IRA మరియు క్రియేటివ్ IRA DT ధరలు రూ. 10,000 వరకు తగ్గాయి.

| Punch Automatic | New Price | Old Price | Difference |
| Adventure | ₹7,24,900 | ₹7,12,900 | ₹12,000 |
| Adventure Rhythm | ₹7,59,900 | ₹7,47,900 | ₹12,000 |
| Accomplished | ₹8,09,900 | ₹8,02,900 | ₹7,000 |
| Accomplished Dazzle | ₹8,47,900 | ₹8,47,900 | 0 |
| Creative | ₹8,91,900 | ₹9,01,900 | -₹10,000 |
| Creative DT | ₹9,01,900 | ₹9,11,900 | -₹10,000 |
| Kaziranga | ₹9,18,900 | ₹9,18,900 | 0 |
| Creative IRA | ₹9,21,900 | ₹9,31,900 | -₹10,000 |
| Creative IRA DT | ₹9,31,900 | ₹9,41,900 | -₹10,000 |
| Kaziranga IRA | ₹9,48,900 | ₹9,48,900 | 0 |

టాటా పంచ్ మైక్రో SUV కంపెనీ కొత్త 'ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్' (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.

టాటా పంచ్ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ కలర్స్.

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. టాటా పంచ్ యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Tata Punch 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV అత్యంత సురక్షితమైన వాహనం. ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కావున మార్కెట్లో ఈ కారుకి మరింత డిమాండ్ పెరిగింది.

Tata Punch లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి.
టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. కావున ఎక్కువమంది దీనిని కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలు కంపెనీ యొక్క అమ్మకాలపైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా.. లేదా అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications







