భీమా ప్రీమియం తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు - పూర్తి వివరాలు
ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కారు కలిగి ఉండాలని అనుకుంటారు, కానీ ఇందులో కొంతమంది నిత్యావసరాల కోసం వినియోగిస్తే, మరి కొందరు లగ్జరీ కోసం వినియోగిస్తారు. అయితే ఎవరు ఎలా ఉపయోగించుకున్నా.. ఆ కారుకి భీమా చేయించుకోవడం తప్పనిసరి. కానీ చాలామంది వాహన వినియోగదారులు భీమా అనేది అనవసరమని, అది ఖర్చుతో కూడుకున్నదని అనుకుంటారు. కానీ ఖరీదైన భీమాలు ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కొన్ని ప్రీమియం పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
వాహన వినియోగదారులు కొత్త టిప్స్ తెలుసుకోవడం వల్ల తప్పకుండా మీ భీమా పాలసీని చాలా తక్కువకే పొందవచ్చు మరియు డబ్బు కూడా ఆదా చేయవచ్చు. ఈ టిప్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

పాత కార్ల కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోండి:
నిజానికి కొత్త కారుకంటే కూడా పాత కారుకి భీమా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కావున పాతకారు కోసం తప్పకుండా థర్డ్ పార్టీ లేదా సమగ్ర బీమా తీసుకోవచ్చు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో మీ కారుకు ఎలాంటి కవరేజీ అందించబడదు, అయితే సమగ్ర బీమాలో కంపెనీ థర్డ్ పార్టీతో పాటు సొంత డ్యామేజ్ కవరేజీని అందిస్తుంది.

ఈ కారణంగా, థర్డ్ పార్టీ బీమా ప్రీమియం కంటే సమగ్ర బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కారు చాలా వరకు పాతది అయితే, మీరు సమగ్ర బీమాకు బదులుగా థర్డ్ పార్టీ బీమాను మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. దీని వల్ల మీకు ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది.

కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఇన్‌స్టాల్ చేయండి:
మీ కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దానిపై కూడా కారు బీమా ఆధారపడి ఉంటుంది. అప్డేటెడ్ యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఉండటం వల్ల దొంగిలించబడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. కావున కారు యొక్క సేఫ్టీ ఫీచర్స్ పరిగణనలోకి తీసుకుంటే, బీమా కంపెనీ మీ నుంచి తక్కువ ప్రీమియం వసూలు చేస్తుంది.

నిజానికి మీరు కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్, గేర్‌లాక్‌లు లేదా స్టీరింగ్ లాక్ వంటి వాటిని ఇన్‌స్టాల్ చేసి ఉంటే, అప్పుడు కారు దొంగిలించబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, తక్కువ ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని, బీమా కంపెనీ ప్రీమియంను తగ్గిస్తుంది.

అనవసరమైన కార్ మోడిఫికేషన్స్ నివారించండి:
భారతదేశంలో ప్రస్తుతం మోడిఫైడ్ కార్లకు చాలా మంచి గిరాకీ ఉంది. కావున ఎక్కువమంది మాడిఫైడ్ కార్లను వినియోగించడానికి ఆసక్తి చూపుతారు. మోడిఫైడ్ కార్ల విలువ సాధారణ కార్ల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ కారు విలువ పెరిగే కొద్దీ భీమా ప్రీమియం కూడా అమాంతం పెరుగుతుంది. కావున అవసరమైతే తప్పా కారు మోడిఫికేషన్ చేయకూడదు.

కార్ ఇన్సూరెన్స్ కంపార్ చేసుకోండి:
మీరు కారుకి భీమా పాలసీ తీసుకునే ముందు మార్కెట్లో ఉన్న భీమా పాలసీలు ఏవి, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అని ఒకసారి కంపార్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో భీమా పాలసీలను విక్రయిస్తున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. ఇందులో కూడా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ భీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా కంపార్ చేసుకోవడం వల్ల తక్కువ ప్రీమియంతో మెరుగైన భీమా పొందే అవకాశం ఉంటుంది.

స్వచ్ఛంద మినహాయింపు చెల్లించండి (Voluntary Deductibles):
మీరు కారు కోసం బీమా పాలసీ తీసుకునేటప్పుడు స్వచ్ఛందంగా మినహాయించదగిన మొత్తాన్ని చెల్లిస్తే తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశాన్ని కంపెనీ మీకు అందించే అవకాశం ఉంటుంది. మీరు మీ సామర్థ్యాన్ని బట్టి స్వచ్ఛందంగా మినహాయించదగిన మొత్తాన్ని చెల్లించవచ్చు.

అనవసరమైన యాడ్-ఆన్‌లను అవైడ్ చేయండి:
మీ కారు బీమా పాలసీ తీసుకునేటప్పుడు.. మీ పాలసీకి యాడ్ ఆన్ కవర్లను యాడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎంచుకునే యాడ్ ఆన్ కవర్లను బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో జీరో డిప్రిసియేషన్ కవర్, టైర్ ప్రొటెక్ట్ కవర్, ఇంజిన్ ప్రొటెక్ట్ కవర్, గ్యారేజ్ క్యాష్ వంటివి ఉన్నాయి. నిజానికి మీరు ఎన్ని యాడ్-ఆన్ కవర్‌లను జోడిస్తే, మీ ప్రీమియం అంత ఖరీదైనదిగా మారుతుంది, కావున మీకు తప్పనిసరి అనుకున్నవి కాకుండా మిగిలినవి తొలగించుకోవచ్చు.

మైనర్ క్లెయిమ్స్ అవైడ్ చేయండి:
మీరు మీ కారుకోసం భీమా తీసుకునేటప్పుడు చిన్న చిన్న నష్టాల కోసం క్లెయిమ్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న రిపేరీలకు ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉండదు. కావున ఆలాంటి వాటిని మీరే పరిష్కరించుకోవచ్చు. మీరు చిన్న చిన్న నష్టాలకు క్లెయిమ్ చేస్తే మీ నో క్లెయిమ్ బోనస్ కోల్పోవచ్చు మరియు తదుపరి ప్రీమియంపై తగ్గింపును కోల్పోయే అవకాశం ఉంటుంది.

మీరు డ్రైవ్ చేసినంత ప్రీమియం చెల్లించండి (Pay As You Drive Car Insurance):
మీరు కారుని ఎక్కువగా ఉపయోగించని సమయంలో ఎక్కువ ప్రీమియం చెల్లించడమ్ మంచిది కాదు. మీరు ఎక్కువ ప్రీమియం పొందాలంటే ఎక్కువ ఉపయోగించాలి. ఈ పాలసీ ప్రకారం మీరు మీ కారుని ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారో దానికి తగిన ప్రీమియం చెల్లించాలి.

పాలసీని ల్యాప్స్ అవైడ్ చేయండి:
కారు వినియోగదారులు ఏదైనా వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే, ఖచ్చితంగా ప్రీమియం చెల్లింపుకి ఒక నిర్దిష్ట గడువు ఉంటుంది. ఆ గడువులోపు తప్పకుండా పాలసీ చెల్లించాలి. గడువు ముగిసే వరకు వేచి ఉండటం మంచిది కాదు. మీ బీమాను కొనసాగించాలి అనుకున్నప్పుడు ముందుగానే పాలసీ ప్రీమియం చెల్లించాలి. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ఆటోమొబైల్ అసోసియేషన్‌లో చేరండి:
వాహనదారులు ఆటోమొబైల్ అసోసియేషన్‌లో చేరడం వల్ల తమ వెహికల్ ప్రీమియంలపై చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAI) లేదా వెస్ట్రన్ ఇండియా ఆటోమొబైల్ అసోసియేషన్ (WIAA) లో చేరవచ్చు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరిన తర్వాత మీరు ప్రీమియంపై ప్రత్యేక తగ్గింపు మరియు ప్రయోజనాలకు అర్హులవుతారు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
వాహన వినియోగదారుడు తాను ఎటువంటి ప్రీమియం పొందాలి, ఏ ప్రీమియం ఎవరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనే అన్ని విషయాలు పైన వివరించడం జరిగింది. దీనిపైనా అభిప్రాయాలను మాతో పంచుకోండి, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు కొత్త కార్లు & బైకుల గురించి ఎప్పటికప్పడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








