YouTube

బుకింగ్స్‌లో 'టాటా టియాగో ఈవీ' జోరు: అప్పుడే 20,000 యూనిట్లు.. డెలివరీలు ఎప్పుడంటే?

టాటా వాహనాలను భారతీయ మార్కెట్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే మంచి డిమాండ్ తో ముందుకు సాగిపోతుంది.

కంపెనీ గత సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన కొత్త 'టాటా టియాగో ఈవీ' ఏకంగా ఇప్పటికి 20,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు అధికారిక సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

20,000 దాటిన టాటా టియాగో ఈవీ బుకింగ్స్

టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ ధర వద్ద ఈ ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత సరసమైన కారుగా అవతరించింది. ఇది మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ మరియు XZ+ టెక్ లక్స్.

కంపెనీ ఈ టాటా టియాగో ఈవీ కోసం 2022 అక్టోబర్ 10 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే 10,000 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయని కంపెనీ నిర్దారించింది. అయితే మొదట వెల్లడించిన ధరలు కేవలం 10,000 యూనిట్లకు మాత్రమే పరిమితం ప్రారంభంలో అని తెలిపింది. కానీ ఆ తరువాత ఈ ధరలను 20,000 యూనిట్ల వరకు పెంచింది.

ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ కారుని బుక్ చేసుకున్న కస్టమర్లు 2023 జనవరి నాటికి డెలివరీలను పొందే అవకాశం ఉంటుంది. అంతకంటే ముందు టెస్ట్ డ్రైవ్స్ డిసెంబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ పొందిన బుకింగ్స్ గురించి అధికారిక సమాచారాన్ని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'శైలేష్ చంద్ర' స్వయంగా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

కొత్త టాటా టియాగో ఈవి 19.2kWh మరియు 24kWh అనే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250కిమీ పరిధిని మరియు 24kWh బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్ తో 315 కిమీ పరిధిని అందిస్తుంది. టియాగో ఈవి 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 65 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

కొత్త టాటా టియాగో ఈవి మంచి డిజైన్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క బాడీ చుట్టూ ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌లను కలిగి, క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌కి ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, గ్రిల్‌పై ఉన్న ట్రై-యారో మోటిఫ్ గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో టీల్-బ్లూ కలర్ తో ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 14 ఇంచెస్ స్టీల్ వీల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త కారుకి కొత్త లుక్ అందిస్తాయి.

టాటా టియాగో ఈవి 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది, ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇతర టాటా మోటార్స్ వాహనాల మాదిరిగానే కొత్త 'టియాగో ఈవి' (Tiago EV) కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది, కావున ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్‌ మరియు రియర్ పార్కింగ్ కెమెరా మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. కావున ఇవన్నీ టాటా టియాగో ఈవి వినియోగదారులకు పటిష్టమైన భద్రత కల్పించడంలో సహాయపడతాయి.

Most Read Articles

English summary
Tata tiago ev gets 20000 units bookings in a month details
Story first published: Thursday, November 24, 2022, 10:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X