'టాటా టియాగో ఎన్ఆర్‌జి సిఎన్‌జి' లో తెలుసుకోవాల్సిన 5 విషయాలు - ఇక్కడ చూడండి

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) భారతీయ విఫణిలో తన కొత్త 'టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి' (Tiago NRG iCNG) విడుదల చేసింది.

కొత్త టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి కొనాలనుకునే వారు తప్పకుండా ధరలు మరియు మైలేజ్ వంటి వివరాలతో పాటు డిజైన్, ఫీచర్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.

టాటా టియాగో ఎన్ఆర్‌జి సిఎన్‌జి లో తెలుసుకోవాల్సిన విషయాలు

వేరియంట్స్ మరియు ధరలు:

టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి మొత్తమ్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XT మరియు XZ. ఇందులో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి XT వేరియంట్ ధర రూ. 7.40 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి XZ వేరియంట్ ధర రూ. 7.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు దాని పెట్రోల్ వెర్షన్ కంటే రూ. 90,000 ఎక్కువ.

ఇంజిన్ మరియు పర్ఫామెన్స్:

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి 1.2 లీటర్ త్రీ సిలిండర్ రెవోట్రాన్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 72 బిహెచ్‌పి పవర్ మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే ఇది 26.4 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.

కలర్ ఆప్సన్స్:

కొత్త టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి మంచి పనితీరుని అందించడమే కాకూండా ఆకర్షణీయమైన కలర్ ఆప్సన్స్ కూడా పొందుతుంది. కావున ఇది మొత్తమ్ నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి క్లౌడీ గ్రే, పోలార్ వైట్, ఫైర్ రెడ్ మరియు ఫారెస్టా గ్రీన్ కలర్స్ ఉన్నాయి. నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉండటం వల్ల కొనుగోలుదారులు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.

డిజైన్:

టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జి చాలా వరకు దాని మునుపటి మోడల్ గుర్తుకు తెస్తుంది. అయితే ఇందులో చుట్టూ బ్లాక్ బాడీ క్లాడింగ్, ముందు మరియు వెనుక కొత్త ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, బ్లాక్ రూఫ్, రూఫ్ రెయిల్‌లు, ఫాగ్ లైట్లు, టెయిల్ గేట్‌పై ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

ఫీచర్స్:

టాటా టియాగో ఎన్ఆర్‌జి ఐసిఎన్‌జిలో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ కోసం కంట్రోలర్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, 8 స్పీకర్ సరౌండ్ సౌండ్ ఆడియో సిస్టమ్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

సేఫ్టీ ఫీచర్స్ & ఇతర వివరాలు:

టాటా కంపెనీ యొక్క అన్ని ఇతర కార్ల మాదిరిగానే ఇది కూడా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్-సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అయితే ఇందులోని CNG ట్యాంక్ వల్ల బూట్ స్పేస్ కొంత తక్కువగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata tiago nrg icng top five highlights details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X