మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ కార్లకు ఎల్లప్పుడూ డిమాండ్ అధికంగా ఉంటుంది. సరసమైన ధర కారణంగా మొదటిసారిగా కొత్త కారును కొనుగోలు చేసే కస్టమర్లు ఎక్కువగా ఈ విభాగాన్నే ఎంచుకుంటుంటారు. మనదేశంలో, మెజారిటీ అమ్మకాలు కూడా ఇదే విభాగం నుండి జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో, గడచిన మార్చి 2022లో, దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 హ్యాచ్‌బ్యాక్‌ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాలను మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ కార్లే దక్కించుకున్నాయి. మరి ఏయే స్థానాల్లో ఏయే మోడళ్లు ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

1. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (24,634 యూనిట్లు)

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా విక్రయిస్తున్న టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ గడచిన మార్చి 2022 నెలలో 24,634 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 2021 నెలలో కంపెనీ కేవలం 18,757 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ సమయంలో వ్యాగన్ఆర్ అమ్మకాలు 31 శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త 2021 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ కొత్త మోడల్ డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ తో కూడా అందుబాటులో ఉంటుంది.

మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

2. మారుతి సుజుకి బాలెనో (14,520 యూనిట్లు)

మారుతి సుజుకి తమ నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఇటీవలే ఓ కొత్త 2022 మోడల్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మునుపటి కంటే రిఫ్రెష్డ్ డిజైన్ మరియు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. గడచిన మార్చి 2022లో ఈ ఇండో-జపనీస్ కార్ బ్రాండ్ మొత్తం 14,529 యూనిట్ల బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ కార్లను విక్రయించింది. అయితే, ఇవి మార్చి 2021లో విక్రయించిన 21,217 యూనిట్లతో పోలిస్తే, 32 శాతం క్షీణించాయి.

మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

3. మారుతి సుజుకి స్విఫ్ట్ (13,623 యూనిట్లు)

మార్కెట్లో ఎన్ని కొత్త కార్లు వచ్చినప్పటికీ, స్విఫ్ట్ మోడల్‌కు ఉండే క్రేజ్ మాత్రం తగ్గదు. ఎప్పటిలాగే ఈ కార్ టాప్ 10 జాబితాలో అగ్రస్థానాల్లో కొనసాగుతుంది. భారతదేశంలోని యువకులను ఆకట్టుకునే ఈ చిన్న కారు గడచిన మార్చి 2022 నెలలో 13,623 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే, మార్చి 2021 నెలలో కంపెనీ విక్రయించిన 21,714 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే గత నెలలో ఈ స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు 37 శాతం తగ్గుదలని నమోదు చేశాయి.

మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

4. హ్యుందాయ్ ఐ10 నియోస్ (9,687 యూనిట్లు)

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 నియోస్ అమ్మకాల పరంగా స్థిరమైన పనితీరును కనబరుస్తోంది. శాంత్రోకి ఎగువన మరియు ఐ20 మోడల్‌కి దిగువన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ను కోరుకునే వారికి గ్రాండ్ ఐ10 నియోస్ ఓ చక్కటి మోడల్ గా ఉంటుంది. గడచిన మార్చి 2022 నెలలో ఈ మోడల్ అమ్మకాలు 11,020 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, ఈ మోడల్ అమ్మకాలు 12 శాతం తగ్గాయి.

మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

5. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (7,870 యూనిట్లు)

మినీ/మైక్రో ఎస్‌యూవీ డిజైన్ తరహాలో మారుతి సుజుకి విక్రయిస్తున్న మోడల్ ఎస్-ప్రెస్సో, ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి గడచిన మార్చి 2022 నెలలో 7,870 యూనిట్ల ఎస్-ప్రెసో కార్లను విక్రయించింది. గతేడాది ఇదే నెల అమ్మకాలతో పోలిస్తే, గత నెలలో కంపెనీ 618 యూనిట్లను ఎక్కువగా విక్రయించగలిగింది. ఈ సమయంలో మారుతి సుజుకి ఎస్-ప్రెసో వార్షిక అమ్మకాలు 9 శాతం పెరుగుదలను చూశాయి.

మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

6. మారుతి సుజుకి ఆల్టో (7,621 యూనిట్లు)

మారుతి సుజుకి ఆల్టో భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా చాలా కాలంగా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండేది. చాలా మంది మొదటిసారి కారు కొనుగోలు చేయాలనే వారికి ఇదొక డిఫాల్ట్ ఎంపికగా ఉంటుంది. అయితే, గడచిన మార్చి 2022 నెలలో ఈ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు 7,621 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా. మార్చి 2021లో కంపెనీ విక్రయించిన 17,401 యూనిట్ల ఆల్టో కార్లతో పోలిస్తే, గడచిన మార్చిన నెలలో ఈ మోడల్ అమ్మకాలు దాదాపు 56 శాతం వరకూ తగ్గుదలని నమోదు చేశాయి.

మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

7. మారుతి సుజుకి సెలెరియో (6,442 యూనిట్లు)

మారుతి సుజుకి తమ సెలెరియో కారులో ఇటీవలే ఓ కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గడచిన మార్చి 2022 నెలలో మారుతి సుజుకి సెలెరియో అమ్మకాలు 6,442 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, గత నెలలో సెలెరియో హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు 36 శాతం వృద్ధి చెందాయి.

మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

8. టాటా ఆల్ట్రోజ్ (4,727 యూనిట్లు)

టాటా మోటార్స్ విక్రయిస్తున్న ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ గ్లోబల్-ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో మంచి సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకొని, ప్రస్తుతం దేశంలో కొనుగోలుకి అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ లలో ఒకటిగా ఉంది. అయితే, టాటా మోటార్స్ నుండి వచ్చిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, గడచిన మార్చి 2022లో కేవలం 4,727 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ సమయంలో ఆల్ట్రోజ్ అమ్మకాలు 37 శాతం క్షీణించాయి.

మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

9. హ్యుందాయ్ ఐ20 (4,693 యూనిట్లు)

హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా, హ్యుందాయ్ మార్చి 2022 నెలలో కేవలం 4,693 యూనిట్ల ఐ20 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, హ్యుందాయ్ ఐ20 అమ్మకాలు 48 శాతం తగ్గాయి.

మార్చి 2022 నెలలో టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు.. వీటిలో బెస్ట్ మోడల్ ఏదంటే..?

10. మారుతి సుజుకి ఇగ్నిస్ (4,472 యూనిట్లు)

ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది మారుతి సుజుకి విక్రయిస్తున్న ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్. కంపెనీ ఈ కారును తమ నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తోంది. గడచిన మార్చి నెలలో ఈ స్టైలిష్ లుకింగ్ హ్యాచ్‌బ్యాక్ మరియు 4,472 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ సమయంలో మారుతి సుజుకి ఇగ్నిస్ అమ్మకాలు 3 శాతం పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Monday, April 11, 2022, 16:23 [IST]
English summary
Top 10 best selling hatchbacks in march wagonr baleno swift i10 s presso and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+