టాటా టియాగో EV ధరలు పెరగనున్నాయ్.. ఇది చూడండి

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ గత కొన్ని రోజుల కిందట భారతీయ మార్కెట్లో 'టియాగో ఈవీ' విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే 2023 జనవరి నుంచి ఈ ధరలను మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2023 ప్రారంభం నుంచి టాటా టియాగో ఈవి ధరలు 3 నుంచి 4 శాతం పెరిగే అవకాశం ఉంటుంది. కావున రాబోయే సంవత్సరంలో టియాగో ఈవి ధరలు పెరగనున్నాయి. బహుశా రాబోయే సంవత్సరం నుంచి రూ . 30,000 నుంచి రూ. 40,000 వరకు పెరగనున్నాయి. అయితే ఎంత వరకు పెరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలియదు. అయితే ఈ ఖచ్చితమైన ధరలు త్వరలోనే కంపెనీ వెల్లడిస్తుంది.

టాటా టియాగో EV ధరలు పెరగనున్నాయ్

నిజానికి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసినప్పుడే 10,000 యూనిట్ల తరువాత ధరలను పెంచనున్నట్లు తెలిపింది. అయితే ఆ ధరలను కంపెనీ 20,000 యూనిట్ల వరకు పెంచింది. అయితే కంపెనీ బుకింగ్స్ స్టార్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే 10,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. బుక్ చేసుకున్న కస్టమర్లు 2023 జనవరి నాటికి డెలివరీలను ప్రారంభించనుంది. అంతకంటే ముందు టెస్ట్ డ్రైవ్స్ డిసెంబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.

విడుదల సమయంలో టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ ధర వద్ద ఈ ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత సరసమైన కారుగా అవతరించింది. ఇది మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ మరియు XZ+ టెక్ లక్స్.

కొత్త టాటా టియాగో ఈవి మంచి డిజైన్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క బాడీ చుట్టూ ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌లను కలిగి, క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌కి ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, గ్రిల్‌పై ఉన్న ట్రై-యారో మోటిఫ్ గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో టీల్-బ్లూ కలర్ తో ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 14 ఇంచెస్ స్టీల్ వీల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త కారుకి కొత్త లుక్ అందిస్తాయి.

టాటా టియాగో ఈవి 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది, ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇతర టాటా మోటార్స్ వాహనాల మాదిరిగానే కొత్త 'టియాగో ఈవి' (Tiago EV) కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది, కావున ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్‌ మరియు రియర్ పార్కింగ్ కెమెరా మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. కావున ఇవన్నీ టాటా టియాగో ఈవి వినియోగదారులకు పటిష్టమైన భద్రత కల్పించడంలో సహాయపడతాయి.

కొత్త టాటా టియాగో ఈవి 19.2kWh మరియు 24kWh అనే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250కిమీ పరిధిని మరియు 24kWh బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్ తో 315 కిమీ పరిధిని అందిస్తుంది. టియాగో ఈవి 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 65 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

More from DriveSpark

Article Published On: Sunday, December 25, 2022, 13:00 [IST]
English summary
Tata tiago ev prices to be expensive from 2023 january details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+