మంచి రేంజ్ అందించే 'మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో' దేశీయ మార్కెట్లో విడుదలైంది: పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా ఉంది. ఈ తరుణంలో ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు కూడా విడుదలవుతున్నాయి. వీటన్నింటికి ఆదరణ భారీగానే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల దేశీయ మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విడుదలయింది.
Recommended Video
దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ యొక్క ధర, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

తమిళనాడుకు చెందిన మురుగప్ప గ్రూప్ కంపెనీ 'ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా' అనుబంధ సంస్థ టిఐ క్లీన్ మొబిలిటీ మంగళవారం చెన్నైలో 'మోంట్రా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఆటో' విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లాంచ్ అనేది కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ రంగ ప్రవేశాన్ని తెలియజేస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 'మోంట్రా ఎలక్ట్రిక్' (Montra Electric) త్రీ-వీలర్ ఆటో ధర రూ. 3.02 లక్షలు (ఎక్స్-షోరూమ్, చెన్నై). ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చెన్నైలోని అంబత్తూర్‌లోని TI క్లీన్ మొబిలిటీ సదుపాయంలో తయారు చేయబడుతుంది. ఆ తరువాత అక్కడ నుంచి దశల వారీగా భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా 100 కు పైగా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచబడుతుంది. కావున కొనుగోలుదారులు సులభంగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.
దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మోంట్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటో అనేక ఆధునిక ఫీచర్స్ పొందటమే కాకుండా అద్భుతమైన పరిధిని (రేంజ్) కూడా అందిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ విడుదలతో కంపెనీ మార్కెట్లో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది.

దేశీయ మార్కెట్లో మోంట్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటో విడుదల సందర్భంగా ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ 'అరుణ్ మురుగప్పన్' మాట్లాడుతూ.. ప్రస్తుతం వినియోగదారుల అవసరాలను తక్కువ ఖర్చులతో తీర్చడానికి మరియు ఆధునిక ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది తప్పకుండా మా కష్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతుందని ఆశిస్తున్నాము. రానున్న రోజుల్లో మరింత గొప్ప ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయడానికి కూడా సన్నాహాలు సిద్ధం చేస్తామని ఆయన అన్నారు.

Ti క్లీన్ మొబిలిటీ మోంట్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటో 10 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ పైన గరిష్టంగా 197 కిమీ పరిధిని అందిస్తుందని 'ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (ARAI) చేత ధృవీకరించబడింది. అయితే ఇది వివిధ వాతావరణ పరిస్థితుల్లో తప్పకుండా 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. కావున ఇది తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లో అందుబాటులో ఉండే బ్యాటరీ అత్యుత్తమ పనితీరుని అందిస్తుంది. కావున మెయింటెనెన్స్ ఖర్చులు కూడా సాధారణ ఆటోలకంటే కూడా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ అందుబాటులో ఉండటమే కాకుండా.. పార్క్ అసిస్ట్ మోడ్ కూడా అందుబాటులో ఉంటుంది.

మోంట్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లో లగేజ్ ఉంచుకోవడానికి తగినంత బూట్ స్పేస్ లభిస్తుంది. ఇందులో డ్రైవర్ కోసం మెరుగైన కుషనింగ్‌తో ఒక ఆధునిక సీటు కూడా లభిస్తుంది. ఇది ఒక కారులోని సీటు వంటి అనుభూతిని తప్పకుండా అందిస్తుంది.
ఈ ఆటో యొక్క ముందు భాగంలో ట్విన్ ఫోర్క్‌లు కూడా లభిస్తాయి. అదే సమయంలో ఇందులో డ్రైవర్ మరియు వాహనం వెనుక ప్రయాణించే ప్రయాణికుల కోసం టెలిమాటిక్స్ మరియు యాప్‌లు వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి ఇంగ్లీష్ మరియు ఇతర భాషలలో అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది ఆధునిక కాలంలో ఉపయోగించుకోవడానికి సరైన ఎలక్ట్రిక్ ఆటో అని చెప్పవచ్చు.

ఇక వారంటీ విషయానికి వస్తే, Ti క్లీన్ మొబిలిటీ మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో డిజిటల్ ఫైనాన్సింగ్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్ వారంటీ ఆప్సన్ మరియు 3 సంవత్సరాల AMC కూడా లభిస్తుంది. ఇవన్నీ వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ పెరుగుతున్న సమయంలో దేశీయ మార్కెట్లో Ti క్లీన్ మొబిలిటీ యొక్క మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో విడుదల కావడం మంచి విషయం. రానున్న రోజుల్లో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రాక్టర్లు మరియు ట్రక్కులను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 'మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో' ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం తెలియాలి. దీనికి సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








