'టాటా టియాగో ఈవి' ఇప్పుడే బుక్ చేసుకోండి.. కేవలం 10,000 మందికి మాత్రమే ఆ అఫర్

టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 'టియాగో ఈవి' (Tiago EV) యొక్క బుకింగ్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొనుగోలుదారుల కోసం కంపెనీ ఎట్టకేలకు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

'టాటా టియాగో ఈవి' ఇప్పుడే బుక్ చేసుకోండి.. కేవలం 10,000 మందికి మాత్రమే ఆ అఫర్

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 'టాటా టియాగో ఈవి' కొనాలనుకునే కస్టమర్లు రూ. 21,000 చెల్లించి ఆన్లైన్ లో లేదా కంపెనీ యొక్క అధికారిక డీలర్షిప్ లో గానీ బుక్ చేసుకోవచ్చు. అయితే బుక్ చేసుకున్న కష్టమరలకు డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభమవుతాయి. అంతకంటే ముందు టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమవవుతాయి. టెస్ట్ డ్రైవ్స్ డిసెంబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.

'టాటా టియాగో ఈవి' ఇప్పుడే బుక్ చేసుకోండి.. కేవలం 10,000 మందికి మాత్రమే ఆ అఫర్

టాటా మోటార్స్ యొక్క టియాగో ఈవి ధరల విషయానికి వస్తే, ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ధరలు కేవలం మొదట బుక్ చేసుకున్న 10,000 మంచికి మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత బుక్ చేసుకునే వారికి కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయి.

'టాటా టియాగో ఈవి' ఇప్పుడే బుక్ చేసుకోండి.. కేవలం 10,000 మందికి మాత్రమే ఆ అఫర్

భారతీయ మార్కెట్లో విడుదలైన అత్యంత సరసమైన 'టాటా టియాగో ఈవి' మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ మరియు XZ+ టెక్ లక్స్. ఇందులో ఎక్కువమంది కొనుగోలుదారులు టాప్ వేరియంట్ అయిన XZ+ టెక్ లక్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని చోట్ల అనధికార బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

'టాటా టియాగో ఈవి' ఇప్పుడే బుక్ చేసుకోండి.. కేవలం 10,000 మందికి మాత్రమే ఆ అఫర్

కొత్త టాటా టియాగో ఈవి మంచి డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క బాడీ చుట్టూ ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌లను కలిగి, క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌కి ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, గ్రిల్‌పై ఉన్న ట్రై-యారో మోటిఫ్ గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో టీల్ బ్లూ కలర్ తో ఉంటుంది. ఎడమవైపు ఉన్న హెడ్‌లైట్‌ పైన 'EV'కూడా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 14 ఇంచెస్ స్టీల్ వీల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త కారుకి కొత్త లుక్ అందించడంలో సహాయపడతాయి.

'టాటా టియాగో ఈవి' ఇప్పుడే బుక్ చేసుకోండి.. కేవలం 10,000 మందికి మాత్రమే ఆ అఫర్

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌ వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

'టాటా టియాగో ఈవి' ఇప్పుడే బుక్ చేసుకోండి.. కేవలం 10,000 మందికి మాత్రమే ఆ అఫర్

టాటా టియాగో ఈవి లో రెండు బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. అవి 19.2kWh మరియు 24kWh బ్యాటరీ ప్యాక్స్. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250కిమీ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఇందులోని 24kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో 315 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, టియాగో ఈవి 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 65 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.

'టాటా టియాగో ఈవి' ఇప్పుడే బుక్ చేసుకోండి.. కేవలం 10,000 మందికి మాత్రమే ఆ అఫర్

టాటా టియాగో ఈవి యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, కంపెనీ యొక్క ఇతర వాహనాల మాదిరిగానే ఇది కూడా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్‌ మరియు రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి. కావున టాటా టియాగో ఈవి కొనుగోలుదారుల భద్రతకు ఏ లోటు ఉండదు.

'టాటా టియాగో ఈవి' ఇప్పుడే బుక్ చేసుకోండి.. కేవలం 10,000 మందికి మాత్రమే ఆ అఫర్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటి వరకు ముందు వరుసలో ఉన్న టాటా మోటార్స్ మరో ఎలక్ట్రిక్ కారుని అత్యంత సరసమైన ధర వద్ద లాంచ్ చేసి మరింత గొప్ప అమ్మకాలను పొందటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది, కాగా టాటా టియాగో ఈవి దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలు పొందుతుంది అనేది తెలియరావాలి. దీని గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, October 10, 2022, 14:38 [IST]
English summary
Tata tiago ev booking starts price delivery and test drive details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+