Just In
- 1 hr ago
దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే?
- 9 hrs ago
మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్‌లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?
- 14 hrs ago
జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్యకుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు
- 1 day ago
"పెద్ద నాన్న" తిరిగొచ్చేశాడు.. ఇంకేం దిగుల్లేదని చెప్పండి..! పాత స్కార్పియో రీ-ఎంట్రీ, వేరియంట్ల వారీగా లభించే
Don't Miss
- Sports
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ పెద్ద స్పెషలేం కాదు.. సౌరవ్ గంగూలీ కామెంట్లు
- News
7 నెలలో ప్రభుత్వం పడిపోవడం ఖాయం..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
- Movies
Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి జబర్ధస్త్ గీత.. ఒక్క స్కిట్‌తో ఫేమస్.. ఆ వీడియోల వల్లే ఛాన్స్
- Lifestyle
గుండె జబ్బులకు కారణమేమిటో తెలుసా?
- Finance
Bank FD Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన 6 బ్యాంకులు ఇవే.. వీటిలో పెట్టుబడి పెట్టండి..
- Technology
ఎయిర్టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేసింది...
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
భారత్‌లో (జులై 2022లో) టాప్ 10 కార్లు ఇవే.. బాలెనో, స్విఫ్ట్ కార్లను ఓవర్‌టేక్ చేసిన వ్యాగన్ఆర్..
భారతదేశంలో కారు కొనుగోలుదారులు ఎల్లప్పుడూ చిన్నకార్లకే పెద్దపీట వేస్తుంటారు. అందులోనూ ప్రత్యేకించి మారుతి సుజుకి విక్రయించే కార్లంటే, కస్టమర్లు కళ్లు మూసుకొని మరీ కొనేస్తుంటారు. అందుకే, ఎప్పుడు చూసిన భారతదేశంలో విక్రయించబడే టాప్ 10 కార్లలో సగానికి పైగా మారుతి సుజుకి కార్లే ఉంటాయి. గడచిన జులై 2022 నెలలో కూడా మారుతి సుజుకి కార్లదే పైచేయిగా నిలిచింది. అయితే, ఈసారి మారుతి సుజుకి యొక్క టాల్ బాయ్ కార్ వ్యాగన్ఆర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

చిన్నసైజు ఎస్‌యూవీ లాంటి వైఖరితో విశాలమైన స్థలాన్ని కలిగి మంచి డ్రైవింగ్ పొజిషన్ ను కలిగి ఉండే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది. మారుతి సుజుకి ఈ ఏడాది తమ 2022 మోడల్ వ్యాగన్ఆర్ ను మార్కెట్లో విడుదల చేసిన తర్వాత ఈ కారు అమ్మకాలు మరింత పెరిగాయి. దీంతో గత నెలలో వ్యాగన్ఆర్ భారతదేశంలో అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ కార్ మోడళ్ల జాబితాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

ఈ జాబితాలో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలువగా, మారుతి సుజుకి ఈకో అత్యధికంగా అమ్ముడైన వ్యాన్ మరియు మారుతి సుజుకి డిజైర్ అత్యధికంగా అమ్ముడైన సెడాన్ గా నిలిచింది. ఈ జాబితాలో మారుతి సుజుకి కార్లు కాకుండా టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ వెన్యూ మరియు టాటా పంచ్ వాహనాలు కూడా చోటు దక్కించుకున్నాయి. గత నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఆ టాప్ 10 కార్లు ఏవో చూద్దాం రండి.
Rank | Model | July'22 | July'21 | Growth (%) |
1 | Maruti WagonR | 22,588 | 22,836 | -1 |
2 | Maruti Baleno | 17,960 | 14,729 | 22 |
3 | Maruti Swift | 17,539 | 18,434 | -5 |
4 | Tata Nexon | 14,214 | 10,287 | 38 |
5 | Maruti Dzire | 13,747 | 10,470 | 31 |
6 | Maruti Eeco | 13,048 | 10,057 | 30 |
7 | Hyundai Creta | 12,625 | 13,000 | -3 |
8 | Hyundai Venue | 12,000 | 8,185 | 47 |
9 | Maruti S-Presso | 11,268 | 6,818 | 65 |
10 | Tata Punch | 11,007 | 0 | - |

1) మారుతి సుజుకి వ్యాగన్ఆర్ - 22,588 యూనిట్లు
భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో వ్యాగన్ఆర్ ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది. గత నెలలో మారుతి సుజుకి భారతదేశంలో మొత్తం 22,588 యూనిట్ల వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ లను విక్రయించింది. ఇది ప్రస్తుతం భారతదేశంలోని అనేక కార్ బ్రాండ్‌ల మొత్తం నెలవారీ విక్రయాల కంటే ఎక్కువనే విషయాన్ని మనం గమనించాలి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే వ్యాగన్ఆర్ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. జూలై 2021 నెలలో కంపెనీ విక్రయించిన 22,836 యూనిట్లతో పోలిస్తే గత నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలు 248 యూనిట్లు తగ్గాయి.

2) మారుతి సుజుకి బాలెనో - 17,960 యూనిట్లు
నెక్సా షోరూమ్ ల ద్వారా విక్రయించబడుతున్న మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లో కంపెనీ ఈ ఏడాది కొత్త 2022 మోడల్ ప్రవేశపెట్టిన తర్వాత కస్టమర్లు ఈ కారును కొనేందుకు క్యూ కడుతున్నారు. మారుతి సుజుకి గత నెలలో దేశంలో మొత్తం 17,960 యూనిట్ల బాలెనో హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించింది. జూలై 2021 నెలలో కంపెనీ 14,729 యూనిట్ల బాలెనో కార్లతో పోలిస్తే, గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 21.94 శాతం (3,231 యూనిట్లు) వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.

3) మారుతి సుజుకి స్విఫ్ట్ - 17,539 యూనిట్లు
మారుతి సుజుకి బాలెనో తర్వాత దేశంలో అత్యధికంగా అమ్ముడైన మరొక హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్. ఈ టాప్ 10 జాబితాలో మూడవ స్థానంలో నిలిచిన మారుతి సుజుకి స్విఫ్ట్, గత నెలలో 17,539 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. జులై 2021 నెలలో మారుతి సుజుకి విక్రయించిన 18,434 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో స్విఫ్ట్ అమ్మకాలు 4.86 శాతం (895 యూనిట్లు) తగ్గాయి.

4) టాటా నెక్సాన్ - 14,214 యూనిట్లు
టాటా నెక్సాన్ ఈ జాబితాలోకి చేరిన మొదటి మారుతీయేతర కారు మరియు జూలై అమ్మకాల చార్ట్‌లలో అత్యధిక ర్యాంక్ పొందిన ఎస్‌యూవీ. ప్రస్తుతం, మార్కెట్లో టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ రూపాల్లో అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ గత నెలలో 14,214 యూనిట్ల నెక్సాన్ ఎస్‌యూవీలను విక్రయించింది. జూలై 2021 నెలలో విక్రయించిన 10,287 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో నెక్సాన్ అమ్మకాలు 38.17 శాతం (3,927 యూనిట్లు) పెరిగాయి.

5) మారుతి సుజుకి డిజైర్ - 13,747 యూనిట్లు
జూలై 2022 సేల్స్ చార్ట్‌లలో డిజైర్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన సెడాన్. మారుతి సుజుకి గడచిన జూలై 2022 నెలలో మొత్తం 13,747 డిజైర్ సెడాన్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే సమయంలో (జులై 2021 నెలలో) విక్రయించిన 10,470 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు 31.30 శాతం (3,277 యూనిట్లు) పెరిగాయి.

6) మారుతి సుజుకి ఈకో - 13,048 యూనిట్లు
మారుతి సుజుకి భారత కార్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న మరియు అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉన్న మినీ వ్యాన్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తోంది. గత నెలలో మారుతి సుజుకి మొత్తం 13,048 యూనిట్ల ఈకో వ్యాన్ లను విక్రయించింది. జూలై 2021 నెలలో విక్రయించిన 10,057 యూనిట్ల ఈకో వ్యాన్ లతో పోలిస్తే, గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 29.74 శాతం (2,991 యూనిట్లు) పెరిగాయి.

7) హ్యుందాయ్ క్రెటా - 12,625 యూనిట్లు
హ్యుందాయ్ క్రెటా ఇప్పటికీ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా గడచిన జూలై నెలలో మొత్తం 12,625 యూనిట్ల క్రెటా ఎస్‌యూవీలను విక్రయించింది. జూలై 2021 నెలలో విక్రయించిన అమ్మకాలతో పోలిస్తే, గత నెలలో క్రెటా అమ్మకాలు స్వల్పంగా 2.88 శాతం (375 యూనిట్లు) తగ్గాయి. ఎందుకంటే, జూలై 2021లో, హ్యుందాయ్ 13,000 యూనిట్ల క్రెటా ఎస్‌యూవీలను విక్రయించింది.

8) హ్యుందాయ్ వెన్యూ - 12,000 యూనిట్లు
జూలై 2022లో హ్యుందాయ్ వెన్యూ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మూడవ ఎస్‌యూవీగా నిలిచింది. ఈ టాప్ 10 జాబితాలో 8వ స్థానంలో నిలించిన హ్యుందాయ్ వెన్యూ గత నెలలో 12,000 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇది జులై 2021 నెలలో విక్రయించిన 8,815 యూనిట్లతో పోలిస్తే 46.61 శాతం (3,815 యూనిట్ల) వృద్ధిని సాధించింది.

9) మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో - 11,268 యూనిట్లు
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో దాని ఎస్‌యూవీ తరహా లుక్‌లతో ఈ జాబితాలో 9వ స్థానాన్ని ఆక్రమించింది. మారుతి సుజుకి జూలై 2022 నెలలో మొత్తం 11,268 యూనిట్ల ఎస్-ప్రెస్సో కార్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో (జులై 2021 నెలలో) విక్రయించిన 6,818 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 65.27 శాతం (4,450 యూనిట్లు) పెరిగాయి.

10) టాటా పంచ్ - 11,007 యూనిట్లు
టాటా పంచ్ భారతదేశంలో గతేడాది చివరలో ప్రారంభించబడింది మరియు అప్పటి నుండి ఈ చిన్న ఎస్‌యూవీ స్థిరంగా టాప్ 10 జాబితాలో తన స్థానాన్ని దక్కించుకుంటూ ఉంది. గడచిన జులై 2022 నెలలో టాటా మోటార్స్ మొత్తం 11,007 యూనిట్ల పంచ్ మైక్రో ఎస్‌యూవీలను విక్రయించింది.