ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

ఆగస్ట్ 2022 నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితా వెల్లడైంది. ఎప్పటిలాగే ఈ జాబితాలో మారుతి సుజుకి 7 స్థానాలను దక్కించుకుని అగ్రస్థానంలో ఉంటే, హ్యుందాయ్ ఒక స్థానాన్ని మరియు టాటా మోటార్స్ రెండు స్థానాలను దక్కించుకుంది.

Recommended Video

భారత్‌లో విడుదలైన Tata Nexon EV Max: పూర్తి వివరాలు

అనూహ్యంగా, గత నెలలో టాటా నెక్సాన్ మరియు టాటా పంచ్ కార్లకు గిరాకీ జోరందుకుంది. అలాగే, మారుతి సుజుకి నుండి వచ్చిన సరికొత్త బ్రెజ్జా ఎస్‌యూవీ కూడా మంచి అమ్మకాలను కనబరిచింది. అయితే, హ్యుందాయ్ క్రెటా మాత్రమే ఆగస్ట్ టాప్ 10 కార్ల జాబితాలో చోటు దక్కించుకోగలిగింది.

ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

గత నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ మోడళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:

1) మారుతి సుజుకి బాలెనో - 18,418 యూనిట్లు

మారుతి సుజుకి తమ నెక్సా షోరూమ్ ల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో కంపెనీ ఈ ఏడాది ఆరంభంలో కొత్త 2022 మోడల్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ రాకతో బాలెనో అమ్మకాలు కూడా ఓ మోస్తరుగా పెరిగాయి. గడచిన ఆగస్ట్ నెలలో ఇది 18,418 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆగస్ట్ 2021లో విక్రయించిన 15,646 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు17.72 శాతం (2,772 యూనిట్లు) వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.

ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

2) మారుతి సుజుకి వ్యాగన్ఆర్ - 18,398 యూనిట్లు

మారుతి సుజుకి యొక్క టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ ఇప్పుడు గత జులై నెలలో 22,588 యూనిట్లతో ఇదే జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, ఆగస్ట్ 2022 నెలలో ఇది 18,398 యూనిట్ల అమ్మకాలతో ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఆగస్ట్ 2021 నెలలో మారుతి సుజుకి విక్రయించిన 9,628 యూనిట్లతో పోలిస్తే గత నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలు 91.09 శాతం (8,770 యూనిట్లు) పెరిగాయి.

ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

3) మారుతి సుజుకి బ్రెజ్జా - 15,193 యూనిట్లు

ఈ టాప్ 10 జాబితాలో మొదటి 3 స్థానాలను మారుతి సుజుకి దక్కించుకుంది. మూడవ స్థానంలో మారుతి సుజుకి నుండి కొత్తగా వచ్చిన రిఫ్రెష్డ్ 2022 బ్రెజ్జా ఉంది. గడచిన ఆగస్ట్ 2022 నెలలో మారుతి సుజుకి మొత్తం 15,193 యూనిట్ల బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీలను విక్రయించింది. ఆగస్ట్ 2021 నెలలో మారుతి సుజుకి విక్రయించిన 12,906 యూనిట్లతో పోలిస్తే గత నెలలో మారుతి సుజుకి బ్రెజ్జా అమ్మకాలు 17.72 శాతం (2,287 యూనిట్లు) పెరిగాయి.

ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

4) టాటా నెక్సాన్ - 15,085 యూనిట్లు

ఈ జాబితాలో టాప్ 5 లో చోటు దక్కించుకున్న మొదటి మారుతీయేతర మోడల్ టాటా నెక్సాన్. గడచిన ఆగస్ట్ నెలలో మారుతి బ్రెజ్జా తర్వాత అమ్మకాల చార్ట్‌లలో అత్యధిక ర్యాంక్ పొందిన ఎస్‌యూవీ మోడల్ ఇది. ప్రస్తుతం, మార్కెట్లో టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ రూపాల్లో అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ గత నెలలో 15,085 యూనిట్ల నెక్సాన్ ఎస్‌యూవీలను విక్రయించింది. ఆగస్ట్ 2021 నెలలో విక్రయించిన 10,006 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో నెక్సాన్ అమ్మకాలు 50.76 శాతం (3,927 యూనిట్లు) పెరిగాయి.

ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

5) మారుతి సుజుకి ఆల్టో - 14,388 యూనిట్లు

ఒకప్పుడు ఈ అమ్మకాల చార్ట్ లో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో కనిపించే మారుతి ఆల్టో మొన్నటి వరకూ ఈ జాబితాలో చాలా వెనుకబడి ఉండేది. అయితే, కంపెనీ ఇందులో కొత్త తరం 2022 ఆల్టో కె10 మోడల్ ని ప్రవేశపెట్టిన తర్వాత ఆల్టో అమ్మకాలు తిరిగి జోరందుకున్నాయి. గడచిన ఆగస్ట్ నెలలో మారుతి సుజుకి మొత్తం 14,388 యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించింది. ఆగస్ట్ 2021లో విక్రయించిన 13,326 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 8.70 శాతం (1,152 యూనిట్లు) పెరిగాయి.

ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

6) హ్యుందాయ్ క్రెటా - 12,577 యూనిట్లు

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ టాప్ 10 జాబితాలో ఉన్న ఏకైక మిడ్-సైజ్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా. గడచిన ఆగస్ట్ నెలలో హ్యుందాయ్ మొత్తం 12,577 యూనిట్ల క్రెటా ఎస్‌యూవీలను విక్రయించింది. ఆగస్ట్ 2021 నెలలో హ్యుందాయ్ విక్రయించిన 12,597 యూనిట్ల క్రెటాలతో పోలిస్తే, గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు స్వల్పంగా 0.16 శాతం (20 యూనిట్లు) తగ్గాయి.

ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

7) టాటా పంచ్ - 12,006 యూనిట్లు

జులై 2022 నెలతో పోలిస్తే, గత నెలలో టాటా పంచ్ అమ్మకాలు వెయ్యి యూనిట్లు పెరిగాయి. ఆగస్ట్ 2022 నెలలో టాటా మోటార్స్ మొత్తం 12,006 యూనిట్ల టాటా పంచ్ ఎస్‌యూవీలను విక్రయించింది. టాటా పంచ్ గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదలైంది మరియు అప్పటి నుండి ఈ చిన్న ఎస్‌యూవీ స్థిరంగా టాప్ 10 జాబితాలో తన స్థానాన్ని నిలుపుకుంటూ వస్తోంది. గడచిన జులై 2022 నెలలో టాటా మోటార్స్ మొత్తం 11,007 యూనిట్ల పంచ్‌ మైక్రో ఎస్‌యూవీలను విక్రయించింది.

ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

8) మారుతి సుజుకి ఈకో - 11,999 యూనిట్లు

మార్కెట్లో ఎన్ని ఎమ్‌పివిలు ఉన్నప్పటికీ, మారుతి సుజుకి ఈకోకి ఉన్న డిమాండే వేరు. ఈ మోడల్ ప్రతినెలా సగటున పది వేల యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం, భారత కార్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మరియు అత్యంత సరసమైన మినీ వ్యాన్‌గా మారుతి ఈకో అగ్రస్థానంలో ఉంది. గత నెలలో మారుతి సుజుకి మొత్తం 11,999 యూనిట్ల ఈకో వ్యాన్ లను విక్రయించింది. ఆగస్ట్ 2021 నెలలో విక్రయించిన 10,666 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 12.50 శాతం (1,333 యూనిట్లు) పెరిగాయి.

ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

9) మారుతి సుజుకి డిజైర్ - 11,868 యూనిట్లు

మారుతి సుజుకి నుండి అమ్ముడవుతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారిత కాంపాక్ట్ సెడాన్ డిజైర్ గడచిన నెలలో రెట్టింపు అమ్మకాలను సాధించింది. ఆగస్ట్ 2022 నెలలో కంపెనీ మొత్తం 11.868 స్విఫ్ట్ కార్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో (ఆగస్ట్ 2021 నెలలో) విక్రయించిన 5,714 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 107.70 శాతం (6,154 యూనిట్లు పెరిగాయి).

ఆగస్ట్ 2022 నెలలో టాప్ 10 కార్లు ఇవే.. టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు పెరిగిన డిమాండ్

10) మారుతి సుజుకి స్విఫ్ట్ - 11,275 యూనిట్లు

మారుతి సుజుకి స్విఫ్ట్ కస్టమర్లంతా ఇప్పుడు బాలెనో కోసం పరుగులు తీస్తుండటంతో స్విఫ్ట్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో కనిపించిన మారుతి స్విఫ్ట్ ఆగస్ట్ 2022 నెల జాబితాలో 10వ స్థానానికి పడిపోయింది. గత నెలలో మారుతి సుజుకి మొత్తం 11,275 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లను విక్రయించింది. ఇది ఆగస్ట్ 2021 నెలలో విక్రయించిన 12,483 యూనిట్లతో పోలిస్తే, 9.68 శాతం (1,208 యూనిట్లు) తక్కువగా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 6, 2022, 17:09 [IST]
English summary
Top 10 best selling cars in august 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+