సిఎన్‌జి వెర్షన్‌లో విడుదలైన 'టాటా టియాగో ఎన్ఆర్‌జి' - ధర & వివరాలు ఇక్కడ చూడండి

సిఎన్‌జి విభాగంలో దూసుకెళ్తున్న దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన కొత్త 'టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి' అధికారికంగా విడుదల చేసింది.

టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధరలు రూ. 7.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త సిఎన్‌జి కారు అప్డేట్స్ మరియు మైలేజ్ వంటి వాటిని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.

సిఎన్‌జి వెర్షన్‌లో విడుదలైన టాటా టియాగో ఎన్ఆర్‌జి

టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి మొత్తమ్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XT మరియు XZ. వీటి ధరలు వరుసగా రూ. 7.40 లక్షలు మరియు రూ. 7.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ సిఎన్‌జి వెర్షన్ దాని పెట్రోల్ వెర్షన్ కంటే కూడా ఉత్తమమైన మైలేజ్ అందించేలా రూపొందించబడింది, కావున ఇది ఇప్పుడు బెస్ట్ మైలేజ్ అందిస్తుంది.

కొత్త టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి 1.2 లీటర్ త్రీ సిలిండర్ రెవోట్రాన్ ఇంజన్‌ పొందుతుంది, కావున ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 72 బిహెచ్‌పి పవర్ మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి ఇప్పుడు 26.4 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.

టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి దాని మునుపటి మోడల్ మాదిరిగానే బూట్ లో CNG ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. కావున ఇందులో కూడా బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. కాగా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి నాలుగు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి క్లౌడీ గ్రే, పోలార్ వైట్, ఫైర్ రెడ్ మరియు ఫారెస్టా గ్రీన్ కలర్స్.

టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ చాలా వరకు దాని మునుపటి మోడల్ గుర్తుకు తెస్తుంది. అయితే ఇందులో చుట్టూ బ్లాక్ బాడీ క్లాడింగ్, ముందు మరియు వెనుక కొత్త ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, బ్లాక్ రూఫ్, రూఫ్ రెయిల్‌లు, ఫాగ్ లైట్లు, టెయిల్ గేట్‌పై ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. అంతే కాకూండా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ కోసం కంట్రోలర్‌లతో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 8-స్పీకర్ సరౌండ్ సౌండ్ ఆడియో సిస్టమ్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి మొదలైనవి అందుబాటులో ఉంటాయి. అయితే టాప్-స్పెక్ వేరియంట్ లో స్టాండర్డ్ గా రియర్ పార్కింగ్ కెమెరా ఫీచర్ కూడా ఉంటుంది. మొత్తం మీద కొత్త టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా మాత్రమే కాకూండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Tata tiago nrg icng launched price specs features details
Story first published: Monday, November 21, 2022, 16:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X