భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన టెక్ఆర్ట్ (TechArt).. ఇకపై స్టైలిష్ అండ్ యునిక్ పోర్ష్ కార్లను చూడొచ్చు!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్ష్ (Porsche) అందించే కార్లను కస్టమైజ్ చేయడంలో చేయి తిరిగిన కార్ ట్యూనింగ్ కంపెనీ టెక్‌ఆర్ట్ (TechArt) ఎట్టకేలకు భారతదేశంలోకి ప్రవేశించింది. జర్మనీకి చెందిన ఈ కార్ కస్టమైజేషన్ కంపెనీ దేశ ఐటి రాజధాని అయిన బెంగళూరులో తమ తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. బెంగుళూరు కేవలం ఐటి క్యాపిటల్ మాత్రమే కాదు, ఇది ఇటీవలి కాలంలో దేశం యొక్క స్పోర్ట్స్ కార్ క్యాపిటల్‌గా కూడా మారింది. ఇతర పోర్ష్ కార్ల నుండి తమ పోర్ష్ కార్లను ప్రత్యేకంగా కనిపించేలా చేయాలనుకునే ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకొని టెక్ఆర్ట్ భారత్‌లో తమ వ్యాపారాన్ని ప్రారంభించింది.

భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన టెక్ఆర్ట్ (TechArt).. ఇకపై స్టైలిష్ అండ్ యునిక్ పోర్ష్ కార్లను చూడొచ్చు!

టెక్ఆర్ట్ ఒక హై-ఫై కార్ కస్టమైజేషన్ కంపెనీ. ఇది ప్రత్యేకించి పోర్ష్ కార్లను కస్టమైజేషన్ చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్రాండ్. టెక్ఆర్ట్ ఇండియా అందించే సేవలలో పోర్ష్ కార్ల యొక్క ఫుల్ మోడిఫికేషన్, కార్బన్ ఫైబర్ రిఫైన్‌మెంట్, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్ మరియు చేతితో తయారు చేసిన వ్యక్తిగత లగ్జరీ ఇంటీరియర్‌ల వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలోని వినియోగదారులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఉత్పత్తులు మరియు సేవలతో వారి వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా వారి పోర్ష్ వాహనాన్ని రీకాన్ఫిగర్ చేయడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని TechArt పేర్కొంది.

భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన టెక్ఆర్ట్ (TechArt).. ఇకపై స్టైలిష్ అండ్ యునిక్ పోర్ష్ కార్లను చూడొచ్చు!

పోర్ష్ శ్రేణిలోని అన్ని వాహనాలకు అద్భుతమైన మార్పులు మరియు ట్యూనింగ్ చేయడంలో టెక్ఆర్ట్ ప్రసిద్ధి చెందింది. అయితే, ఇది ప్రత్యేకించి పోర్ష్ 911 టర్బో మోడల్‌ల యొక్క శక్తివంతమైన వెర్షన్‌లను కన్వర్ట్ చేయడంలో మరింత ప్రసిద్ధి చెందింది. టెక్ఆర్ట్ జిటి స్ట్రీట్ ఆర్ (TechArt GTstreet R) అని పిలవబడే ఈ మోడల్‌లు పోర్ష్ 911 టర్బో వేరియంట్ ఆధారంగా తయారు చేయబడిన హై-పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కార్లు.

భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన టెక్ఆర్ట్ (TechArt).. ఇకపై స్టైలిష్ అండ్ యునిక్ పోర్ష్ కార్లను చూడొచ్చు!

ప్రస్తుత పోర్ష్ 911 టర్బో ఎస్ యొక్క 3.8-లీటర్ ట్విన్-టర్బో ఇంజన్ GTstreet R లో మరింత శక్తివంతంగా పని చేస్తుంది. అంటే, ఈ ఇంజన్ గరిష్టంగా 700 బిహెచ్‌పి శక్తిని మరియు 900 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పోర్ష్ యొక్క అత్యంత శక్తివంతమైన 911 మోడల్ ఉత్పత్తి చేసే శక్తి కంటే 59 బిహెచ్‌పిలు మరియు 100 ఎన్ఎమ్‌లు అధికం. ఈ ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తిని 8-స్పీడ్ PDK ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది.

భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన టెక్ఆర్ట్ (TechArt).. ఇకపై స్టైలిష్ అండ్ యునిక్ పోర్ష్ కార్లను చూడొచ్చు!

టెక్ఆర్ట్ ఈ ఇంజన్ యొక్క మరింత శక్తివంతమైన వెర్షన్‌ను కూడా అందిస్తుంది, దీన్ని కేవలం బటన్‌ను నొక్కడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో TA092/T2.1 TechArt పవర్ అప్‌గ్రేడ్ సాయంతో GTstreet R యొక్క అవుట్‌పుట్‌ను గరిష్టంగా 788.5 బిహెచ్‌పికి మరియు 950 ఎన్ఎమ్‌కి పెంచవచ్చు. ఈ సూపర్ స్పోర్ట్స్ కార్ గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన టెక్ఆర్ట్ (TechArt).. ఇకపై స్టైలిష్ అండ్ యునిక్ పోర్ష్ కార్లను చూడొచ్చు!

టెక్ఆర్ట్ మోడిఫై చేసిన జిటిస్ట్రీట్ ఆర్ లో మరిన్ని యాంత్రిక మార్పులను అందించే కిట్‌లను కూడా కంపెనీ అందుబాటులో ఉంచింది. ఈ కిట్స్ ఈ స్పోర్ట్స్ కారును 25mm వరకు తగ్గిస్తాయి, అదే సమయంలో ముందు ట్రాక్‌ను 30mm వెడల్పు చేస్తాయి. బెటర్ ఏరోడైనమిక్ పెర్ఫార్మెన్స్ కోసం TechArt యొక్క కార్బన్-ఫైబర్ ఏరో డిస్క్‌లతో అమర్చబడే 20 ఇంచ్ మరియు 21 ఇంచ్ పరిమాణాలలో ఉండే ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ చక్రాలు ట్రాక్ డేస్ పై గరిష్ట పనితీరు ను అందించడం కోసం 265/35 ZR20 (ముందు) మరియు 325/30 ZR21 (వెనుక) మిష్లిన్ పైలట్ స్పోర్ట్ కప్ 2 టైర్లను కలిగి ఉంటాయి. కాగా, రోజూవారీ ఉపయోగం కోసం మిష్లిన్ పైలట్ స్పోర్ట్ 4ఎస్ టైర్లు కూడా లభిస్తాయి.

భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన టెక్ఆర్ట్ (TechArt).. ఇకపై స్టైలిష్ అండ్ యునిక్ పోర్ష్ కార్లను చూడొచ్చు!

ఎగ్జాస్ట్ నోట్ (సైలెన్సర్ సౌండ్) అండే ఇష్టపడే వారికి కోసం టెక్ ఆర్ట్ దాని స్వంత బెస్పోక్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. ఈ కస్టమ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడిన రెండు పైప్ వాల్వ్డ్ సిస్టం మరియు ఇది చేతితో వెల్డింగ్ చేయబడింది. భారతదేశంలో టెక్ఆర్ట్ రాక స్పోర్ట్స్ లగ్జరీ కార్ ఔత్సాహికులలో మన దేశం యొక్క ఖ్యాతిని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఈ జర్మన్ కార్ ట్యూనింగ్ కంపెనీ ఇప్పుడు భారతీయ తీరాలను చేరుకోవడంతో, త్వరలోనే మనం భారత రోడ్లపై కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ పోర్ష్ కార్లను చూస్తామని ఆశిస్తున్నాము.

భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన టెక్ఆర్ట్ (TechArt).. ఇకపై స్టైలిష్ అండ్ యునిక్ పోర్ష్ కార్లను చూడొచ్చు!

భారత మార్కెట్లో Porsche 911 GT3 మరియు 911 GT3 Touring స్పోర్ట్స్ కార్స్ లాంచ్

పోర్ష్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ జర్మన్ బ్రాండ్ గడచిన ఫిబ్రవరి నెలలో భారత మార్కెట్లో రెండు కొత్త 911 సిరీస్ స్పోర్ట్స్ కార్లను విడుదల చేసింది. పోర్ష్ 911 జిటి3 (Porsche 911 GT3) మరియు పోర్ష్ 911 జిటి3 టూరింగ్‌ (Porsche 911 GT3 Touring) అనే రెండు స్పోర్ట్స్ కార్లను కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ స్పోర్ట్స్ కార్ల ధరలు రూ. 2.50 కోట్ల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన టెక్ఆర్ట్ (TechArt).. ఇకపై స్టైలిష్ అండ్ యునిక్ పోర్ష్ కార్లను చూడొచ్చు!

ఈ రెండు స్పోర్ట్స్ కార్లు కూడా వెనుక వైపు ఇంజన్ కలిగి ఉంటాయి మరియు ఇవి రెండూ కూడా న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ గ్యాసోలీన్ (పెట్రోల్) ఇంజన్లను కలిగి ఉంటాయి. ఇందులో పోర్ష్ 911 జిటి3 ఈ జర్మన్ స్పోర్ట్స్ కార్ల బ్రాండ్ అందిస్తున్న 911 స్పోర్ట్స్ కారు యొక్క ట్రాక్-ఫోకస్డ్ వెర్షన్ కాగా, 911 జిటి3 టూరింగ్ అనేది ట్రాక్-ఫోకస్డ్ వెర్షన్ గా ఉంటుంది మరియు ఇది మరింత సూక్ష్మమైన రియర్ వింగ్ ను కలిగి ఉంటుంది. ఇందులో కొత్త పోర్ష్ 911 జిటి3 స్పోర్ట్స్ కారులో శక్తివంతమైన 4.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఫ్లాట్-సిక్స్ ఇంజన్‌ ఉంటుంది.

భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన టెక్ఆర్ట్ (TechArt).. ఇకపై స్టైలిష్ అండ్ యునిక్ పోర్ష్ కార్లను చూడొచ్చు!

ఈ పవర్‌ఫుల్ ఇంజన్ గరిష్టంగా 503 బిహెచ్‌పి పవర్ ను మరియు 470 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ మరియు టార్క్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ పిడికె డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. ఈ కారు కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, May 6, 2022, 14:50 [IST]
English summary
Techart starts porsche car customisation business in india opens showroom in bangalore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+