అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో తగ్గేదే లే అంటున్న Tata Punch

టాటా మోటార్స్ (Tata Motors) యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో SUV 'టాటా పంచ్' (Tata Punch) ఇప్పటికి 32,000 యూనిట్లు విక్రయించబడ్డాయి. కంపెనీ నుంచి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది కష్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధించింది. దీనికి సంబంధించి సమాచారం కంపెనీ తెలియజేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో Tata Punch హవా

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, గత నాలుగు నెలల్లో రెండుసార్లు 10,000 యూనిట్ల నెలవారీ విక్రయాల మార్కును అధిగమించినట్లు తెలిసింది. అదే సమయంలో ఇప్పటికి అందుబాటులో ఉన్న ఈ విభాగంలోని ఇతర మోడల్స్ కంటే కూడా టాటా పంచ్ అమ్మకాల్లో ముందంజలో ఉంది.

అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో Tata Punch హవా

టాటా పంచ్ అనేది ఇప్పుడు కస్టమ్ ప్యాక్‌తో అందించబడిన రెండవ టాటా మోటార్స్ యొక్క కారు. కావున కొనుగోలుదారులకు ఇష్టమైన యాక్సససరీస్ కూడా పొందవచ్చు. వీటి ధర రూ.30,000 నుంచి రూ.45,000 వరకు ఉంటుంది. ఇది ఈ కారును మరింత ఆకర్షణీయంగా చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటాయి.

అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో Tata Punch హవా

టాటా పంచ్ ధర ఇప్పుడు రూ. 5.64 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా). టాటా పంచ్ మైక్రో-SUV యొక్క బేస్ 'ప్యూర్' వేరియంట్ ధర ఇప్పుడు రూ. 15,000 వరకు పెరిగింది. అయితే ఇందులో అన్ని వేరియనట్ల ధరలు పెరగలేదు. కావున కానీ టాటా పంచ్ యొక్క టాప్-ఎండ్ 'క్రియేటివ్' ట్రిమ్ స్థాయి ధరలు రూ. 11,000 తగ్గాయి మరియు క్రియేటివ్ ట్రిమ్ స్థాయికి కొత్త ధరలు ఇప్పుడు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కోసం రూ. 8.38 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో Tata Punch హవా

అదే సమయంలో AMT వేరియంట్ ధర రూ. 8.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). మిగిలిన ట్రిమ్స్ అన్ని కూడా ఇప్పుడు రూ. 10,000 వరకు పెరిగింది. Tata Punch మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది.

అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో Tata Punch హవా

ఈ SUV పరిమాణం పరంగా కూడా అద్బుతంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ SUV పొడవు 3,827 మిమీ, 1,742 మిమీ వెడల్పు మరియు 1,615 మిమీ ఎత్తు, 2,445 మిమీ వీల్‌బేస్ మరియు 187 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Tata Punch మొత్తం 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఓర్క్స్ వైట్, అటామిక్ ఆరెంజ్ ,డేటోనా గ్రే, మెటోర్ బ్రాంజ్, కాలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్ మరియు టోర్నాడో బ్లూ కలర్స్.

అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో Tata Punch హవా

Tata Punch నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ప్యూర్, అడ్వెంచర్, ఆకాంప్లిస్డ్ (Accomplished) మరియు క్రియేటివ్‌ వేరియంట్స్. ఈ నాలు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడతాయి.

అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో Tata Punch హవా

కొత్త Tata Punch అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV లో సిగ్నేచర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులోని టాటా బ్రాండ్ లోగో ఎల్ఈడీ డిఆర్ఎల్ కి కనెక్ట్ చేయబడి మధ్యలో ఉంటుంది. హెడ్‌లైట్ ఇరువైపులా ఉంది. ఫాగ్ లైట్ దాని క్రింద ఉంచబడింది. Tata Punch యొక్క సైడ్ ప్రొఫైల్ ఫోర్-స్పోక్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్‌లు, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఉన్నాయి.

అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో Tata Punch హవా

Tata Punch యొక్క ఇంటీరియర్ డ్యూయల్-టోన్ థీమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉపయోగించబడింది. ఇదే డ్యూయెల్ టోన్ కలర్ దాని డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇది కాకుండా, దానిలో కనిపించే AC వెంట్‌లపై బ్లూ హైలైట్‌లు మరియు లోపలి డోర్ హ్యాండిల్స్‌లో వైట్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో Tata Punch హవా

Tata Punch 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

అప్పుడే 32,000 దాటిన సేల్స్.. అమ్మకాల్లో Tata Punch హవా

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV అత్యంత సురక్షితమైన వాహనం. ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్‌ పొంది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కావున మార్కెట్లో ఈ కారుకి మరింత డిమాండ్ పెరిగింది.

More from DriveSpark

Article Published On: Saturday, February 26, 2022, 11:15 [IST]
English summary
Tata punch micro suv sales crosses over 32000 units details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+