ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్

భారతీయ మార్కెట్లో ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఏదో ఒక కొత్త వాహనం విడుదలవుతూనే ఉంది. అయితే ఈ మూడు రోజుల్లో (6,7 మరియు 8వ తేదీలలో) మార్కెట్లో మూడు కొత్త ఆధునిక మరియు లేటెస్ట్ కార్లు విడుదల కానున్నాయి. ఇందులో మహీంద్రా XUV400, హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ మరియు ఫేస్‌లిఫ్ట్ సిట్రోయెన్ సి5 ఎయిర్ క్రాస్ ఉన్నాయి.

Recommended Video

భార‌త్‌లో విడుదలైన Citroen C3 | ధర & వివరాలు

మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త కార్లను గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ (Hyundai Venue N Line):

హ్యుందాయ్ కంపెనీ యొక్క వెన్యూ ఎన్ లైన్ ఈ రోజు (సెప్టెంబర్ 06) భారతీయ విఫణిలో అధికారికంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ కొత్త SUV కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లో కానీ లేదా అధీకృత హ్యుందాయ్ డీలర్‌షిప్ లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త 'వెన్యూ ఎన్-లైన్' ఎన్6 మరియు ఎన్8 అనే రెండు వేరియంట్‌లలో విడుదల కానుంది. ఇది ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన కలర్ ఆప్సన్స్ లో కూడా అందుబాటులోకి రానుంది. ఇది ఇప్పుడు 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందనుంది.

ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్

కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ తో రానుంది. ఇది120 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 7 స్పీడ్ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ ఈ కొత్త మోడల్ యొక్క ధరలను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు, కానీ రూ .10.97 లక్షల నుండి రూ .12.72 లక్షల మధ్య ఉండే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది.

ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్

సిట్రోయెన్ సి5 ఎయిర్ క్రాస్ ఫేస్‌లిఫ్ట్ (Citroen C5 Aircross Facelift):

ఫ్రెంచ్ కార్ తయారీ సంస్థ ఇప్పటికే తన సి5 ఎయిర్ క్రాస్ ని దేశీయ మార్కెట్లో విడుదల చేసి మంచి ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు ఇందులో ఫేస్‌లిఫ్ట్ మోడల్ తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ సి5 ఎయిర్ క్రాస్ రేపు (సెప్టెంబర్ 07) భారతీయ మార్కెట్లో విడుదల కానుంది.

ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్

ఈ కొత్త సిట్రోయెన్ సి5 ఎయిర్ క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో రీడిజైన్ చేయబడిన 10 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అందుబాటులో ఉంటుంది. అయితే ఇది ADAS ఫీచర్ కూడా పొందే అవకాశం ఉంది. ఇక ధరల విషయానికి వస్తే, ఇది దాదాపుగా రూ. 37 లక్షల నుండి రూ. 40 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. లాంచ్ సమయంలో అధికారిక ధరలు వెల్లడవుతాయి.

ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్

మహీంద్రా ఎక్స్​యూవీ400 (Mahindra XUV400):

మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబర్ 08 న దేశీయ మార్కెట్లో తన 'ఎక్స్​యూవీ400' విడుదల చేయనుంది. మహీంద్రా XUV400 అనేది కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ SUV కానుంది. ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్ ఈవి కి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్

మహీంద్రా XUV400 అనేది XUV300 ఆధారంగా రూపొందించబడుతోంది. కావున ఇది పెట్రోల్ మోడల్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ కానుంది. అయితే రానున్నరోజుల్లో కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించబడతాయి. మహీంద్రా నుంచి రానున్న XUV400 ఆధునిక ఫీచర్స్ పొందే అవకాశం ఉంటుంది. కావున ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ADAS వంటి ఫీచర్స్ అందించే అవకాశం ఉంది.

ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్

మహీంద్రా ఎక్స్​యూవీ400 ధరలు కూడా ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు, అయితే దీని ధర సుమారు రూ. 15 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఏది ఏమైనా త్వరలో దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

ఈ మూడు రోజుల్లో విడుదల కానున్న మూడు కొత్త కార్లు, ఇవే: వివరాలు కూడా వచ్చేశాయ్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

వాహన ప్రేమికులకు ఇష్టమైన పైన తెలిపిన మూడు SUV లు విడుదల కావడానికి ఇంక ఎన్నో రోజులు లేదు, ఈ రోజు హ్యుందాయ్ వెన్యూ యొక్క ఎన్ లైన్ విడుదలకానుంది. మరో రెండు రోజుల్లో మరో రెండు SUV లు అధికారికంగా విడుదల కానున్నాయి. వీటి గురించి అధికారిక సమాచారం త్వరలోనే విడుదలకానుంది. ఈ కొత్త SUV ల గురించి ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 6, 2022, 10:47 [IST]
English summary
Three new car s will be launched in india in 3 days details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+