Tata Safari అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. కొత్త ఫీచర్స్ కూడా..!!

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్వదేశీ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) కేవలం భారత మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ పొందుతోంది. ఈ తరుణంలో కంపెనీ ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను అప్డేట్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ యొక్క ప్రముఖ మోడల్ అయిన సఫారీ అడ్వెంచర్ పర్సోనా (Safari Adventure Persona) ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Tata Safari అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. కొత్త ఫీచర్స్ కూడా..!!

కంపెనీ తన సఫారీ అడ్వెంచర్ పర్సోనా స్పెషల్ ఎడిషన్ యొక్క కలర్ ఆప్సన్ ను విస్తరించడంలో భాగంగా.. ట్రాపికల్ మిస్ట్ ఎక్ట్సీరియర్ కలర్‌ ఆప్సన్ లో మాత్రమే అందించబడే అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు ఓర్కస్ వైట్ (Orcus White) షేడ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Tata Safari అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. కొత్త ఫీచర్స్ కూడా..!!

కొత్త సఫారీ ఓర్కస్ వైట్ కారు కొత్త ప్యాలెట్‌తో పాటు, కొత్త ఫీచర్లను కూడా పొందుతుంది. సఫారి అడ్వెంచర్ పర్సోనా టాప్-స్పెక్ XZ+ మరియు XZA+ ట్రిమ్‌లపై ఆధారపడి ఉంటుంది. ఇది ఇప్పుడు ఆధునిక ఫీచర్స్ అయిన వైర్‌లెస్ ఛార్జర్, ఆపిల్ కార్‌ప్లే మరియు వైర్‌లెస్ కనెక్టివిటీతో ఆండ్రాయిడ్ ఆటో వంటి కొత్త ఫీచర్‌లను పొందుతుంది.

Tata Safari అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. కొత్త ఫీచర్స్ కూడా..!!

ఈ కొత్త మోడల్ లోని మొదటి మరియు రెండవ వరుస సీట్లలో కూలింగ్ ఫీచర్‌తో ఆరు-సీట్ల వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్ల జోడింపుతో, అడ్వెంచర్ యొక్క మాన్యువల్ వెర్షన్ ధర ఇప్పుడు రూ. 14,000 మరియు ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ. 24,000 ఎక్కువగా ఉంటుంది.

Tata Safari అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. కొత్త ఫీచర్స్ కూడా..!!

టాటా మోటార్స్ కంపెనీ ఇటీవల సఫారీ యొక్క డార్క్ ఎడిషన్‌ను రూ. 19.06 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది అద్భుతమైన ఇంటీరియర్ థీమ్‌తో బ్లాక్-అవుట్ ఎక్స్‌టీరియర్ హైలైట్‌లను పొందుతుంది. కావున ఇది మరింత చూడచక్కగా ఉంది.

Tata Safari అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. కొత్త ఫీచర్స్ కూడా..!!

టాటా సఫారి 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 168 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. దేశీయ మార్కెట్లో టాటా సఫారీ ఇప్పుడు డార్క్, గోల్డ్ మరియు అడ్వెంచర్ పర్సోనా అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది దేశీయ మార్కెట్లో ఎంజ హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజర్ మరియు మహీంద్రా XUV700 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Tata Safari అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. కొత్త ఫీచర్స్ కూడా..!!

ఈదుల ఉండగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల తమ ఎలక్ట్రిక్ వెహికల్ వర్టికల్‌ను టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEML) అనే ప్రత్యేక విభాగంగా మార్చింది. టిపిఈఎమ్ఎల్ తాజాగా క్యాపిటల్ ఇన్ఫ్యూషన్‌తో పాటుగా మూడు కొత్త ప్లాట్‌ఫారమ్ లకు వ్యూహాన్ని రూపొందించింది.

ఇది రాబోయే దశాబ్దంలో కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ లైనప్‌కు ఆధారం కానుంది. అంటే, భవిష్యత్తులో టాటా మోటార్స్ నుండి మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి రానున్నాయన్నమాట. మార్చబడిన ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) ప్లాట్‌ఫారమ్, బెస్పోక్ ఈవీ ప్లాట్‌ఫారమ్ మరియు చివరిగాస్కేట్‌బోర్డ్‌తో కూడిన ఈ ప్లాట్‌ఫారమ్‌లు మూడు వేర్వేరు దశల్లో ప్రారంభించబడతాయి, అయితే వాటిపై పని సమాంతరంగా ప్రారంభించబడుతుంది.

Tata Safari అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. కొత్త ఫీచర్స్ కూడా..!!

టాటా మోటార్స్ యొక్క డెడికేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూనిట్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలు లేదా విద్యుత్, బ్యాటరీలు, సోలార్ పవర్ లేదా ఏ రకమైన ఎలక్ట్రికల్ పరికరాలతో నడిచే హైబ్రిడ్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, తయారీ, అమ్మకం లేదా సేవలకు సంబంధించిన కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది.

Tata Safari అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. కొత్త ఫీచర్స్ కూడా..!!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టూ వీలర్ మరియు త్రీ వీలర్స్ ఆధిపత్యం చెలాయిస్తుండగా, టాటా మోటార్స్ నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ EV భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. అదే సమయంలో, ఇటీవల కంపెనీ టిగోర్ ఈవిని విడుదల చేసింది.

Tata Safari అడ్వెంచర్ పర్సోనా ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. కొత్త ఫీచర్స్ కూడా..!!

టాటా మోటార్స్ కార్ల విక్రయాలలో ఎలక్ట్రిక్ కార్లు 2 శాతం వాటా కలిగి ఉన్నాయి, రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇది వేగంగా వృద్ధి చెందుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. టాటా మోటార్స్ 2025 నాటికి 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. 2030 నాటికి ప్రతి 10 కార్లలో 6 ఎలక్ట్రిక్‌ కార్లు ఉంటాయని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Thursday, February 17, 2022, 11:22 [IST]
English summary
Tata safari persona edition launched in orcus white color details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+