Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

భారతీయుల యొక్క అత్యంత నమ్మకైన వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) యొక్క టాటా సఫారీ దేశీయ విఫణిలో మంచి ప్రజాదరణ పొందిన మోడల్. అయితే ఇప్పుడు టాటా సఫారి యొక్క టాప్ స్పెక్ వేరియంట్ అయిన XZ+/XZA+ యొక్క మొదటి మరియు రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్లు ఇవ్వబడ్డాయి, ఇది కెప్టెన్ సీట్లతో అమర్చబడిన 6 సీట్ల వేరియంట్‌లో తీసుకురాబడింది.

Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

ఇంతకు టాటా మోటార్స్ ఈ వెంటిలేటెడ్ సీట్లను కేవలం గోల్డ్ మరియు డార్క్ ఎడిషన్లలో అందించింది. అయితే ఇప్పుడు కస్టమర్ల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని, దాని టాప్ వేరియంట్‌లో ఇప్పుడు ఈ వెంటిలేటెడ్ సీట్లను తీసుకువచ్చింది. అయితే ఈ అప్డేటెడ్ ఫీచర్ అందుబటులోకి వచ్చినప్పటికీ దీని ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కావున కొనుగోలుదారులు ఎలాంటి గాబరా పడాల్సిన అవసరం లేదు.

Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

ఇంతకు ముందు కూడా టాటా మోటార్స్ తన సఫారిలో కొన్ని ఫీచర్స్ అప్డేట్ చేయడం జరిగింది. ఇందులో ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ ఉన్నాయి. అయితే కంపెనీ ఇటీవల సఫారీ డార్క్ ఎడిషన్‌ ని కూడా విడుదల చేసింది. సఫారి డార్క్ ఎడిషన్ XT+/XTA+ మరియు XZ+/XZA+ ట్రిమ్‌లలో అందించబడింది. ఇందులో XZ+/XZA+ అనేది టాప్ వేరియంట్.

Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

కొత్త టాటా సఫారి డార్క్ ఎడిషన్ ఒబెరాన్ బ్లాక్ కలర్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉండి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త ఎడిషన్ చాలా ఆధునిక డిజైన్ పొందుతుంది.

Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

టాటా సఫారీ డార్క్ ఎడిషన్ యొక్క ఫెండర్‌లు మరియు టెయిల్‌గేట్‌పై డార్క్ బ్యాడ్జ్‌లు ఇవ్వబడ్డాయి. అంతే కాకుండా ఇది 18 ఇంచెస్ బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. ఈ ఎడిషన్ యొక్క ఇంటీరియర్‌ కూడా ప్రీమియం బ్లాక్‌స్టోన్ డార్క్ థీమ్ కలిగి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులోని డాష్‌బోర్డ్ స్పెషల్ బ్లాక్‌స్టోన్ మ్యాట్రిక్స్‌లో ఉంచబడింది. అదే సమయంలో ప్రీమియం డార్క్ అపోల్స్ట్రే కూడా ఇందులో ఇవ్వబడింది.

Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే దీనికి మొదటి మరియు రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్ ఆప్సన్ తో పాటిగా ఎయిర్ ప్యూరిఫైయర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి ఆధునిక ఫీచర్స్ అందుబటులో ఉన్నాయి. ఇందులో 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు కుడి చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది.

Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

టాటా సఫారీ గత సంవత్సరం ప్రవేశపెట్టబడింది. అప్పటి నుంచి ఈ మోడల్ యొక్క అమ్మకాలు 16,000 దాటాయి. దీన్నిబట్టి చూస్తే ఈ SUV కి మంచి డిమాండ్ ఉందని అర్థమవుతోంది. ఈ SUV కంపెనీ OMEGARC ఆర్కిటెక్చర్‌తో పాటు ల్యాండ్ రోవర్ D8 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. టాటా మోటార్స్ కంపెనీ దీనిని 6 మరియు 7 సీట్ల ఎంపికలో తీసుకువచ్చింది.

Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

టాటా సఫారి యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ అందుబటులో ఉంటుంది. ఇది 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతుంది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఎంపిక లేదు

Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

డార్క్ ఎడిషన్ అనేది టాటా సఫారీకి సంబంధించిన మొదటి ప్రత్యేక ఎడిషన్ కాదు. కంపెనీ ఇంతకుముందు టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్ EV వంటి అనేక మోడళ్లను డార్క్ ఎడిషన్ అవతార్‌లో తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ ప్రసిద్ధ SUV డార్క్ ఎడిషన్‌లో తీసుకురాబడింది.

Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

టాటా సఫారి భారతీయ మార్కెట్లో మహీంద్రా XUV700, MG హెక్టర్ ప్లస్ మరియు హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా దేశీయ మార్కెట్లో ప్రత్యేకమైన డార్క్ ఎడిషన్ అవతార్ లో అందుబటులో లేవు. కావున టాటా మోటార్స్ యొక్క ఈ టాటా సఫారీ డార్క్ ఎడిషన్ తప్పకుండా మరింత ఆదరణ పొందుతుంది.

Tata Safari టాప్ వేరియంట్‌లో మరింత అప్డేటెడ్ ఫీచర్.. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది

టాటా సఫారీ ఇప్పుడు ఆధునిక వెంటిలేటెడ్ సీట్లను పొందటం వల్ల దాని అమ్మకాలు మరింత పురోగతి వైపు వెళ్లే అవకాశం ఉంది. కావున కంపెనీ యొక్క అమాంకాలకు ఈ SUV ఎంతగానో దోహదపడుతుందని ఆశిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే వెల్లడవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 29, 2022, 12:02 [IST]
English summary
Tata safari top variant features update details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+