మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెరిగిన ముడిసరుకుల ధరల మరియు నిత్యం పెరుగుతున్న ఇంధన ధరల వంటి పరిస్థితుల నేపథ్యంలో, కార్ కంపెనీలు గడచిన నెలలో మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. మార్చి 2022 నెలలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్ బ్రాండ్‌ల జాబితా విడుదలైంది. ఇందులో ఎప్పటిలాగే మారుతి సుజుకి టాప్ ప్లేస్‌లో ఉండగా, టాటా మోటార్స్‌ను ఓవర్‌టేక్ చేసి హ్యుందాయ్ రెండవ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఈ రేసులో టాటా మోటార్స్ మూడవ స్థానంలో నిలిచింది.

మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

1. మారుతి సుజుకి (1,33,861 యూనిట్లు)

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, గడచిన మార్చి 2022 నెలలో తన అగ్రస్థానాన్ని అలానే నిలుపుకుంది. గత నెలలో ఈ ఇండో-జపనీస్ కంపెనీ 1,33,861 యూనిట్ల కార్లను విక్రయించింది. గత నెలలో అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ, మార్చి 2021తో పోలిస్తే మాత్రం ఇవి 8 శాతం తగ్గుదలను నమోదు చేసాయి. ఎందుకంటే, ఆ సమయంలో కంపెనీ మొత్తం 1,46,203 యూనిట్ల కార్లను విక్రయించింది.

మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

2. హ్యుందాయ్ (44,600 యూనిట్లు)

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ చాలా కాలంగా, భారత మార్కెట్లో రెండవ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ, మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా గతంలో మూడవ స్థానానికి పడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే, హ్యుందాయ్ ఇప్పుడు తిరిగి తన ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. మార్చి 2022లో, హ్యుందాయ్ 44,600 యూనిట్లను విక్రయించింది. అయినప్పటికీ, ఇవి మార్చి 2021లో విక్రయించిన 52,600 యూనిట్లతో పోలిస్తే దాదాపు 15 శాతం క్షీణించాయి.

మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

3. టాటా మోటార్స్ (42,293)

ఇటీవలి కాలంలో టాటా కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, కంపెనీ అమ్మకాలు కూడా పెరిగి, ఈ జాబితాలో ఇది మూడవ స్థానాన్ని దక్కించుకుంది. మార్చి 2022లో టాటా మోటార్స్ మొత్తం 42,293 యూనిట్ల కార్లను విక్రయించింది. కాగా, మార్చి 2021లో కంపెనీ కేవలం 29,654 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఆ సమయంతో పోల్చుకుంటే, గత నెలలో టాటా మోటార్స్ అమ్మకాలు 42 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది. కంపెనీ అందిస్తున్న నాణ్యమైన, సురక్షితమైన ఉత్పత్తులే ఈ బ్రాండ్ అమ్మకాల పెరుగుదలకు దారితీసింది.

మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

4. మహీంద్రా (27,603 యూనిట్లు)

కొత్త తరం మహీంద్రా థార్ మరియు సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి మోడళ్ల రాకతో మహీంద్రా బ్రాండ్ ఇమేజ్ భారీగా పెరిగింది. ఈ కొత్త మోడళ్ల కోసం కస్టమర్లు సంవత్సరాల తరబడి సైతం వేచి ఉండేందుకు సిద్ధంగా ఉంటున్నారు. దీంతో కంపెనీ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచిన మహీంద్రా గడచిన మార్చి 2022 నెలలో మొత్తం 27,603 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే, మహీంద్రా అమ్మకాలు 65 శాతం వృద్ధి చెందాయి.

మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

5. కియా మోటార్స్ (22,622 యూనిట్లు)

కొరియన్ కార్ కంపెనీ కియా ఇటీవల ప్రవేశపెట్టిన కారెన్స్ ఎమ్‌పి మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. ప్రస్తుతం, ఈ కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో కేవలం 4 ఉత్పత్తులు మాత్రమే ఉన్నప్పటికీ, ఈ జాబితాలో మాత్రం ఇది 5వ స్థానాన్ని దక్కించుకుంది. మార్చి 2022 నెలలో ఈ కొరియన్ కార్ బ్రాండ్ మొత్తం 22,622 యూనిట్ల కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే, కియా బ్రాండ్ అమ్మకాలు 18 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి.

మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

6. టొయోటా (17,131 యూనిట్లు)

ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్లలో టొయోటా కూడా ఒకటి. అందుకే, ఈ బ్రాండ్ భారతదేశంలో తక్కువ మోడళ్లను అందిస్తున్నప్పటికీ, అమ్మకాల పరంగా మాత్రం ఇది ఈ జాబితాలో 6వ స్థానాన్ని దక్కించుకుంది. మార్చి 2022 నెలలో, టొయోటా మొత్తం 17,131 యూనిట్లను విక్రయించింది. మార్చి 2021 నెలలో కంపెనీ విక్రయించిన 15,000 యూనిట్లతో పోలిస్తే, ఈ బ్రాండ్ అమ్మకాలు 14 శాతం పెరిగాయి.

మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

7. రెనో (8,518 యూనిట్లు)

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, భారత మార్కెట్లో తమ పాపులర్ డస్టర్ మోడల్‌ని నిలిపివేసింది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుండి కేవలం క్విడ్, ట్రైబర్ మరియు కైగర్ మోడళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తక్కువ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో కారణంగా ఈ బ్రాండ్ అమ్మకాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. గడచిన మార్చి 2022 నెలలో కంపెనీ కేవలం 8,518 యూనిట్ల కార్లను విక్రయించింది. అయితే ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ అంతకు ముందు సంవత్సరం మార్చి 2021 నెలలో మాత్రం 12,356 యూనిట్లను విక్రయించగలిగింది. ఈ సమయంలో రెనో అమ్మకాలు 31 శాతం క్షీణించాయి.

మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

8. హోండా (6,589 యూనిట్లు)

జపనీస్ కార్ బ్రాండ్ హోండా అమ్మకాలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ బ్రాండ్ కూడా ఇటీవలే తమ పాపులర్ ఎస్‌యూవీ హోండా సిఆర్-వి ని భారత మార్కెట్లో నిలిపివేసింది. ఇటీవలి సంవత్సరాలలో, భారత ఆటోమోటివ్ మార్కెట్‌లో మంచి పట్టు సాధించేందుకు హోండా చాలానే కష్టపడుతోంది. మార్చి 2022 నెలలో కంపెనీ కేవలం 6,589 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగినంది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఈ బ్రాండ్ అమ్మకాలు 7 శాతానికి పైగా క్షీణతను నమోదు చేశాయి.

మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

9. స్కోడా (5,608 యూనిట్లు)

స్కోడా స్లావియా సెడాన్ మరియు స్కోడా కుషాక్ ఎస్‌యూవీ వంటి కొత్త మోడళ్ల విడుదలతో, ఈ చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ భారత మార్కెట్లో శరవేగంగా ముందుకు సాగిపోతోంది. స్కోడా బ్రాండ్ భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుండి గత నెలలోనే అత్యధిక నెలవారీ విక్రయాలను సాధించింది. మార్చి 2022లో స్కోడా అమ్మకాలు 383 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి, 5,608 యూనిట్లను విక్రయించింది.

మార్చి 2022 నెలలో అత్యధిక అమ్మకాలు నమోదు చేసిన బెస్ట్ కార్ బ్రాండ్స్ ఇవే..

10. ఎమ్‌జి మోటార్ (4,721 యూనిట్లు)

ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ కంపెనీలలో ఎమ్‌జి మోటార్ కూడా ఒకటిగా పరిగణించబడుతోంది. అయితే, సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా కంపెనీ గత నెలలో ప్రతి అమ్మకాలను చూసింది. చైనీస్ యాజమాన్యంలోని ఈ బ్రిటిష్ కార్ బ్రాండ్ గడచిన మార్చి 2022 నెలలో కేవలం 4,721 యూనిట్ల కార్లను మాత్రమే విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే, ఈ బ్రాండ్ అమ్మకాలు 15 శాతానికి పైగా తగ్గాయి.

More from DriveSpark

Article Published On: Saturday, April 9, 2022, 9:11 [IST]
English summary
Top 10 best selling car brands in march 2022 maruti hyundai tata mahindra and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+