ఆగస్ట్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ బ్రాండ్లు ఇవే..
భారతదేశంలో వినాయక చవితితో పండుగ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో, కార్ల విక్రయాలు కూడా జోరందుకున్నాయి. గడచిన నెలలో భారతదేశంలో మొత్తం 3,28,307 కార్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆగస్టు 2022లో భారతదేశంలో కార్ల విక్రయాలు 26.93 శాతం పెరిగాయి.
Recommended Video
గత నెలలో భారతదేశంలో విక్రయించిన మొత్తం 3,28,307 ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకి వాహనాలే 40 శాతం ఉన్నాయి.

ఎప్పటిలాగే, మారుతి సుజుకి కార్ల అమ్మకాలలో అగ్రస్థానంలో నిలువగా, హ్యుందాయ్ ద్వితీయ స్థానంలో మరియు టాటా మోటార్స్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఆసక్తికరంగా, మహీంద్రా ఈ జాబితాలో ఇప్పుడు 4వ స్థానాన్ని ఆక్రమించగా, కియా టాప్ 5లో చోటు దక్కించుకుని ఐదవ స్థానంలో నిలిచింది.

దేశంలోని 14 ప్రధాన కార్ల తయారీదారులలో 3 మాత్రమే (హోండా, రెనో, ఎమ్‌జి) వార్షిక అమ్మకాల పరంగా ప్రతికూల ఫలితాలను నమోదు చేశాయి. మిగిలిన తయారీదారులంతా సానుకూల వృద్ధిని కనబరిచాయి. ఆగస్టు 2021 నెలలో దేశంలో విక్రయించబడిన మొత్తం 2,58,653 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే, గత నెలలో వార్షిక అమ్మకాలు 69,654 యూనిట్లు (26.93 శాతం) పెరిగాయి. అయితే, జూలై 2022 నెలలో విక్రయించిన 3,41,302 యూనిట్లతో పోలిస్తే గత నెలలో నెలవారీ విక్రయాలు 12,995 యూనిట్లు (3.81 శాతం) తగ్గాయి.
| Rank | Brand | Aug-22 | Aug-21 | Growth (%) YoY |
| 1 | Maruti | 1,34,166 | 1,03,166 | 30.02 |
| 2 | Hyundai | 49,510 | 46,866 | 5.64 |
| 3 | Tata | 47,166 | 28,018 | 68.38 |
| 4 | Mahindra | 29,852 | 15,973 | 86.89 |
| 5 | Kia | 22,322 | 16,750 | 33.27 |
| 6 | Toyota | 14,959 | 12,772 | 17.12 |
| 7 | Honda | 7,769 | 11,177 | -30.49 |
| 8 | Renault | 7,012 | 9,703 | -27.73 |
| 9 | Skoda | 4,222 | 3,829 | 10.26 |
| 10 | MG | 3,823 | 4,315 | -11.40 |
| 11 | Nissan | 3,283 | 3,209 | 2.31 |
| 12 | Volkswagen | 2,052 | 1,631 | 25.81 |
| 13 | Jeep | 1,321 | 1,173 | 12.62 |
| 14 | Citroen | 850 | 50 | 1600.00 |
| Rank | Brand | Aug-22 | Jul-22 | Growth (%) MoM |
| 1 | Maruti | 1,34,166 | 1,42,850 | -6.08 |
| 2 | Hyundai | 49,510 | 50,500 | -1.96 |
| 3 | Tata | 47,166 | 47,505 | -0.71 |
| 4 | Mahindra | 29,852 | 28,053 | 6.41 |
| 5 | Kia | 22,322 | 22,022 | 1.36 |
| 6 | Toyota | 14,959 | 19,693 | -24.04 |
| 7 | Honda | 7,769 | 6,784 | 14.52 |
| 8 | Renault | 7,012 | 7,128 | -1.63 |
| 9 | Skoda | 4,222 | 4,447 | -5.06 |
| 10 | MG | 3,823 | 4,013 | -4.73 |
| 11 | Nissan | 3,283 | 3,667 | -10.47 |
| 12 | Volkswagen | 2,052 | 2,915 | -29.61 |
| 13 | Jeep | 1,321 | 1,150 | 14.87 |
| 14 | Citroen | 850 | 575 | 47.83 |

1 - మారుతి సుజుకి - 1,34,166 యూనిట్లు
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గత నెలలో మొత్తం 1,34,166 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఆగస్టు 2021లో విక్రయించిన 1,03,187 యూనిట్లతో పోలిస్తే గత నెలలో వార్షిక అమ్మకాలు 30,979 యూనిట్లు (30.02 శాతం) పెరిగాయి. అయితే, జూలై 2022తో పోలిస్తే మారుతి నెలవారీ అమ్మకాలు 8,684 (6.08 శాతం) తగ్గాయి.

2 - హ్యుందాయ్ - 49,510 యూనిట్లు
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, చాలా కాలంగా భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా కొనసాగుతోంది. హ్యుందాయ్ గత నెలలో భారతదేశంలో మొత్తం 49,510 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఆగస్ట్ 2021 నెలలో విక్రయించిన 46,866 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో హ్యుందాయ్ వార్షిక అమ్మకాలు 2,644 యూనిట్లు (5.64 శాతం) పెరిగాయి. అయితే, జూలై 2022 నెలలో విక్రయించిన 50,500 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 990 యూనిట్లు (1.96 శాతం) తగ్గాయి.

3 - టాటా మోటార్స్- 47,166 యూనిట్లు
టాటా మోటార్స్ తమ ఫరెవర్ రేంజ్ మోడళ్లతో భారత మార్కెట్లో ఓ బలమైన ఆటోమోటివ్ బ్రాండ్‌గా దూసుకుపోతోంది. ఈ కంపెనీ గత నెలలో మొత్తం 47,166 యూనిట్లను విక్రయించింది. ఆగస్ట్ 2021 నెలలో విక్రయించిన 28,018 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో టాటా మోటార్స్ వార్షిక అమ్మకాలు 68.34 శాతం (19,148 యూనిట్లు) పెరిగాయి. అయితే, జులై 2022 నెలలో విక్రయించిన 47,505 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు స్వల్పంగా 0.71 శాతం (339 యూనిట్లు) తగ్గాయి.

4 - మహీంద్రా - 29,852 యూనిట్లు
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, దేశీయ మార్కెట్లో సరికొత్త వాహనాలను విడుదల చేస్తూ, అమ్మకాల పరంగా ముందంజలో ఉంది. గత నెలలో మహీంద్రా మొత్తం 29,852 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి, ఈ టాప్ 10 జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఆగస్టు 2021 నెలలో మహీంద్రా విక్రయించిన 15,973 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 86.89 శాతం (13,879 యూనిట్లు) పెరిగాయి. అలాగే, జులై 2022 నెలలో కంపెనీ విక్రయించిన 28,053 యూనిట్లతో పోలిస్తే కూడా గత నెల అమ్మకాలు 6.41 శాతం (1,799 యూనిట్లు) పెరిగాయి.

5 - కియా - 23,332 యూనిట్లు
భారతదేశంలో ద్వితీయ కొరియన్ ఆటోమొబైల్ బ్రాండ్ అయిన కియా, గడచిన ఆగస్ట్ 2022 నెలలో మొత్తం 23,332 యూనిట్ల వాహనాలను విక్రయించింది. భారతదేశంలో హ్యుందాయ్ గ్రూపుకి చెందిన ఈ ప్రీమియం ఆటోమొబైల్ బ్రాండ్ ఆగస్ట్ 2021 నెలలో 16,750 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో కియా ఇండియా అమ్మకాలు 33.27 శాతం (5,572 యూనిట్ల) వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. అలాగే, జూలై 2022 నెలలో విక్రయించిన 22,022 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 1.36 శాతం (300 యూనిట్లు) పెరిగాయి.

ఇక ఈ జాబితాలోని తదుపరి ఐదు స్థానాలలో టొయోటా, హోండా, రెనో, స్కోడా, ఎమ్‌జి కార్ బ్రాండ్లు ఉన్నాయి. గత నెలలో టొయోటా మొత్తం 14,959 యూనిట్లను విక్రయించి 17.12 శాతం వృద్ధితో 6వ స్థానంలో నిలువగా, హోండా 7,769 యూనిట్లను 30.49 శాతం క్షీణతతో 7వ స్థానంలో నిలిచింది. ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో గత నెలలో 7,012 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి 27.73 శాతం క్షీణతతో 8వ స్థానంలో ఉంది. ఇకపో స్కోడా 4,222 యూనిట్లను విక్రయించి 10.26 శాతం వృద్ధితో 9వ స్థానంలో ఉండగా, ఎమ్‌జి 3,823 యూనిట్లను విక్రయించి 11.40 శాతం క్షీణతతో 10వ స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications








