టియాగో వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

భారతదేశంలో ఇటీవలి కాలంలో టాటా కార్లకు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. టాటా మోటార్స్ ఇటీవల అమ్మకాల పరంగా హ్యుందాయ్‌ను అధిగమించి బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఈ పోటీని సమర్థవంతంగా ఎదుర్కుని ఎల్లప్పుడూ అగ్ర స్థానంలో నిలబడేందుకు టాటా మోటార్స్ నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి మరియు వారికి మరింత విలువను అందించడానికి తమ కార్ల వేరియంట్‌లలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తోంది.

టియాగో వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

టాటా మోటార్స్ ఇటీవలే తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ లో XM + (S) అనే కొత్త వేరియంట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు తమ టియాగో (Tata Tiago) హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ లైనప్ లో కంపెనీ మార్పులు చేసింది. టాటా టియాగో XT మరియు XZ+ ట్రిమ్‌లను ఎక్కువ మంది కస్టమర్‌లు ఇష్టపడుతున్నందున Tiago XZ మరియు XZA ట్రిమ్‌లను నిలిపివేసింది. అయితే, టాటా టియాగో యొక్క XT ట్రిమ్‌ లో మాత్రం కంపెనీ ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లను జోడించింది.

టియాగో వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

టాటా టియాగో ఎక్స్‌టి వేరియంట్ లో కంపెనీ మునుపటి కంటే మరికొన్ని ఫీచర్లను అందిస్తోంది. ఇందులో ఎక్ట్సీరియర్‌కు జోడించిన అత్యంత ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, ఇది 14 ఇంచ్ హైపర్‌స్టైల్ వీల్స్ మరియు బ్లాక్-అవుట్ B-పిల్లర్‌లను పొందుతుంది, ఇవి బాడీ కలర్ లో ఉంటాయి. బ్లాక్అవుట్ చేయబడిన B-పిల్లర్ మరియు కొత్త మిడ్‌నైట్ ప్లమ్ కలర్ ఇప్పుడు బాహ్య ట్రిమ్ టాప్-స్పెక్ XZ+ ట్రిమ్‌కి కొంచెం దగ్గరగా కనిపించేలా చేస్తుంది.

టియాగో వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

ఇక ఇంటీరియర్స్ లో చేసిన మార్పుల విషయానికి వస్తే, టాటా టియాగో ఎక్స్‌టి ట్రిమ్ ఇప్పుడు వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచే కొన్ని విలువ-ఆధారిత ఫీచర్లతో అప్‌డేట్ చేయబడింది. వీటిలో మొదటిది, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, ఇది అవుట్‌గోయింగ్ ఎక్స్‌టి ట్రిమ్‌లో 4-వే అడ్జస్టబుల్ ఫీచర్‌తో మాత్రమే లభించేది. అంతేకాకుండా, ఇప్పుడు బూట్ ఏరియాలో వెనుక పార్శిల్ షెల్ఫ్ మరియు వానిటీ మిర్రర్ ఇప్పుడు కో-డ్రైవర్ సైడ్ సన్ షేడ్‌లో కూడా ఇవ్వబడింది.

టియాగో వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

ఈ ఫీచర్లు మాత్రమే కాకుండా, టాటా మోటార్స్ ఇప్పుడు టియాగో ఎక్స్‌టి లో రిథమ్ యాక్సెసరీస్ ప్యాక్ ఎంపికను కూడా అందిస్తోంది. ఈ ప్యాక్‌ను గతంలో కంపెనీ టాటా ఆల్ట్రోజ్‌ తో పరిచయం చేసిన సంగతి తెలిసినదే. ఈ రిథమ్ ప్యాక్‌లో భాగంగా, హర్మాన్ యొక్క 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు టియాగో యొక్క ఎక్స్‌టి ట్రిమ్‌ లో కూడా లభిస్తుంది. ఇది కాకుండా, ఈ ప్యాక్‌లో రియర్ పార్కింగ్ కెమెరా, నాలుగు ట్వీటర్‌లు మరియు నాలుగు స్పీకర్‌లు కూడా ఉన్నాయి.

టియాగో వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

టాటా టియాగో ఎన్ఆర్‌జి యొక్క కొత్త ఎక్స్‌టి ట్రిమ్ కూడా విడుదలైంది

టాటా మోటార్స్ విక్రయిస్తున్న టియాగో ఎన్ఆర్‌జి ఎడిషన్ లో కూడా కంపెనీ ఇప్పుడు కొత్త వేరియంట్‌ ను విడుదల చేసింది. ఇంతకుముందు టాటా టియాగో ఎన్ఆర్‌జి టాప్-స్పెక్ XZ+ ట్రిమ్‌పై మాత్రమే ఆధారపడి లభించేది. అయితే, కంపెనీ ఇప్పుడు కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టాటా టియాగో ఎన్ఆర్‌జి ఎడిషన్ కొత్త XT ట్రిమ్ ను పరిచయం చేసింది. ఇది XZ+ కు దిగువన, తక్కువ ధర వేరియంట్‌గా ప్రవేశపెట్టబడింది.

టియాగో వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

టాటా టియాగో ఎక్స్‌టితో పోలిస్తే, ఎన్‌ఆర్‌జి ఎక్స్‌టి వేరియంట్‌ 10 మిమీ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, బాడీ క్లాడింగ్, రూఫ్ రెయిల్‌ లతో కూడిన బ్లాక్డ్ అవుట్ రూఫ్, చార్‌కోల్ బ్లాక్ ఇంటీరియర్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, రియర్ డీఫాగర్, రియర్ వాషర్ మరియు వైపర్‌లు మొదలైన అదనపు ఫీచర్లు లభిస్తాయి. అయితే, ఈ రెండు మోడళ్లలో ఇంజన్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఇవి రెండూ ఒకే రకమైన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ను కలిగి ఉంటాయి.

టియాగో వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ లోని 1.2-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ (సిఎస్‌సి) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), రియర్ పార్కింగ్ అసిస్ట్ మొదలైనవి ఉన్నాయి.

టియాగో వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్.. ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో..

కొత్త Tata Nexon XM+ S వేరియంట్ విడుదల

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ ఇటీవలే తమ నెక్సాన్ ఎస్‌యూవీలో ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ (Tata Nexon XM+ S) పేరుతో ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్+ ఎస్ వేరియంట్ ధర రూ. 9.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. - ఈ వేరియంట్‌లో లభించే ఫీచర్ల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tata tiago xt variant gets features update nrg range gets new xt variant details
Story first published: Saturday, July 30, 2022, 17:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X