టిగోర్ ఈవీ (Tigor EV) ధరను రూ.25,000 మేర పెంచిన టాటా మోటార్స్.. కారణం ఏంటంటే..?

భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) ధరను భారీగా పెంచింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు ధరను ఏకంగా రూ. 25,000 పెంచింది, దీంతో ఇప్పుడు టిగోర్ ఈవీ ప్రారంభ ధర రూ. 12.24 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. ధరల పెంపు మినహా టిగోర్ ఈవీ కారులో కంపెనీ ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్ పై 306 కిమీ సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

టిగోర్ ఈవీ (Tigor EV) ధరను రూ.25,000 మేర పెంచిన టాటా మోటార్స్.. కారణం ఏంటంటే..?

టాటా టిగోర్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ ను కంపెనీ నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. వీటిలో XE, XM, XZ+ మరియు XZ+ DT వేరియంట్లు ఉన్నాయి.

ధరల పెంపు అనంతరం మార్కెట్లో ఈ వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి:

టాటా టిగోర్ ఈవీ ఎక్సఈ - రూ.12.24 లక్షలు

టాటా టిగోర్ ఈవీ ఎక్సఎమ్ - రూ.12.74 లక్షలు

టాటా టిగోర్ ఈవీ ఎక్సఎమ్ - రూ.13.24 లక్షలు

టాటా టిగోర్ ఈవీ ఎక్సఎమ్ - రూ.13.39 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

టిగోర్ ఈవీ (Tigor EV) ధరను రూ.25,000 మేర పెంచిన టాటా మోటార్స్.. కారణం ఏంటంటే..?

టాటా మోటార్స్ ఈ కొత్త Tata Tigor EV ని తమ పాపులర్ జిప్‌ట్రాన్ (Ziptron) ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌ ను ఉపయోగించి తయారు చేసింది. కంపెనీ ఇదే ప్లాట్‌ఫామ్ పై తమ ప్రస్తుత నెక్సాన్ ఈవీ (Nexon EV) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా తయారు చేస్తుంది. అధునాతన Ziptron టెక్నాలజీతో అభివృద్ధి చేసిన కారణంగా కొత్త టాటా టిగోర్ ఈవీ మునుపటితో పోలిస్తే, మరింత మెరుగైన రేంజ్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ అందిస్తుంది.

టిగోర్ ఈవీ (Tigor EV) ధరను రూ.25,000 మేర పెంచిన టాటా మోటార్స్.. కారణం ఏంటంటే..?

గతంలో ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జ్‌పై 90 నుండి 100 కిమీ రేంజ్‌ ని మాత్రమే ఆఫర్ చేసేది. అయితే, ఇప్పుడు ఇందులో జిప్‌ట్రాన్ టెక్నాలజీని ఉపయోగించిన కారణంగా, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కిమీ రేంజ్‌ను (స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్ వద్ద ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, కొత్త Tigor EV లో కంపెనీ Ziptron టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా కంపెనీ దాని పవర్ ను కూడా పెంచింది.

టిగోర్ ఈవీ (Tigor EV) ధరను రూ.25,000 మేర పెంచిన టాటా మోటార్స్.. కారణం ఏంటంటే..?

ఈ ఎలక్ట్రిక్ కారులో IP67 రేటెడ్ 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 55 kW శక్తిని మరియు 170 ఎన్ఎమ్‌ ల టార్క్‌ ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో బ్యాటరీ చార్జింగ్ విషయానికి వస్తే, ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో దీనిని కేవలం 1 గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే, సాధారణ ఛార్జర్‌ తో అయితే పూర్తిగా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 8.5 గంటల సమయం పడుతుంది.

టిగోర్ ఈవీ (Tigor EV) ధరను రూ.25,000 మేర పెంచిన టాటా మోటార్స్.. కారణం ఏంటంటే..?

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టిగోర్ ఈవీ కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో పాల్గొన్న మొదటి ఎలక్ట్రిక్ కారుగా మరియు ఈ క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న మొదటి ఎలక్ట్రిక్ కారుగా టాటా టిగోర్ పేరు దక్కించుంది. ఇది కారులోని ప్రయాణీకులకు అత్యుత్తమ సేఫ్టీని అందిస్తుందని నిర్ధారించబడింది.

టిగోర్ ఈవీ (Tigor EV) ధరను రూ.25,000 మేర పెంచిన టాటా మోటార్స్.. కారణం ఏంటంటే..?

టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, డ్యూయల్-వీల్ డిస్క్ బ్రేక్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్క్ అసిస్ట్, హిల్ అసెంట్ అసిస్ట్, హిల్ డీసెంట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా మొదలైన సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిమీ (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని అందిస్తుంది.

టిగోర్ ఈవీ (Tigor EV) ధరను రూ.25,000 మేర పెంచిన టాటా మోటార్స్.. కారణం ఏంటంటే..?

టాటా టిగోర్ ఈవీ యొక్క ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, స్క్వేర్ ఫాగ్ లైట్లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్ఈడి టెయిల్‌ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు బ్లూ యాక్సెంట్‌లు వంటి ఎక్స్టీరియర్ డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇంటీరియర్‌లో చాలా చోట్ల బ్లూ యాక్సెంట్‌లు ఉపయోగించబడ్డాయి. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ కారును రూ. 21,000 టోకెన్ అడ్వాన్స్‌తో బుక్ చేసుకోవచ్చు.

టిగోర్ ఈవీ (Tigor EV) ధరను రూ.25,000 మేర పెంచిన టాటా మోటార్స్.. కారణం ఏంటంటే..?

టాటా ఆల్ట్రోజ్ ఈవీ (Tata Altroz EV) వస్తోంది..

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ విక్రయిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) లో కూడా కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. టాటా మోటార్స్ వచ్చే ఐదేళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని యోచిస్తోంది. కంపెనీ నుండి రాబోయే కొత్త మోడళ్లలో టాటా ఆల్ట్రోజ్ ఈవీ (Tata Altroz EV) కూడా ఒకటి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాటా మోటార్స్ నుండి తదుపరిగా రాబోయే ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే కావడం విశేషం. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, March 18, 2022, 9:42 [IST]
English summary
Tata tigor ev price hike rs 25000 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+