Just In
- 10 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 11 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 15 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 19 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Tata Tiago మరియు Tigor CNG యొక్క ఫస్ట్ TVC వీడియో: మీరూ చూడండి
దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల కాలంలోనే తన కొత్త టాటా టియాగో మరియు టిగోర్ ని CNG వెర్షన్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే, అయితే ఇప్పుడు కంపెనీ వీటికి సంబంధించిన మొదటి TVC వీడియో కూడా విడుదల చేసింది. ఇందులో ఈ CNG మోడళ్ల ప్రత్యేకతలను, అందులో చేసిన మార్పులను చూడవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.

కంపెనీ విడుదల చేసిన Tata Tiago మరియు Tigor యొక్క CNG వెర్షన్ ప్రారంభ ధరలు వరుసగా రూ. 6.09 లక్షలు మరియు రూ. 7.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అదే సమయంలో టాటా టియాగో నాలుగు వేరియంట్లలో మరియు టిగోర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో టాటా టియాగో టాప్ వేరియంట్ ధర రూ.7.52 లక్షలు కాగా , టిగోర్ టాప్ వేరియంట్ ధర రూ. 8.29 లక్షలుగా ఉంది.

టాటా మోటార్స్ అన్ని డీలర్‌షిప్‌లలో ఈ కొత్త CNG మోడల్స్ యొక్క బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారభించిది. CNG అవతార్‌లో ఈ రెండు మోడళ్ల మిడిల్ మరియు టాప్ వేరియంట్‌లను కంపెనీ తీసుకొచ్చింది. టాటా కంపెనీ యొక్క వాహనాలు అత్యంత పటిష్టమైన భద్రతను అందిస్తాయి. కావున ఈ కొత్త CNG వాహనాలు కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కార్లు మైక్రో స్విచ్‌ని కలిగి ఉంటాయి, దాని ఫ్యూయెల్ క్యాప్ తెరిచి ఉంటే కారు స్టార్ట్ కాకుండా ఆపుతుంది. ఇందులో లీక్‌లను గుర్తించే ఫీచర్ కూడా ఉంది.

టాటా మోటార్స్ నాణ్యమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగిస్తుంది. ఇది థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్‌తో కూడా వస్తుంది, దీనిలో ఇంజిన్‌కు అవసరమైనప్పుడు CNG సరఫరా నిలిపివేయబడుతుంది మరియు మిగిలిన CNG పర్యావరణంలోకి విడుదల చేయబడుతుంది.

ఈ కొత్త CNG మోడల్స్ యొక్క ఇంటీరియర్‌లో కూడా మార్పులు చేశారు. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కూడా మార్పులు చేయబడ్డాయి, ఇది CNG, అలాగే CNG గేజ్‌లో లోపాన్ని చూపుతుంది. ఇప్పుడు ఎకో బటన్‌ను నొక్కినప్పుడు, అది ఇంధన సరఫరాను CNG కి మారుస్తుంది. అయితే, కారు CNGతో నడుస్తున్నప్పుడు, అప్‌డేట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ నోటిఫికేషన్ మరియు లైట్‌ని చూపుతుంది.

Tiago CNG మొత్తం XE, XM, XT మరియు XZ+ అనే నాలుగు వేరియంట్లలో అందుబటులో ఉంటుంది. అదే విధంగా Tigor CNG ని XZ మరియు XZ+ అనే రెండు వేరియంట్లలో అందుబటులో ఉంటుంది. అయితే సీఎన్‌జీ కార్ల ఇంజన్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, పెట్రోల్ మోడల్‌పై సిఎన్‌జి రన్ చేయడం వల్ల పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్ తక్కువగా ఉంటుంది.

టాటా టిగోర్ మరియు టియాగో యొక్క CNG ఇంజన్ 86 bhp శక్తిని మరియు 113 Nm టార్క్‌ను అందిస్తుంది. అయితే, CNG మోడల్‌లోని రెండు కార్ల పనితీరు పెట్రోల్‌తో నడిచే మోడల్‌తో సమానంగా ఉంటుందని మరియు స్టాండర్డ్ CNG కార్ల వలె డ్రైవ్ చేయడానికి కొంత తక్కువ శక్తిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇక ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే, పవర్ విండోస్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ORVM మాత్రమే కాకుండా, 'iCNG' బ్యాడ్జ్ ప్రత్యేకంగా CNG మోడల్‌కు ఇవ్వబడింది. కానీ కారు డిజైన్ మరియు స్టైలింగ్‌లో పెద్దగా మార్పులు చేయలేదు.

ఈ CNG కార్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి మరియు కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. CNG లీకేజీ నుండి రక్షించడానికి వివిధ రక్షణ పద్ధతులు కూడా ఉపయోగించబడ్డాయి. ఈ కార్లలో అమర్చిన CNG సిలిండర్లు తుప్పు నిరోధక స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడ్డాయి. ఇది కాకుండా, కారు CNG అయిపోయినప్పుడు పెట్రోల్‌కు మారడానికి ఆటోమేటిక్ స్విచ్ ఫంక్షన్, థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ మరియు గ్యాస్ లీక్‌ల నుండి రక్షించడానికి లీక్ డిటెక్షన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది.

ఈ లక్షణాలన్నీ టాటా యొక్క సిఎన్‌జి కార్లను ఐసిఎన్‌జి అంటే 'ఇంటిలిజెంట్ సిఎన్‌జి' కార్లుగా మారుస్తాయని కంపెనీ తెలిపింది. టియాగో మరియు టిగోర్ సిఎన్‌జిలు మారుతి వ్యాగన్-ఆర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి మరియు రాబోయే స్విఫ్ట్ యొక్క సిఎన్‌జి వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
భారతదేశంలో రోజురోజుకి CNG కార్లకు డిమాండ్ పెరుగుతున్నందున టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క CNG వేరియంట్‌లపై టాటా మోటార్స్ అధిక అంచనాలను కలిగి ఉంది. టాటా టియాగో మరియు టాటా టిగోర్ యొక్క CNG వేరియంట్‌లను ప్రారంభించడంతో, ఈ కార్ల నిర్వహణ ఖర్చులు గతంలో కంటే మరింత సరసమైనవిగా మారతాయి. కావున ఈ వేరియంట్లు తప్పకుండా మంచి అమ్మకాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

ఏప్రిల్ 2021 నుండి నవంబర్ 2021 వరకు భారతదేశంలో మొత్తం 1.36 లక్షల కంటే ఎక్కువ CNG కార్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో టాటా మోటార్స్ ఇటీవలే హ్యుందాయ్‌ని అధిగమించి భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల అమ్మకందారుగా నిలిచింది. అయితే ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త CNG వేరియంట్‌లు తప్పకుండా కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడానికి సహాయపడతాయని ఆశిస్తున్నాము.