2022 ఫిబ్రవరి హ్యాచ్‌బ్యాక్ సేల్స్ రిపోర్ట్: టాప్‌లో నిలిచిన Maruti Swift, లాస్ట్ ఏదంటే?
భారతీయ మార్కెట్లో కార్ల తయారీ సంస్థలు 2022 ఫిబ్రవరి నెల అమ్మకాల నివేదికలు ఇప్పటికే విడుదలయ్యాయి. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో హ్యాచ్‌బ్యాక్ కార్లు ఆశించిన ఫలితాలు సాధించాయి. 2022 ఫిబ్రవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌ల గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

1. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift):
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి కంపెనీ యొక్క సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఒకటి. 2022 ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి తన సుజుకి స్విఫ్ట్ ని 19,202 యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తుంది. అయితే కంపెనీ గత ఏడాది మారుతి సుజుకి యొక్క స్విఫ్ట్ 20,264 యూనిట్లను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు మునుపటికంటే 5% తగ్గుదలను నమోదు చేసింది.

2. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R):
మారుతి సుజుకి కంపెనీ యొక్క టాప్-10 హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల జాబితాలో రెండవ కారు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్. గత నెలలో కంపెనీ ఈ కారు 14,669 యూనిట్లను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలిసింది. అయితే ఇదే ఏడాది ఇదే నెలలో కంపెనీ 18,728 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది కంపెనీ యొక్క అమ్మకాలు 22 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

3. మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno):
మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. మారుతి సుజుకి యొక్క మారుతి సుజుకి బాలెనో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 12,570 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో గత ఏడాది ఫిబ్రవరి నెలలో 20,070 యూనిట్లను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలిసింది. దీన్ని బట్టి చూస్తే మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు 37 శాతం క్షీణించాయి.
| Rank | Model | Feb'22 | Feb'21 | Growth (%) |
| 1 | Maruti Swift | 19,202 | 20,264 | -5 |
| 2 | Maruti WagonR | 14,669 | 18,728 | -22 |
| 3 | Maruti Baleno | 12,570 | 20,070 | -37 |
| 4 | Maruti Alto | 11,551 | 16,919 | -32 |
| 5 | Maruti Celerio | 9,896 | 6,214 | 59 |
| 6 | Hyundai Grand i10 | 8,552 | 10,270 | -17 |
| 7 | Maruti S-Presso | 8,140 | 7,040 | 16 |
| 8 | Hyundai i20 | 5,830 | 9,001 | -35 |
| 9 | Tata Altroz | 5,011 | 6,832 | -27 |
| 10 | Tata Tiago | 4,489 | 6,787 | -34 |

4. మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto):
మనం చెప్పుకుంటున్న టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల జాబితాలో నాలుగవ కారు మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto). ఈ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి ఆల్టో గత నెలలో మొత్తం 11,551 యూనిట్లను విక్రయించగా, గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో, కంపెనీ ఈ కారును 16,919 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది దీని విక్రయాలు 32 శాతం క్షీణించాయని ఈ నివేదికల ద్వారా తెలుస్తుంది.

5. మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio):
మారుతి సుజుకి కంపెనీ యొక్క మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఈ జాబితాలో 5 స్థానంలో నిలిచింది. టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల జాబితాలో మొదటి 5 స్థానాల్లో మారుతి సుజుకి నిలిచింది. ఇది నిజంగా గొప్ప విషయం. ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం 9,896 యూనిట్లు విక్రయించగా, 2021 ఫిబ్రవరిలో కంపెనీ 6,214 యూనిట్లను విక్రయించింది. అయితే అమ్మకాల పరంగా 59 శాతం పెరిగాయి.

5. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios):
హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ యొక్క గ్రాండ్ ఐ10 నియోస్ ఈ అమ్మకాల జాబితాలో 6 వ స్థానంలో ఉంది. కంపెనీ గత నెలలో కంపెనీ ఈ కారు మొత్తం 8,552 యూనిట్లను విక్రయించగా, ఇదే నెల 2021 లో కంపెనీ 10,270 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల పరంగా గత నెలలో 17 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

6. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso):
టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల జాబితాలో 7 వ స్థానంలో మారుతి కంపెనీ యొక్క ఎస్-ప్రెస్సో నిలిచింది. ఎస్-ప్రెస్సో గత నెలలో మొత్తం 8,140 యూనిట్లను విక్రయించింది. అంతే కాకూండా గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో 7,040 యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాల పరంగా గత నెలలో 16 శాతం పెరిగాయి.

8. హ్యుందాయ్ ఐ20 (Hyundai i20):
హ్యుందాయ్ ఇండియా యొక్క ఐ20 ఈ జాబితాలో 8 వ స్థానంలో నిలిచింది. కంపెనీ యొక్క ఈ హ్యాచ్‌బ్యాక్ 2022 ఫిబ్రవరిలో మొత్తం 5,830 యూనిట్లను విక్రయించింది. 2021 ఫిబ్రవరి నెలలో మొత్తం 9,001 యూనిట్లను విక్రయించగలిగింది. అమ్మకాల పరంగా కంపెనీ యొక్క అమ్మకాల పరంగా 35 శాతం క్షీణించాయి.

9. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz):
దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) యొక్క టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఈ జాబితాలో 9 వ స్థానంలో నిలిచింది. 2022 ఫిబ్రవరి నెలలో మొత్తం 5,011 యూనిట్లను విక్రయించింది. ఇదే నెల గత సంవత్సరం కంపెనీ యొక్క ఈ కారు 6,832 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది దీని విక్రయాలు 27 శాతం క్షీణించాయి.

10. టాటా టియాగో (Tata Tiago):
టాటా మోటార్స్ యొక్క టాటా టియాగో (Tata Tiago) ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ గత నెలలో, కంపెనీ ఈ కారు మొత్తం 4,489 యూనిట్లను విక్రయించింది. 2021 ఫిబ్రవరి నెలలో టాటా టియాగో 6,787 యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాల పరంగా 34 శాతం తగ్గుదలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications








