సింగిల్ ఛార్జ్‌తో 315 కిమీ రేంజ్ అందించే 'Tata Tiago EV' లాంచ్: ధర రూ. 8.49 లక్షలు
ఎలక్ట్రిక్ వాహన ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'టాటా టియాగో ఈవీ' (Tata Tiago EV) ఎట్టకేలకు విడుదలైపోయింది. దేశీయ వాహన తయారీ దిగ్గజం విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు డిజైన్, ఫీచర్స్ మరియు రేంజ్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన ధర వద్ద పండుగ సీజన్ లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ మరియు XZ+ టెక్ లక్స్. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.

| Tata Tiago EV Price | |||
| Battery Pack | Charging Option | Variant | Price |
| 19.2 kWh | 3.3 kW AC | XE | ₹8.49 Lakh |
| XT | ₹9.09 Lakh | ||
| 24 kWh | 3.3 kW AC | XT | ₹9.99 Lakh |
| XZ+ | ₹10.79 Lakh | ||
| XZ+ Tech LUX | ₹11.29 Lakh | ||
| 7.2 kW AC | XZ+ | ₹11.29 Lakh | |
| XZ+ Tech LUX | ₹11.79 Lakh | ||

కొత్త టాటా టియాగో ఈవి చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. బాడీ చుట్టూ ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌లను కలిగి, క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌కి ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, గ్రిల్‌పై ఉన్న ట్రై-యారో మోటిఫ్ గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో టీల్ బ్లూ కలర్ తో ఉంటుంది. ఎడమవైపు ఉన్న హెడ్‌లైట్ పైన 'EV'కూడా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 14 ఇంచెస్ స్టీల్ వీల్ ఉంటుంది. మొత్తం మీద డిజైన్ ఆధునిక కాలంలో కొనుగోలుదారులను ఆకర్శించే విధంగా ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే, టాటా టియాగో ఈవీ లోపలి భాగంలో కూడా బ్లూ యాక్సెంట్‌లను చూడవచ్చు. ఇది దాని పెట్రోల్ వేరియంట్ కి భిన్నంగా ఉందని చూపించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది.

టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) లో Ziptron హై-వోల్టేజ్ ఆర్కిటెక్చర్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి IP67 రేటింగ్ కలిగి ఉంది. టియాగో ఈవి కేవలం 5.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త టియాగో ఈవి సిటీ మరియు స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్‌లు మరియు 4 రీజెన్ మోడ్‌లను కలిగి ఉంది.

టాటా టియాగో ఈవి 19.2kWh మరియు 24kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250కిమీ పరిధిని, 24kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్ తో 315 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ పరిధి వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. టాటా టియాగో ఈవి యొక్క బ్యాటరీ మరియు మోటారుపైన 8 సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీ వారంటీని అందిస్తోంది.

టాటా టిగోర్ ఈవీ యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే, 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 65 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో 15A, 3.3kW AC మరియు 7.2kWh AC ప్లగ్ పాయింట్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు.

టాటా టియాగో ఈవి యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద కంపెనీ యొక్క ఇతర వాహనాల మాదిరిగానే ఇది కూడా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో ప్రయాణికుల సేఫ్టీకి ఎటువంటి లోటు లేదు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తనకు తానే సాటిగా ముందుకు సాగుతున్న టాటా మోటార్స్, ఇప్పుడు మార్కెట్లో టియాగో ఈవి పేరుతో తక్కువ ధర వద్ద మరో ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయడం నిజంగానే పండుగ సీజన్లో మంచి శుభవార్త. ఇది తప్పకుండా దేశీయ మార్కెట్లో మునుపటి మోడల్స్ మాదిరిగానే మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








