గత 2016 నుండి 3 లక్షల మంది కార్ ఓనర్లు ఇంకా నెంబర్ ప్లేట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు..!

సాధారణంగా కొత్త కారును కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా సరే తప్పనిసరిగా దానిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత దాదాపు ఒక నెల నుండి 3 నెలల లోపు సదరు వాహన యజమాని పేరుపై ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ వస్తుంది. అనేక సందర్భాల్లో ఇవి కారు కొనుగోలు చేసిన డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేయడం లేదా నేరుగా యజమానుల ఇంటికి పోస్ట్ ద్వారా డెలివరీ చేయడం జరుగుతుంది.

గత 2016 నుండి 3 లక్షల మంది కార్ ఓనర్లు ఇంకా నెంబర్ ప్లేట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు..!

ఇది వరకు చెప్పుకున్న ఈ నెంబర్ ప్లేట్ కోసం ఎవరైనా మూడు నెలల వరకూ వేచి చూస్తే ఓకే, కానీ గత ఐదేళ్లుగా దాదాపు మూడు లక్షల మంది కార్ ఓనర్లు ఇంకా తమ కార్ నెంబర్ ప్లేట్ వేచి చూస్తున్నారంటే, కాస్తంత ఆలోచించాల్సిన విషయమే. ఈ సంఘటన ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా? ఇది మన పొరుగు దేశమైన పాకిస్థాన్ లో జరిగింది. అక్కడి ప్రజలు దాదాపు 2016 నుండి తమ కార్ రిజిస్ట్రేషన్ ప్లేట్ల కోసం ఎదురుచూస్తున్నారట. ఈ జాబితాలో సుమారు 3 లక్షల మంది కార్ ఓనర్లు ఉన్నట్లు సమాచారం.

గత 2016 నుండి 3 లక్షల మంది కార్ ఓనర్లు ఇంకా నెంబర్ ప్లేట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు..!

పాకిస్థాన్ లో ఇటీవల కార్ల డీలర్లు, దిగుమతిదారులు, ఎక్సైజ్ మరియు పన్ను అధికారుల సమక్షంలో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో దాదాపు 3 లక్షల మంది ఇంకా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ సమాచారంతో, సింధ్ ప్రావిన్స్ వాసులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెద్ద ఇబ్బందిగా మారినట్లు వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లో రిజిస్టర్ చేయబడిని ప్రతి కొత్త వాహనం విషయంలో, దాని యజమానుల నుండి వెయ్యి రూపాయల వరకు ఫీజు వసూలు చేయబడం జరుగుతుంది.

గత 2016 నుండి 3 లక్షల మంది కార్ ఓనర్లు ఇంకా నెంబర్ ప్లేట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు..!

దీంతో నంబర్‌ ప్లేట్‌ రాకముందే ప్రభుత్వం ఇలా అందరి నుంచి ఫీజులు వసూలు చేస్తోంది. దీని ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వానికి సుమారు 300 మిలియన్ పాకిస్తానీ రూపాయల ఆదాయం లభించినట్లు సమాచారం. దాదాపు ఐదేళ్లు గడిచినా ఆ 3 లక్షల మందికి ఇంకా వాహనాల రిజిస్ట్రేషన్‌ జరగలేదు. ఇలా రిజిస్టర్ కాబడని కారులో బయటకు వస్తే, జరిమానాలు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో సదరు వాహన యజమానులు తమ వాహనాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

గత 2016 నుండి 3 లక్షల మంది కార్ ఓనర్లు ఇంకా నెంబర్ ప్లేట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు..!

కొన్ని నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ప్రవేశపెట్టబోయే కొత్త బయోమెట్రిక్ సిస్టమ్ విధానమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సింధ్ ప్రావిన్స్‌లో వాహనాలను రిజిస్టర్ చేయడానికి మరియు రిజిస్ట్రేషన్లను సవరించడానికి కొత్త బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి దీన్ని ఆచరణలోకి తీసుకురావడం పెద్ద సమస్యగా మారింది. ఈ ప్రక్రియ జాప్యం కావడంతో సదురు వాహనాల రిజిస్ట్రేషన్ కూడా ఆలస్యమైంది.

గత 2016 నుండి 3 లక్షల మంది కార్ ఓనర్లు ఇంకా నెంబర్ ప్లేట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు..!

అయితే, ఈ ఏడాది మార్చ్ నెల నాటికి ఈ సమస్య పరిష్కరించబడుతుందని సమాచారం. కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా ప్రస్తుతం వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం సింధ్ ప్రావిన్స్‌లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇందుకు ధరఖాస్తు ఫీజు రూ. 1,000 పాకిస్థానీ రూపాయాలుగా ఉంది. అయితే, కొత్త బయోమెట్రిక్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఫీజు రూ. 1,800 లకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సింధ్ ప్రావిన్స్‌లో నివసించే వారు ప్రస్తుతం ‘ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం, వీలైనంత త్వరగా మా రిజిస్ట్రేషన్ నంబర్ మాకు ఇవ్వండి' అన్నట్లుగా ఉంది.

గత 2016 నుండి 3 లక్షల మంది కార్ ఓనర్లు ఇంకా నెంబర్ ప్లేట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు..!

గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన అన్ని చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే అని గమనించగలరు.

ఇదిలా ఉంటే, మనదేశంలో వివిధ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసుల్లో జరిమానాలు విధించబడి, వాటిని చెల్లించకుండా తిరిగే వాహన యజమానులు చాలానే ఉన్నారు. అసలు కొందరికైతే తమ వాహనంపై చలాన్ ఉన్న విషయం పోలీసులు ఆపితే కానీ తెలియడం లేదు. కొన్ని సందర్భాల్లో ఒక వెహికల్ మీద లెక్కకుమించిన చలానాలు జారీ చేయబడి ఉంటాయి. అయితే, వాహన యజమానులు వీటన్నింటిని ఒక్కసారికి క్లియర్ చేయడం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో, పెండింగ్ చలనాలను పూర్తిగా క్లియర్ చేయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

గత 2016 నుండి 3 లక్షల మంది కార్ ఓనర్లు ఇంకా నెంబర్ ప్లేట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు..!

పోలీసులు ప్రకటించిన సమాచారం ప్రకారం, మార్చి 1, 2022వ తేదీ నుండి మార్చి 31, 2022వ తేదీ వరకు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ గడువు లోగా పెండింగ్ చలాన్లను క్లియర్ చేసిన వారికి పోలీసులు డిస్కౌంట్లను అందించనున్నారు. సమాచారం ప్రకారం, ద్విచక్ర వాహన వినియోగదారులు పెండింగ్ లో ఉన్న చలనాలలో 25 శాతం మాత్రం చెల్లింస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తం పోలీస్ శాఖ మాఫీ చేసింది. అదే విధంగా కార్ వినియోగదారులు 50 శాతం, ఆర్టీసీ బస్సులు 30 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

గత 2016 నుండి 3 లక్షల మంది కార్ ఓనర్లు ఇంకా నెంబర్ ప్లేట్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు..!

ఈ చలానాలు చెల్లించాలనుకునే వారు మీ-సేవా లేదా ఆన్‌లైన్ లో చెల్లించవచ్చని పోలీస్ శాఖ తెలిపింది. నివేదికల ప్రకారం, ప్రస్తుతం రూ. 600 కోట్ల వరకు పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు ప్రకటించిన ఈ బంపర్ అఫర్ ద్వారా ఎంత మేర వసూళ్లు వస్తాయనేది వేచి చూడాలి. పెండింగ్ చలాన్ల చెల్లింపు కోసం వాహన దారులు ఈ స్పెషల్ డ్రైవన్ ఉపయోగించుకొంటారని పోలీస్ శాఖాధికారులు చెబుతున్నారు. నిజానికి, చలాన్లను కలిగి ఉన్న వాహనదారులకు ఇదొక మంచి సువర్ణావకాశంగా చెప్పవచ్చు. మరి మీ వెహికల్ పై ఏవైనా చలాన్ ఉన్నాయో లేదో ఆన్‌లైన్ లో చెక్ చేసుకోండి.

Most Read Articles

English summary
Three lakh car owners in pakistan still waiting for registration plates since 2016
Story first published: Wednesday, March 2, 2022, 9:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X