విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్ లోని టాప్ 5 బ్యూటీస్

టాలీవుడ్ సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న యువ నటులలో మన యాంగ్రీ యంగ్‌మ్యాన్ విజయ్ దేవరకొండ కూడా ఒకరు. విజయ్ సినీ కెరీర్‌లో కొన్ని మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి చిత్రంలో యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ ఉన్న ఓ డాక్టర్‌గా, ప్రేమికుడిగా విలక్షణ పాత్రలో నటించి అందరి మెప్పు పొందాడు. ఆ తర్వాత గీత గోవిందంలో మేడమ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటూ అమ్మాయిల మనసు దోచుకున్నాడు.

ప్రస్తుతం, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ పేరుతో మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈరోజు మన రౌడీ బ్రాండ్ ఓనర్ విజయ్ దేవరకొండ బర్త్‌డే. ఈ సందర్భంగా, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 'వరల్డ్ ఫేమస్ లవర్' కార్ గ్యారాజ్‌లో ఉండే ఆ టాప్ 5 కార్లు ఏవో తెలుసుకుందాం రండి.

హ్యాపీ బర్త్‌డే 'రౌడీ'.. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ టాప్ 5 బ్యూటీస్ గురించి మీకు తెలుసా?

విజయ్ ఓ మంచి నటుడు, వ్యాపారవేత్త, కొన్ని పాపులర్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్. వీటన్నింటితో పాటుగా విజయ్ ఓ మంచి కార్ లవర్ కూడా. అతని కార్ కలెన్షన్ చూస్తే, ఈ విషయం అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో అమెరికన్, జర్మన్, బ్రిటీష్ మరియు స్వీడన్ బ్రాండ్లకు చెందిన కార్లు ఉన్నట్లు సమాచారం. ఆ వివరాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి.

హ్యాపీ బర్త్‌డే 'రౌడీ'.. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ టాప్ 5 బ్యూటీస్ గురించి మీకు తెలుసా?

వోల్వో ఎక్స్‌సి 90 (Volvo XC90)

విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ స్వీడన్ బ్రాండ్ కారు ఉన్నట్లు సమాచారం. స్వీడన్‌కి చెందిన వోల్వో భారత మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన మరియు సురక్షితమైన కార్లలో వోల్వో ఎక్స్‌సి90 కూడా ఒకటి.

హ్యాపీ బర్త్‌డే 'రౌడీ'.. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ టాప్ 5 బ్యూటీస్ గురించి మీకు తెలుసా?

ఇది కంపెనీ వోల్వో యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మరియు భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. వోల్వో ఎక్స్‌‌సి90 ఓ ఫుల్ సైజ్ 7 సీటర్ ఎస్‌యూవీ. ఇది శక్తివంతమైన 1969 సిసి ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 300 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌‌సి90 ధరలు సుమారు రూ. 90 లక్షలు, కాగా టాప్ మోడల్‌ ధర రూ. 1.31 కోట్లు (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటాయి.

హ్యాపీ బర్త్‌డే 'రౌడీ'.. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ టాప్ 5 బ్యూటీస్ గురించి మీకు తెలుసా?

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి (Mercedes Benz GLC)

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పవర్‌ఫుల్ ఎస్‌యూవీ జిఎల్‌సి క్లాస్. కొన్ని నివేదికల ప్రకారం, విజయ్ దేవరకొండ తరచుగా ఇదే కారులో షూట్‌లకు మరియు హైదరాబాద్ నగర వీధులపై తిరుగుతాడని సమాచారం. గతేడాది జనవరి నెలలో మెర్సిడెస్ బెంజ్ తమ కొత్త 2021 మోడల్ జిఎల్‌సి ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది.

హ్యాపీ బర్త్‌డే 'రౌడీ'.. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ టాప్ 5 బ్యూటీస్ గురించి మీకు తెలుసా?

దేశీయ విపణిలో ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధరలు రూ.60 లక్షలకు పైగానే ఉంటాయి. మార్కెట్లో ఇది జిఎల్‌సి 200 మరియు 200డి అనే రెండు వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 258 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజన్ 245 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

హ్యాపీ బర్త్‌డే 'రౌడీ'.. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ టాప్ 5 బ్యూటీస్ గురించి మీకు తెలుసా?

ఫోర్డ్ మస్టాంగ్ (Ford Mustang)

భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయిన అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న స్పోర్ట్స్ కారు ఫోర్డ్ మస్టాంగ్ కూడా మన అర్జున్ రెడ్డి కార్ కలెక్షన్‌లో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఇది ఆయనకు అత్యంత ఇష్టమైన కారు కూడా అని చెప్పుకుంటుంటారు. ఓ బ్లాక్ కలర్ ఫోర్డ్ మస్టాంగ్‌తో ఆయన దిగిన ఫోటో కూడా ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

హ్యాపీ బర్త్‌డే 'రౌడీ'.. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ టాప్ 5 బ్యూటీస్ గురించి మీకు తెలుసా?

నిజానికి, ఫోర్డ్ ఈ కారును నేరుగా తమ డీలర్‌షిప్ ద్వారా భారత మార్కెట్లో విక్రయించనప్పటికీ, కొన్ని కార్ ఇంపోర్ట్ కంపెనీలు దీనిని ప్రత్యేకంగా విదేశాల నుండి ఇక్కడికి దిగుమతి చేసుకుంటాయి. తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ భారత మార్కెట్ నుండి నిష్క్రమించినప్పటికీ, తమ లగ్జరీ కార్లను ఇక్కడి మార్కెట్లో దిగుమతి చేసుకుని విక్రయించాలని చూస్తోంది.

హ్యాపీ బర్త్‌డే 'రౌడీ'.. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ టాప్ 5 బ్యూటీస్ గురించి మీకు తెలుసా?

రేంజ్ రోవర్ (Range Rover)

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న ఖరీదైన కార్లలో రేంజ్ రోవర్ కూడా ఒకటి మరియు సెలబ్రిటీలు ఎక్కువ ఇష్టపడే కార్లలో ఇది కూడా ఒకటి. విజయ్ దేవరకొండ కార్ కలెక్షన్‌లో కనిపించే బ్రిటీష్ బ్యూటీ ఇదేనట. భారత మార్కెట్లో ఈ కారు ధరలు రూ.60 లక్షలకు పైగానే ఉంటాయి.

హ్యాపీ బర్త్‌డే 'రౌడీ'.. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ టాప్ 5 బ్యూటీస్ గురించి మీకు తెలుసా?

ఇదిలా ఉంటే, జేఎల్ఆర్ గతేడాది జూన్ నెలలో భారత మార్కెట్లో తమ అత్యంత ఖరీదైన సరికొత్త 2021 రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.2.19 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ల్యాండ్ రోవర్ బ్రాండ్‌కి చెందిన పెర్ఫార్మెన్స్ వాహన విభాగం (ఎస్‌విఆర్) ప్రత్యేకంగా ఈ కారుని డిజైన్ చేసింది. ఇందులో శక్తివంతమైన సూపర్ఛార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు.

హ్యాపీ బర్త్‌డే 'రౌడీ'.. విజయ్ దేవరకొండ కార్ గ్యారాజ్‌లో ఈ టాప్ 5 బ్యూటీస్ గురించి మీకు తెలుసా?

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ (BMW 5-Series)

విజయ్ కార్ కలెక్షన్‌లో ఉండే మరొక జర్మన్ బ్యూటీ బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్. కొన్ని వీడియోలలో అతను ఈ కారులో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాడు. భారత మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.60 లక్షలకు పైమాటే. గతేడాది జూన్ నెలలో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ తమ 2021 మోడల్ 5-సిరీస్ లగ్జరీ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో 530ఐ ఎమ్ స్పోర్ట్స్, 520డి మరియు 530డి ఎమ్ స్పోర్ట్స్ వేరియంట్లు ఉన్నాయి. మార్కెట్లో వీటి ధరలు రూ.63 లక్షల నుండి రూ.72 లక్షల వరకూ ఉన్నాయి.

(గమనిక: కథనంలో ఉపయోగించిన చిత్రాలు కేవలం ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే మరియు ఇది ఇంటర్నెట్‌లోని వివిధ మూలాల నుండి సేకరించిన వివరాల ఆధారంగా ప్రచురించిన కథనం అని గుర్తించగలరు)

More from DriveSpark

Article Published On: Monday, May 9, 2022, 13:35 [IST]
English summary
Tollywood actor vijay devarakonda car collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+